Advertisementt

'శనిదేవుడు2' పూజా కార్యక్రమం..!

Sat 18th Apr 2015 10:51 AM
sanidevudu part2,jonnalagadda siva,guddeti basavappa meru  'శనిదేవుడు2' పూజా కార్యక్రమం..!
'శనిదేవుడు2' పూజా కార్యక్రమం..!
Advertisement
Ads by CJ

సర్వేశ్వర మూవీస్ బ్యానర్ పై గుద్దేటి బసవప్ప మేరు నిర్మిస్తున్న చిత్రం 'శ్రీ శనిదేవుడు'(పూజామహిమలు) పార్ట్ 2. ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమం ఏప్రిల్ 18న శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు జొన్నలగడ్డ శివ మాట్లాడుతూ "శనీస్వరున్ని శని, శని అని పిలవకూడదు. శని కూడా దేవుడా, అందుకే శని దేవుడు అనీ, శనిదేవుడు మంచివాడే తప్ప చెడ్డవాడు కాదు అనీ శనిదేవుడు చిత్రం తీసి చూపించడం జరిగింది. ఇప్పుడు శ్రీ శనిదేవుడు 2 చిత్రంలో శని దేవుడు వలన బాధలు పడుతున్న వారందరు ఎటువంటి రెమిడీస్ చేసుకోవాలి అన్న విషయాలను మరియు పూజా మహిమలను చూపిస్తున్నాం. శనిదేవుడు చెడ్డవాడు కాదు మంచి వాడని తెలుసుకొని భక్తులు భయంతో పూజించడం మాని, భక్తితో ఇంటింటా శనిదేవుడిగా ఎప్పుడు పూజిస్తారో అప్పటివరకు ఈ శనిదేవుడు సిరీస్ చిత్రాలు వస్తూనే ఉంటాయి. అని తెలిపారు.

నిర్మాత గుద్దేటి బసవప్ప మేరు మాట్లాడుతూ "ఎంతో భక్తిశ్రద్ధలతో  శనిదేవుడు పార్ట్ 1 చిత్రం తీసి రిలీజ్ చేసాం. దానిని 20శాతం ప్రజలు మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. మిగతా 80శాతం ప్రజలు కూడా 'శ్రీ శనిదేవుడు' పార్ట్ 2 చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని తెలిపారు.       

రామసత్యనారాయణ మాట్లాడుతూ "యాక్షన్, థ్రిల్లర్ వంటి కమర్షియల్ సినిమాలు వస్తున్న ఈరోజుల్లో 'శనిదేవుడు' చిత్రాన్ని నిర్మించడం సంతోషకరమైన విషయం" అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్.కుమార్, ఎడిటింగ్: బద్రి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ