ప్రభాస్‌ ‘బాహుబలి’కే అంకితమైపోతాడా?

Thu 28th May 2015 05:15 AM
prabhas,telugu movie bahubali,bahubali on july 10th,director sujeeth  ప్రభాస్‌ ‘బాహుబలి’కే అంకితమైపోతాడా?
ప్రభాస్‌ ‘బాహుబలి’కే అంకితమైపోతాడా?
Sponsored links

దాదాపు రెండు సంవత్సరాలకుపైగా ‘బాహుబలి’ చిత్రంతోనే ట్రావెల్‌ అవుతున్న ప్రభాస్‌కి మరో సినిమా చేసే ఆలోచన వున్నట్టు కనిపించడం లేదు. ఎట్టకేలకు ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ జూలై 10న రిలీజ్‌ అవుతోందన్న వార్త వచ్చింది. అయితే పార్ట్‌ 1 నాలుగు గంటలు వుందని, దాన్ని ఎడిట్‌ చేసి రెండున్నర గంటలకు తెచ్చే పనిలో వున్నారని తెలుస్తోంది. మిగిలిన గంటన్నర సినిమాని రెండో భాగానికి కలుపుతారా? లేక మళ్ళీ మరో నాలుగు గంటలు సినిమా తీస్తారా అనే దానిపై సరైన క్లారిటీ లేదు. మొదటి పార్ట్‌ రిలీజ్‌కి వస్తున్నప్పటికీ ప్రభాస్‌ గెటప్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఎక్కడికి వచ్చినా పెరిగిన జుట్టు, మాసిన గడ్డంతోనే వస్తున్నాడు. దీన్ని బట్టి సెకండ్‌ పార్ట్‌లో ప్రభాస్‌ పార్ట్‌ చాలా వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే రన్‌ రాజా రన్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన సుజీత్‌ తన నెక్స్‌ట్‌ మూవీ ప్రభాస్‌తో చేయబోతున్నాడట. ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు ప్రభాస్‌ స్నేహితులు వంశీ, ప్రమోద్‌లు కూడా రెడీగా వున్నారు. ‘బాహుబలి’ సినిమా కంప్లీట్‌ అయిన తర్వాత సుజీత్‌ సినిమా చేస్తాడా? లేక బాహుబలి చేస్తూనే ప్యారలల్‌గా ఈ సినిమా కూడా చేస్తాడా అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. అయితే బాహుబలి పూర్తయ్యే వరకూ ప్రభాస్‌ మరో సినిమా చేసే అవకాశం లేదని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019