Advertisement

'పండగ చేస్కో' ఆడియో రిలీజ్..!

Sat 02nd May 2015 03:04 AM
pandaga chesko movie,audio release,gopi malineni,paruchuri prasad,ram  'పండగ చేస్కో' ఆడియో రిలీజ్..!
'పండగ చేస్కో' ఆడియో రిలీజ్..!
Advertisement

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పండగ చేస్కో’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డైరెక్టర్ శ్రీనువైట్ల బిగ్‌ సీడీని ఆవిష్కరించి తొలి సీడీని దర్శకుడు సురేందర్ రెడ్డి కి అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ "ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని తెలుస్తుంది. ఇంతమంది ఆర్టిస్టులతో సినిమాను తెరకెక్కించడం గొప్ప విషయం. గోపి మలినేని చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. డైరెక్టర్ గా తనేంటో నిరూపించుకున్నాడు. రామ్ చాలా డెడికేషన్, సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. తను నటించిన రెడీ, కందిరీగ చిత్రాలకంటే 'పండగచేస్కో' ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. తమన్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమా కోసం చాలా కష్టపడతాడు. సినిమా మ్యూజికల్ మంచి హిట్ అవుతుంది అందులో డౌట్ లేదు" అని అన్నారు. 

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ "గోపి కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది. రామ్ ను చూస్తే అతనిలో ఎనర్జీ, కాన్ఫిడెన్స్ కనిపిస్తాయి. సినిమా కోసం చాలా కష్టపడతాడు. మ్యూజికల్ గా సినిమా పెద్ద హిట్ అవుతుంది. చిత్రబృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ "ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ప్రతి నిమిషం సినిమా కోసం తపన పడుతూ ఉంటాడు. నాకు ఈ సినిమా స్టొరీ లైన్ చెప్పినప్పుడు బాగా వస్తుందనే నమ్మకంతో ముందుగానే నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాను. గోపి బాగా డీల్ చేయగలడు, సత్తా ఉన్న దర్శకుడు. రామ్ కెరీర్ లో 'పండగ చేస్కో' బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. సినిమాలో 5 పాటలు అధ్బుతంగా ఉన్నాయి. ఓ మెలోడీ సాంగ్ విపరీతంగా నచ్చింది. తమన్ మంచి స్వరాల్ని అందించాడు. వేసవి సెలవుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది" అని తెలిపారు.

వీరుపోట్ల మాట్లాడుతూ "పాటలు బాగున్నాయి. రామ్ లాంటి హీరోకి ఇలాంటి టైటిల్ యాప్ట్ అవుతుంది. గోపి మంచి టెక్నీషియన్ మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా" అని అన్నారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ "గోపి మలినేని మొదటి చిత్రం నుండి నేను పాటలు రాస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు రాసాను. తమన్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రామ్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇస్తుంది" అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ "100 శాతం ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది" అని అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ "ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ అధ్బుతంగా నటించాడు. రకుల్, సోనాల్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో వీకెండ్ వెంకట్రావ్ అనే విచిత్రంగా ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఉండే పాత్రలో నటించాను" అని అన్నారు.

గోపి మలినేని మాట్లాడుతూ "బలుపు సినిమా తరువాత ఎంతో జాగ్రత్తగా చేసిన సినిమా ఇది. చాలా రోజులు తరువాత రామ్ లో ఓ కొత్త యాంగల్ ను చూడబోతున్నారు. సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలకు రామ్ ప్రాణం పోసాడు. రకుల్, సోనాల్ చాలా బాగా నటించారు. తమన్ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. భాస్కరభట్ల చాలా మంచి సాహిత్యాన్ని అందించారు" అని చెప్పారు.

రామ్ మాట్లాడుతూ "చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు మంచి లిరిక్స్ అందించారు. ఇంత మంచి కథ దొరకడం నా అద్రుష్టం. ఈ కథను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళారు డైరెక్టర్ గోపి మలినేని. 18 నెలల తరువాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. చాలా గ్యాప్ తీసుకున్నాను ఈ సమయం లో మూడు చిత్రాలకు పని చేసాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను" అని తెలిపారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ "నన్ను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసినందుకు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి నా ధన్యవాదాలు. తమన్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేసి డాన్సులు చేసాం. మూవీ షూటింగ్ పండగలా జరిగింది" అని అన్నారు.

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి థాంక్స్. ఈ సినిమాకి పనిచేయడం వలన  మంచి ఎక్స్ పీరియన్స్ వచ్చింది" అని చెప్పారు.

ఎనర్జిటిక్‌స్టార్‌ రామ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచనా సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: సమీర్‌రెడ్డి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,  ఫైట్స్‌: రామ్‌`లక్ష్మణ్‌,  సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డాన్స్‌: రాజు సుందరం, కాస్ట్యూమ్స్‌: రమేష్‌, మేకప్‌: టి.నాగు, చీఫ్‌ కోడైరెక్టర్‌: బి.సత్యం, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: యోగానంద్‌, సమర్పణ: పరుచూరి ప్రసాద్‌, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement