వెంకటేష్‌ నూతన చిత్రం ఎప్పుడు?

Thu 28th May 2015 06:12 AM
venkatesh,gopala gopala,akula siva,ramanaidu,venkatesh new movie details  వెంకటేష్‌ నూతన చిత్రం ఎప్పుడు?
వెంకటేష్‌ నూతన చిత్రం ఎప్పుడు?
Sponsored links

‘గోపాల గోపాల’ చిత్రం విడుదలై ఇప్పటికీ 5నెలలు కావస్తోంది. అయినా వెంకటేష్‌ నూతన చిత్రంపై క్లారిటీ రావడంలేదు. దాంతో ఆయన అభిమానులు తమ హీరో ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడా? అని ఆశ్చర్యపోతున్నారు. ఈమధ్యకాలంలోనే కాదు... తన కెరీర్‌ మొదటి నుండి వెంకీ తన తదుపరి చిత్రాల విషయంలో ఇంత గ్యాప్‌ తీసుకోలేదు. సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేష్‌ ఇలా కామ్‌గా ఉండటం మీడియా వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌ తన తండ్రి రామానాయుడు మరణం తర్వాత ఫిబ్రవరి నుండి చాలారోజులు సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఉత్తర భారతదేశ యాత్ర చేసి వచ్చాడు. ఆ సమయంలోనే ప్రముఖ రచయిత ఆకుల శివతో తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌లో పాల్గొన్నాడు. ఎప్పుడు నీట్‌గా షేవ్‌ చేసుకొని ఉండే ఆయన గడ్డంతో కనిపిస్తున్నాడు. కాగా జూన్‌ 6 వతేదీన అంటే తన తండ్రి రామానాయుడు జయంతి సందర్బంగా వెంకీ ఆకుల శివ కథతో సినిమా ప్రారంభించనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రానికి దర్శకుదు ఎవరు అనేది తెలియాల్సివుంది!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019