Advertisementt

'మొగలి పువ్వు' మూవీ టీజర్ లాంచ్..!

Sat 16th May 2015 12:29 PM
mogali puvvu,ram gopal varma,sachin joshi,anil katari  'మొగలి పువ్వు' మూవీ టీజర్ లాంచ్..!
'మొగలి పువ్వు' మూవీ టీజర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

సచిన్ జోషి, మీరాచోప్రా జంటగా జెడ్3 ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మొగలిపువ్వు'. ఈ సినిమా టీజర్ లాంచ్ శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ''రొమాన్స్ , ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇది. మొగలిపువ్వు పుష్పం అయినప్పటికీ డేంజర్ అని మన మైథలాజికల్ పురాణాలలో చెప్పారు. అలాంటి వ్యక్తిత్వం గల ఓ అమ్మాయిని బేస్ చేసుకొని సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. మనిషి జీవితంలోకి మొబైల్ ఫోన్స్ వచ్చాక అన్నింటికంటే వాటినే జాగ్రత్తగా దాచుకుంటున్నారు. ఫోన్ లో మనం దాచుకునే విషయాలు పక్కన ఉండే వాళ్లకు కూడా తెలియవు. అదే టెక్నాలజీను మిస్ యూజ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమాలో చూపించాం. ఈ టెక్నాలజీతో ఫ్యామిలీ జీవితాలు ఎలా మారుతున్నాయో కూడా చూపిస్తున్నాం. పెళ్ళైన వ్యక్తి తన ఆఫీస్ లో పని చేసే ఓ అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకుంటే తరువాత వాళ్ళ మొబైల్ ఫోన్స్ ద్వారా వారి కుటుంబాలు ఎలా మారాయో ఈ చిత్రంలో చూపించాం" అని అన్నారు.

సచిన్ జోషి మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ పెళ్ళైన వ్యక్తి జీవితంలో ఓ అమ్మాయి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ సినిమాలో చూపించారు" అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ అనిల్ కటాని పాల్గొన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ