Advertisement

రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘అలౌకిక’

Sun 12th Apr 2015 07:43 AM
telugu movie aloukika,challa bhanu kiran,dr.j.r.rao,pramod kumar,manoj nandam  రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘అలౌకిక’
రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘అలౌకిక’
Advertisement

మనోజ్‌ నందం, మాదాల రవి, బ్రహ్మజీ ప్రధాన పాత్రల్లో మణి సమర్పణలో శ్రీ హయగ్రీవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భానుకిరణ్‌ చల్లా దర్శకత్వంలో డా.జె.ఆర్‌.రావు నిర్మిస్తోన్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘అలౌకిక’. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో వుంది. ఈనెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డా॥ జె.ఆర్‌.రావు, దర్శకుడు భానుకిరణ్‌ చల్లా విలేకరులతో సమావేశమయ్యారు. 

డా॥ జె.ఆర్‌.రావు: మా ‘అలౌకిక’ చిత్రంలో సస్పెన్స్‌ వుంది, ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌ వున్నాయి. ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ వుంది. ఇవన్నీ వుంటూనే మంచి మెసేజ్‌ కూడా వుంది. మా డైరెక్టర్‌ భానుకిరణ్‌ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారు. ఒకవిధంగా చెప్పాలంటే అతను పని రాక్షసుడు. డెడికేషన్‌, కాన్ఫిడెన్స్‌, కాన్‌సన్‌ట్రేషన్‌ వున్న డైరెక్టర్‌. అలాగే నాకు చెప్పిన టైమ్‌లోనే ప్రీ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేసి ఇచ్చాడు. సినిమా స్టార్ట్‌ చేసినప్పటి నుంచి సినిమా గురించే ఆలోచిస్తాడు తప్ప మరో ఆలోచన అతనికి వుండదు. తను అనుకున్న స్క్రీన్‌ప్లే, ఔట్‌పుట్‌ వచ్చే వరకు తపన పడతాడు. దానికి బాగా కృషి చేసి మంచి రిజల్ట్‌ ఇస్తాడు. ఇక ఈ సినిమాకి మరో పెద్ద ఎస్సెట్‌ మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌. అతను అందించిన మెలోడియస్‌ సాంగ్స్‌ సినిమాకి బాగా ప్లస్‌ అవుతాయి. ఆల్రెడీ పాటలు హిట్‌ అయ్యాయి. ఇందులో చిత్రగారు పాడిన పాట హైలైట్‌ అని చెప్పొచ్చు. ఈ పాటలకి ఐదువేల క్లిక్స్‌ వచ్చాయి. ఈ ఆడియోను రిలీజ్‌ చేసిన లహరి కంపెనీ వారే రెస్పాన్స్‌ చాలా బాగుందని అప్రిషియేట్‌ చేస్తున్నారు. నెలరోజుల టైమ్‌లోనే  ఇన్‌క్రెడిబుల్‌ రెస్పాన్స్‌ వస్తోందని హ్యాపీగా చెప్తున్నారు. ఈవారంలో సెన్సార్‌ పూర్తవుతుంది. వచ్చేవారం మా ‘అలౌకిక’ చిత్రాన్ని ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తాం. 

భానుకిరణ్‌ చల్లా: ముందుగా మా ప్రొడ్యూసర్‌ రామారావుగారికి థాంక్స్‌ చెప్తున్నాను. అలౌకిక కాన్సెప్ట్‌ అనుకున్నప్పుడు సార్‌ని కలవడం, కథ చెప్పడం జరిగింది. కాన్సెప్ట్‌ చెప్పగానే ఏ ప్రొడ్యూసర్‌ అయినా టోటల్‌ కథ ఏమిటి, ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు.. ఇలాంటి విషయాలు అడుగుతారు. కానీ, మా ప్రొడ్యూసర్‌ నుంచి వచ్చిన మొదటి మాట ఏమిటంటే షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేద్దామనుకుంటున్నారు అని అడిగారు. నన్ను బాగా ఇంప్రెస్‌ చేసిన సిట్యుయేషన్‌ అది. షూటింగ్‌ విషయానికి వస్తే నాకు చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. మేం అనుకున్న టైమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశాం. ఇందులో మనోజ్‌ నందం హీరోగా నటించాడు. మిత్ర, పావని హీరోయిన్లుగా చేశారు. హరిణి, రాకెట్‌ రాఘవ, బాషా మంచి క్యారెక్టర్స్‌ చేశారు. మాదాల రవిగారు ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్‌, ఉత్తేజ్‌, రాంజగన్‌..ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ క్యారెక్టర్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ప్రమోద్‌కుమార్‌ చేసిన ఆరు పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఆడియో పరంగా నేను చేసిన యునీక్‌ ప్రయత్నం ఏమిటంటే వివిధ ప్రదేశాల్లో ఆడియో రిలీజ్‌ చేశాం. తెలంగాణలో నాయిని నర్సింహారెడ్డిగారు మార్చి 12న ఆడియో రిలీజ్‌ చేస్తే, 17న విజయవాడలో రిలీజ్‌ చేశాం. తర్వాత శ్రీకాకుళం, ఖమ్మంలో రిలీజ్‌ చేశాం. దీని వల్ల ప్రతి గడపకు మా ఆడియో చేరే అవకాశం కలిగింది. ఏ ఊర్లో ఆడియో రిలీజ్‌ చేస్తే ఆ ఊరి వాళ్ళు ఈ సినిమా మాది అని ఓన్‌ చేసుకుంటారన్న ఒక ఆలోచన. అది సక్సెస్‌ అయింది. యూట్యూబ్‌లో మంచి క్లిక్స్‌ వచ్చాయి. ఒక చిన్న సినిమాకి అన్ని క్లిక్స్‌ రావడం రియల్లీ మిరేకిల్‌. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు భానుకిరణ్‌ చల్లా సమాధానమిస్తూ..

‘అలౌకిక’ కాన్సెప్ట్‌ ఏమిటి?

ఇది ఒక థ్రిల్లర్‌. హార్రర్‌ని జస్ట్‌ టచ్‌ చేస్తూ వెళ్తుంది తప్ప ఇది హార్రర్‌ మూవీ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడిరచిన ఒక థ్రిల్లర్‌. దానితోపాటు మంచి మెసేజ్‌ కూడా వుంది. హార్రర్‌ అంటే ఒక రివెంజ్‌ డ్రామా వుంటుంది, సస్పెన్స్‌ వుంటుంది. దీనిలో ఏమిటంటే అండర్‌ కరెంట్‌గా యూత్‌కి ఒక చక్కని మెసేజ్‌ కూడా వుంది. 

ఇందులో గ్రాఫిక్స్‌కి ఎలాంటి ప్రాధాన్యత వుంది?

బ్లూ యాంట్‌ వారు మా చిత్రానికి గ్రాఫిక్స్‌ చేశారు. ఇందులో మూడు నిముషాలు గ్రాఫిక్స్‌ వున్నాయి. ఎన్ని నిముషాలు గ్రాఫిక్స్‌ వున్నాయన్నది కాదు ముఖ్యం, సినిమాలో ఎంత దమ్ము వుందనేదే ముఖ్యం. 

షూటింగ్‌ ఎక్కడెక్కడ చేశారు?

టోటల్‌గా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఫిల్మ్‌సిటీలో ఒక సాంగ్‌ చేశాం. బాచుపల్లి ఏరియాలో చేశాం. 

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?

మీరు అలౌకికానందం పొందారు అంటారు. అంటే చెప్పలేని ఆనందం అని అర్థం. అలౌకికం అంటే లోకానికి సంబంధం లేనిది. భూమి మీద వున్న జీవరాశి అంతటికీ ప్రపంచంతో సంబంధం వుంటుంది. సంబంధం లేదు అంటే అది ఘోస్ట్‌. చనిపోయిన తర్వాత ప్రపంచంతో సంబంధం వుండదు. అలా అని ఇది ఘోస్ట్‌ స్టోరీ కాదు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. 

రిలీజ్‌ ఎప్పుడనుకుంటున్నారు?

ప్రస్తుతం మా సినిమా సెన్సార్‌లో వుంది. ఏ సినిమాకైనా సెన్సార్‌ కష్టాలు తప్పవు. మా సినిమా కూడా అదే పొజిషన్‌లో వుంది. ఎంత సేపటికీ మీరు క్యూలో వున్నారని చెప్తున్నారు. అది కంప్లీట్‌ చేసుకొని రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేస్తాం.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

అలౌకిక ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిన తర్వాత మా ప్రొడ్యూసర్‌ ‘పంచముఖి’ చూశారు. మరో పది రోజుల్లో ‘అలౌకిక’ షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుందనగా మూడోరోజు రామారావుగారు నిర్మాతగా మరో సినిమా స్టార్ట్‌ చేశాం. అది ‘అఖండిత’. తెలుగు, తమళ్‌, కన్నడలో ఈ సినిమా చేస్తున్నాం. ఇది సస్పెన్స్‌ జోనర్‌లో వుంటుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement