Advertisement

పూర్వజన్మ ఆధారంగా 'కథనం' సినిమా..!

Sat 23rd May 2015 03:58 AM
kathanam movie,ranjith,archana,sai kiran mukkamala  పూర్వజన్మ ఆధారంగా 'కథనం' సినిమా..!
పూర్వజన్మ ఆధారంగా 'కథనం' సినిమా..!
Advertisement

రంజిత్, అర్చన జంటగా మాంత్రిక్స్ మీడియా వర్క్స్ పతాకంపై సాయికిరణ్ ముక్కామల దర్శక నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శుక్రవారం(మే22)న హైదరాబాద్ లో విడుదల చేసారు. ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి పోస్టర్ ను లాంచ్ చేయగా, బ్యాట్మింటన్ క్రీడాకారుడు చేతనానంద్ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసారు. ఈ సందర్భంగా సాయికిరణ్ ముక్కామల మాట్లాడుతూ "ఇదే బ్యానర్ లో గతంలో 'థియేటర్ లో' నిర్మాతగా వ్యవహరించాను. ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవనున్నాను. ఇప్పటికే ఈ చిత్రం తొంబై శాతం షూటింగ్ పూర్తిచేసుకొంది. ప్రతి మనిషి జీవితంలో ఓ కథ ఉంటుంది దానికో కథనం ఉంటుంది అదే ఈ సినిమా. 'ఎ ప్లే ఆఫ్ గాడ్' అనే ఉపశీర్షిక తో వస్తున్న ఈ చిత్రం బ్యానర్ కి మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

చేతనానంద్ మాట్లాడుతూ "కథనం టీం అందరికి ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది" అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ "సాయికిరణ్ ఆరు నెలలు కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్" అని అన్నారు.

అర్చన మాట్లాడుతూ "కన్నడలో మూడు చిత్రాలలో నటించాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఇదొక డిఫరెంట్ స్టొరీ. అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.

రంజిత్ మాట్లాడుతూ "ఒక డాక్టర్ గా ఇప్పటివరకు అందరికి న్యాయం చేసాను. ఓ నటునిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్ తో సినిమాలలోకి వచ్చాను. ఉద్దేశ్యపూర్వకంగా తీసిన సినిమా ఇది. రెండు సంవత్సరాల క్రితం 2012 డిసెంబర్ లో జరిగిన నిర్భయ సంఘటన నన్ను ఎంతగానో బాధించింది. అది మాత్రమే కాకుండా రీసెంట్ గా నేపాల్ వచ్చిన భూకంపం అందరిని కుదిపేసింది. ఇంత దారుణంగా అకాల మరణాలు చెండానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో పుట్టిన కథే ఇది. పూర్వ జన్మలో మనుషులు చేసిన పాపాల వలన వారు దారుణమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారు. అదే ఆదారంగా చేసుకొని ఓ వ్యక్తి జీవితాన్ని ఈ చిత్రంలో చూపించాం. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమరామెన్: సురేష్ గోంట్ల, మ్యూజిక్: సాబు వర్గీస్, లిరిక్స్: విజయేంద్ర చేలో, ఎడిటర్: కె.రమేష్, ఆర్ట్: ప్రేమ్, కో ప్రొడ్యూసర్: రంజిత్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement