పూరితో జ్యోతిలక్ష్మి.. హైదరాబాద్ వచ్చేస్తుంది!

Wed 15th Apr 2015 12:58 AM
puri jagannath,jyothi lakshmi,shooting updates,charmi,hyderabad  పూరితో జ్యోతిలక్ష్మి.. హైదరాబాద్ వచ్చేస్తుంది!
పూరితో జ్యోతిలక్ష్మి.. హైదరాబాద్ వచ్చేస్తుంది!
Sponsored links

ప్రముఖ హీరోయిన్ ఛార్మి వేశ్య పాత్రలో నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'జ్యోతిలక్ష్మి'.  పూరి జగన్నాధ్ దర్శకుడు. ఫిబ్రవరి 26న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. వారం రోజుల తర్వాత గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన గోవా షెడ్యూల్లో 90 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ రోజుతో గోవా షెడ్యూల్ పూర్తయినట్టు ఛార్మి సోషల్ మీడియాలో తెలిపింది. యూనిట్ సభ్యులు హైదరాబాద్ తిరిగొస్తున్నారు. మరో వారం రోజులు పాటు హైదరాబాద్లో షూటింగ్ ఉంటుంది. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని ఛార్మి చెప్పింది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 

మల్లాడి వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవలా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు పూరి తెలిపారు. ఈ సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ మైంటైన్ చేసిన ఛార్మి కొంచం వెయిట్ తగ్గింది. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి సహా నిర్మాత.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019