Advertisementt

సుధీర్ సినిమాలో మ‌నోజ్‌

Thu 21st May 2015 04:03 AM
mosagallaku mosagadu,sudeerbabu,manchu manoj in mosagallaku mosagad,manoj,sudheerbabu,  సుధీర్ సినిమాలో మ‌నోజ్‌
సుధీర్ సినిమాలో మ‌నోజ్‌
Advertisement
Ads by CJ
టాలీవుడ్‌లో యువ క‌థానాయ‌కుల మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఒక‌రికొక‌రు దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహపూర్వ‌కంగా మెలుగుతున్నారు. క‌లిసిమెల‌సి న‌టించేందుకు కూడా ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇదివ‌ర‌కు ఇలా ఉండేది కాదు. నువ్వా నేనా అన్న‌ట్టు పోటీ  క‌నిపించేది. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని మార్చేశారు. అందుకే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు విరివిగా తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌స్తుతం యంగ్ హీరోలు కూడా ఆ స్ఫూర్తిని అంది పుచ్చుకొంటున్నారు. వాళ్లు కూడా క‌లిసిమెల‌సి న‌టిస్తున్నారు. తాజాగా యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబు చిత్రం `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`లో మంచు మ‌నోజ్ న‌టించాడు. ఓ అతిథి పాత్ర‌లో మ‌నోజ్ త‌ళుక్కున మెరుస్తాడ‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా సుధీర్‌బాబే వెల్ల‌డించారు. మంచు మ‌నోజ్ తెర‌పై ఎంత‌సేపు సందడి చేస్తార‌న్న‌ది మాత్రం తెలియ‌దు. ఇటీవ‌ల సుధీర్ కూడా మంచు ల‌క్ష్మి న‌టించిన `దొంగాట‌`లోని ఓ పాట‌లో మెరిశాడు. అందుకు బ‌దులుగా మ‌నోజ్ న‌టించాడ‌న్న‌మాట‌. `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ