Advertisementt

సుక్కు ఇంటి నుంచి హీరో

Sat 23rd May 2015 11:46 AM
sukumar,new hero from sukumar family,ntr,sukumar,kumari 21 f,   సుక్కు ఇంటి నుంచి హీరో
సుక్కు ఇంటి నుంచి హీరో
Advertisement
Ads by CJ
ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటి నుంచి హీరో వ‌స్తున్నాడు. సుక్కు  అన్న కొడుకు అశోక్ క‌థానాయ‌కుడిగా తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. సుకుమార్ ద‌గ్గ‌రే  `100%ల‌వ్‌`,  `1` (నేనొక్క‌డినే) త‌దిత‌ర చిత్రాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడు అశోక్. ఇప్పుడు క‌థానాయ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించేందుకు రంగం సిద్ధం చేసుకొన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ద‌ర్శ‌కనిర్మాత‌లు ఎవ‌రు?  సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంద‌నే విష‌యాలు  మాత్రం ఇంకా బ‌య‌టికి రాలేదు. స్టార్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ ఇటీవ‌ల చిన్న సినిమాల్ని స్వ‌యంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకొన్నాడు. అందులో భాగంగా ప్ర‌స్తుతం `కుమారి 21ఎఫ్‌` అనే చిత్రం తెర‌కెక్కుతోంది. త‌దుప‌రి త‌న అన్న‌కొడుకుతోనే సినిమా తీస్తుండొచ్చేమో అని ప్ర‌చారం సాగుతోంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ