Advertisement

రెండు డిఫరెంట్‌ షేడ్స్‌తో సిద్ధార్థ్‌ ‘నాలో ఒకడు’

Wed 15th Apr 2015 02:51 AM
nalo okadu audio,sidharth,prasad ramar,deepa sannidhi,c.kalyan,koneru kalpana,santosh narayan  రెండు డిఫరెంట్‌ షేడ్స్‌తో సిద్ధార్థ్‌ ‘నాలో ఒకడు’
రెండు డిఫరెంట్‌ షేడ్స్‌తో సిద్ధార్థ్‌ ‘నాలో ఒకడు’
Advertisement

సిద్ధార్థ్‌, దీప సన్నిధి హీరోహీరోయిన్లుగా ప్రసాద్‌ రమర్‌ తమిళంలో రూపొందించిన ‘ఎనకుల్‌ ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘నాలో ఒకడు’ పేరుతో రాబోతోంది. కోనేరు కల్పన సారధ్యంలో కల్పన చిత్ర పతాకంపై ప్రకృతి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌ బంజారా హోటల్‌లో జరిగింది. ఆడియో హీరో నాని ఆవిష్కరించి తొలి సి.డి.ని హీరో సందీప్‌ కిషన్‌కి అందించారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ‘నాలో ఒకడు’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

సి.కళ్యాణ్‌: ఈ సినిమా యూత్‌కి బాగా నచ్చుతుంది. ప్రకృతి తెలుగులో నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇది. ప్రసాద్‌ మంచి దర్శకుడు. సంతోష్‌ నారాయణ్‌ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 

లక్ష్మీ మంచు: ఈ సినిమా తమిళ్‌ కంటే తెలుగులోనే పెద్ద హిట్‌ అవుతుందని నా నమ్మకం. సంతోష్‌ నారాయణ్‌ మ్యూజిక్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి కల్పనగారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. నాని: ఈ సినిమాలో సిద్ధార్థ్‌ ఫస్ట్‌ టైమ్‌ రెండు షేడ్స్‌ వున్న ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశాడు. ఈ టైటిల్‌ సిద్ధార్థ్‌కి బాగా సూట్‌ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. 

సిద్ధార్థ్‌: నాకు తెలుగు ఇండస్ట్రీతోనే ఎక్కువ అనుబంధం వుంది. నేను ఇప్పటివరకు చేసిన 25 సినిమాల్లో తెలుగు సినిమాలు 12 వున్నాయి. తెలుగు హీరోగా నేను ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేశాను. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే వంటి సినిమాలు నా కెరీర్‌లో త్వరగా వచ్చేశాయి. ఆ తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు రాలేదు. 2016లో మాత్రం రెండు తెలుగు సినిమాలు చెయ్యబోతున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక డిఫరెంట్‌ ఎటెమ్ట్‌ అని చెప్పాలి. తెలుగు ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న కల్పనగారికి, ప్రకృతిగారికి థాంక్స్‌. 

ప్రసాద్‌ రమర్‌: నాలో ఒకడు నా తొలి తెలుగు సినిమాగా విడుదల కావడం చాలా హ్యాపీగా వుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. 

రానా: సిద్ధార్థ్‌ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. కన్నడలో మంచి హిట్‌ అయిన సినిమాలని తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఇప్పుడు తెలుగులో నాలో ఒకడుగా వస్తున్న ఈ సినిమా కోసం నేను కూడా వెయిట్‌ చేస్తున్నాను. 

సంతోష్‌ నారాయణ్‌: అద్వైతం అనే సినిమా ద్వారా తెలుగులో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాను. ‘ఎనకుల్‌ ఒరువన్‌’ చిత్రం తమిళ్‌లో పెద్ద హిట్‌ అయింది. ‘నాలో ఒకడు’గా వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement