Advertisementt

రేపటి నుంచి ‘దొంగాట’ స్టార్ట్‌ అవుతోంది?

Fri 01st May 2015 04:14 AM
telugu movie dongata,manchu laxmi,dongata movie on 2nd may,director vamsi krishna  రేపటి నుంచి ‘దొంగాట’ స్టార్ట్‌ అవుతోంది?
రేపటి నుంచి ‘దొంగాట’ స్టార్ట్‌ అవుతోంది?
Advertisement
Ads by CJ

మంచు లక్ష్మీ, అడివి శేష్‌, ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో వంశీ కృష్ణ దర్శత్వంలో మంచు లక్ష్మీ నిర్మించిన ‘దొంగాట’ చిత్రాన్ని మే 2న రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి మే 1న ఈ చిత్రం విడుదల కావాల్సి వుంది. అయితే ఉత్తమ విలన్‌, గంగ వంటి భారీ చిత్రాలు కూడా మే 1న రిలీజ్‌కి వుండడంతో ‘దొంగాట’ చిత్రాన్ని త్వరలో రిలీజ్‌ చేస్తామని నిర్మాత ప్రకటించారు. ఈరోజు ఆ రెండు సినిమాలు రిలీజ్‌ కావడం లేదని తెలియడంతో ‘దొంగాట’ చిత్రాన్ని మే 2న అంటే రేపు రిలీజ్‌ చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. మునుపెన్నడూ లేని విధంగా సినిమాల రిలీజ్‌ విషయంలో అయోమయ పరిస్థితి ఏర్పడడంతో నిర్మాతలే కాదు ప్రేక్షకులు కూడా షాక్‌ తిన్నారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలీని పరిస్థితి ఫస్ట్‌ టైమ్‌ ఆడియన్స్‌ అనుభవంలోకి వచ్చింది. రిలీజ్‌ విషయంలోనే ఇంత కన్‌ఫ్యూజన్‌ వున్న ఈ సినిమాల ఫలితాలు ఏవిధంగా వుండబోతున్నాయన్న విషయంలో కూడా ఎవరూ ఎలాంటి నిర్ధారణకి రాలేకపోతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ