Advertisementt

మే 2న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ టీజర్‌ లాంచ్‌

Thu 30th Apr 2015 03:35 AM
dhanalaxmi talupu tadithe movie teaser,tummalapalli rama satyanarayana,dhanraj  మే 2న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ టీజర్‌ లాంచ్‌
మే 2న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ టీజర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో.. ధనరాజ్‌, మనోజ్‌నందం, శ్రీముఖి, సింధుతులాని, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, నాగబాబు, తాగుబోతు రమేష్‌ ముఖ్యతారాగణంగా భీమవరం టాకీస్‌ పతాకంపై.. సాయి అచ్చుత్‌ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న నాన్‌స్టాప్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌ ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ఈ చిత్రం టీజర్‌ను మే 2వ తారీఖున దర్శకరత్న డా॥దాసరి నారాయణరావు విడుదల చేయనున్నారు. హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ఇందుకు వేదిక కానుంది. 

ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఫస్ట్‌ లుక్‌ను సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ రిలీజ్‌ చేసారు. ఇప్పుడు ఈ చిత్రం టీజర్‌ను లెజండరీ డైరెక్టర్‌ డా॥దాసరి నారాయణరావు విడుదల చేయనున్నారు. మే2 ఉదయం ఈ కార్యక్రమం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరగనుంది. ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రం కోసం పని చేసినవాళ్లంతా.. ధనం కోసం కాకుండా ధనరాజ్‌ పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతో పనిచేయడం వల్ల అవుట్‌పుట్‌ బ్రహ్మాండంగా వచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చాలా పర్‌ఫెక్ట్‌గా, స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఆడియోను త్వరలో విడుదల చేసి, మే నెలాఖరుకు సినిమాను రిలీజ్‌ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

భోలో శావలి సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌: జి.శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ మల్లు (యుఎస్‌ఎ)`ప్రతాప్‌ భీమిరెడ్డి (యుఎస్‌ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`సంభాషణలు`దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ