Advertisementt

కేసీఆర్‌ చేతుల మీదుగా ‘బందూక్‌’ ఆడియో ఆవిష్కరణ..!

Fri 22nd May 2015 05:59 AM
kcr,bandook movie,telangana government,vidhyasagarao  కేసీఆర్‌ చేతుల మీదుగా ‘బందూక్‌’ ఆడియో ఆవిష్కరణ..!
కేసీఆర్‌ చేతుల మీదుగా ‘బందూక్‌’ ఆడియో ఆవిష్కరణ..!
Advertisement
Ads by CJ

పూర్తి తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన ‘బందూక్‌’ చిత్ర ఆడియో సీడీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు తన క్యాంపు ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘బందూక్‌’ చిత్ర నిర్మాత గుజ్జ యుగంధర్‌రావు, దర్శకుడు లక్షణ్‌ మురారీ(బాబీ), కో-డైరెక్టర్‌ రమేష్‌, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్‌ఎల్‌ఎ గాదరి కిషోర్‌, ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ పోరాట ఉద్యమ నేపథ్యాన్ని విస్తరిస్తూ.. పూర్తిగా తెలంగాణ కళాకారుల, సాంకేతిక నిపుణులతో ‘బందూక్‌’ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఈ చిత్రంలోని పాటలు, అలాగే చిత్రం మంచి విజయం సాధిస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కళాకారులు, సాంకేతిక నిపుణులు మరింత క్రియాశీలకంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను. త్వరలో ఈ సినిమా ప్రివ్యూని కూడా చూస్తాను..’’ అన్నారు. 

దేశపతి శ్రీనివాస్‌, మిధున్‌రెడ్డి, చైతన్య, జోషి, దేవా, మధు, శహెరా మొదలగువారు ఈ చిత్ర తారాగణం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ