'గుంటూరు టాకీస్‌' పేరుతో సినిమా!

Sun 10th May 2015 06:54 AM
guntur talkies movie,praveen sattaru director,lbw movie,siddu,madhu shalini  'గుంటూరు టాకీస్‌' పేరుతో సినిమా!
'గుంటూరు టాకీస్‌' పేరుతో సినిమా!
Sponsored links

అవార్డు విన్నింగ్ డైర‌క్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న తీసిన `చంద‌మామ క‌థ‌లు`కి ఇటీవ‌లే జాతీయ అవార్డు ల‌భించింది. అంత‌కుముందు తీసిన 'ఎల్బీడ‌బ్ల్యూ', `రొటీన్ ల‌వ్‌స్టోరీ` చిత్రాల‌కి కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇప్పుడు ఆయ‌న మ‌రో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి గుంటూరు మురికివాడల నేప‌థ్యంలో `గుంటూరు టాకీస్‌` పేరుతో సినిమా చేయ‌బోతున్నారు.
ఇందులో `ఎల్బీడ‌బ్ల్యూ`  ఫేమ్ సిద్ధు క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్నారు. మ‌ధుశాలిని క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంది. కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధాదాస్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్, న‌రేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలున్నాయి.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019