Advertisementt

ఓవర్సీస్‌లో బాలయ్య సందడి!

Thu 14th May 2015 06:16 AM
balakrishna,lion movie,overseas market,balayya fans,balayya craze,pawan kalyan  ఓవర్సీస్‌లో బాలయ్య సందడి!
ఓవర్సీస్‌లో బాలయ్య సందడి!
Advertisement
Ads by CJ

విదేశాల్లో సీనియర్‌ మోస్ట్‌ కథానాయకుల హవా తక్కువే. పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ తదితరుల సినిమాలు విడుదలైనప్పుడే అక్కడ హడావుడి ఉంటుంది. బెన్ఫిట్‌ షోలనీ, ప్రీమియర్‌లనీ ముఖ్యంగా అమెరికాలో తెలుగు అభిమానులు పెద్దయెత్తున సందడి చేస్తుంటారు. అయితే పెద్ద హీరోల సినిమాలకి మాత్రం అంత క్రేజీ ఉండదు. బాలయ్య సినిమా అంటే అక్కడక్కడ  కొన్నిచోట్ల మాత్రమే ప్రదర్శితమయ్యేది. 

‘లయన్‌’తో మాత్రం బాలయ్య కూడా  ఓవర్సీస్‌లో జోరు పెంచేశాడు. ఈ సినిమాని ఏకంగా వంద ప్రింట్లతో ఓవర్సీస్‌లో విడుదల చేస్తున్నారు. బాలయ్య సినిమాలకి ఈ సంఖ్య ఎక్కువే. లోకల్‌గా బిజినెస్‌ క్రేజ్‌ తక్కువగానే అనిపించినా... ఓవర్సీస్‌లో మాత్రం ఈసారి బాలయ్య హవా బాగానే ఉందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో బాలయ్య అభిమానులు ఓవర్సీస్‌లో పెద్దయెత్తున సందడి చేస్తూ సినిమా విడుదలకి ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకంగా భావించి ‘లయన్‌’తో ఓవర్సీస్‌ నుంచి రికార్డు వసూళ్లు తెప్పించాలని బాలయ్య అభిమానులు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ