Advertisementt

కాజల్‌ సినిమాలకి స్వస్తి చెప్పబోతోందా..!

Fri 01st May 2015 01:49 AM
kajal,kajal ready for marriage,kajal movie with ajay devagan,kajal  కాజల్‌ సినిమాలకి స్వస్తి  చెప్పబోతోందా..!
కాజల్‌ సినిమాలకి స్వస్తి చెప్పబోతోందా..!
Advertisement
Ads by CJ

 

అందం, అభినయం కాజల్‌ సొంతం. ఇప్పటి వరకు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన నటనతో అలరించిందీ చందమామ. మరీ అందం ఇకపై స్క్రీన్‌పై అదృశ్యం కానుందా? అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహిత వర్గాలు. ఏ వ్యకికైనా ప్రొఫెషన్‌తోపాటు, పర్సనల్‌ లైఫ్‌ కూడా ఉంటుంది. కాజల్‌ కథానాయికగా చిత్ర రంగ ప్రవేశం చేసి పదేళ్ళు పూర్తి కావొస్తుంది. ఈ జర్నీలో ఆమెకి చెప్పుకోదగ్గ సినిమాలే పడ్డాయి. తను చేసిన సినిమాలతో వర్క్‌ శాటిస్‌ఫేక్షన్‌ ఉందని, అంతకు మించి తను ఏమీ కోరుకోవడం లేదనీ ఎన్నోసార్లు చెప్పింది కాజల్‌. ఇక సినిమాలపై తనకు మోజు తగ్గినట్టుంది. అందుకే పెళ్లి వైపు తన మనసును పరుగుపెట్టిస్తోంది. 

ప్రస్తుతం కాజల్‌ తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఓ సినిమా చేస్తుంది. ఇవి కాకుండా అజయ్‌ దేవగణ్‌తో ఓ సినిమా అంగీకరించినట్లు  సమాచారం. ఈ సినిమానే కాజల్‌కి చివరి సినిమా అంటున్నారు తన సన్నిహిత వర్గాలు. ఎందుకంటే ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లికి సిద్దమవుతోందట. వచ్చే ఏడాదికి తన పెళ్ళి ఖాయమంటున్నారు. మరి ఉన్నట్టుండి వెండి తెరకు దూరమైతే కాజల్‌ అభిమానులంతా ఎలా జీర్ణించుకుంటారో చూడాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ