Advertisement

ఆడియో రివ్యూ: కిక్‌ 2

Wed 13th May 2015 11:03 PM
raviteja new movie kick 2,kick 2 audio review,ss thaman,surender reddy,rakul preeth singh  ఆడియో రివ్యూ: కిక్‌ 2
ఆడియో రివ్యూ: కిక్‌ 2
Advertisement

రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన ఎస్‌.ఎస్‌.థమన్‌ దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్‌లో రూపొందుతున్న సీక్వెల్‌ ‘కిక్‌2’ చిత్రానికి కూడా సంగీతం అందించాడు. కిక్‌ పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. మరి కిక్‌2 ఆడియో శ్రోతలకు ఏ రేంజ్‌లో కిక్‌ ఇచ్చిందో చూద్దాం. 

ఈ ఆల్బమ్‌లో మొదటి పాట బొంబాయి భోలే రచించి గానం చేసిన ‘మమ్మీ’. ఈ పాటకు భోలే సాహిత్యం అందించాడు అనే కంటే కొన్ని పిచ్చి మాటలతో పాట తయారు చేశాడని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగానే ఈ పాటను పాడాడు. ఈ పాట రికార్డింగ్‌ క్వాలిటీ కూడా చాలా తక్కువగా వుంది. వరికుప్పల యాదగిరి రాసిన రెండో పాట ‘నువ్వే నువ్వే’. ఈ పాటను జోనిటా గాంధీ, థమన్‌ పాడారు. థమన్‌ గతంలో చేసిన పాటలాగే అనిపించినా మెలోడీ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది. మూడోపాట శ్రీమణి రాసిన ‘జెండాపై కపిరాజు’. ఈ పాటను దివ్యకుమార్‌, జోనిట గాంధీ, రాహుల్‌ నంబియార్‌, దీపికా నివాస్‌, హనుమంతరావు గానం చేసిన ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్‌ని తెలుపుతుంది. సిట్యుయేషన్‌ పరంగా వచ్చే ఈ పాట సినిమాలో ఆకట్టుకునే అవకాశం వుంది. సంగీతపరంగా, సాహిత్యపరంగా చూస్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట కాదు. నాలుగో పాట వరికుప్పల యాదగిరి రాసిన ‘మస్తానీ మస్తానీ’. దీపక్‌, మాన్సి పాడిన ఈ పాట లిరిక్‌ పరంగా, మ్యూజిక్‌ పరంగా మాస్‌ పాటలా అనిపిస్తుంది. వినగా వినగా బాగుందనిపిస్తుంది. ఈ పాటకి సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎక్కువ పాపులారిటీ వచ్చే అవకాశం వుంది. ఐదోపాట శ్రీమణి రాసిన ‘టెంపుల్‌ సాంగ్‌’. నివాస్‌, రాహుల్‌ నంబియార్‌, సంజన, మోనిషా గానం చేసిన ఈ పాట కూడా సిట్యుయేషనల్‌ సాంగ్‌గా వస్తుంది. సినిమాతోపాటు చూడడానికి తప్ప వినడానికి అంత ఇంపుగా లేని పాట ఇది. ఆరోపాట కాసర్ల శామ్‌ రచించిన ‘కిక్‌’ టైటిల్‌ సాంగ్‌. ఈ పాటను సింహ, స్ఫూర్తి గానం చేశారు. ఏమాత్రం కొత్తదనం లేని పాట ఇది. సాహిత్యంగానీ, మ్యూజిక్‌గానీ ఇంతకుముందు విన్న పాటలాగే అనిపిస్తుంది. సినిమాలో వచ్చి పోయే పాట తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. ఈ పాటకు సంబంధించి విశేషంగా చెప్పుకోవాలంటే 13 సంవత్సరాల స్ఫూర్తి ఈ పాటను సింహాతో కలిసి పాడిరది. 

‘కిక్‌’తో పోల్చుకుంటే ‘కిక్‌2’ ఆడియో అంతగా ఆకట్టుకునేలా లేదు. థమన్‌ మొదటి సినిమా కిక్‌లోని పాటలు చాలా ఫ్రెష్‌గా వుండడమే కాకుండా డిఫరెంట్‌ ఆర్కస్ట్రయిజేషన్‌తో మళ్ళీ మళ్ళీ వినేలా చేశాయి. ఆ పాటలు సినిమాకి కూడా చాలా ప్లస్‌ అయ్యాయి. ‘కిక్‌2’ ఆడియో విషయానికి వస్తే సాహిత్యపరంగా, సంగీత పరంగా చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. ఈమధ్యకాలంలో వచ్చిన థమన్‌ ఆడియోల్లో సినిమాకి చాలా మైనస్‌ అయ్యే ఆడియో ఇది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement