Advertisement

‘లవకుశ’ హిట్‌ కావాలని వారంతా కోరుకుంటున్నారు

Mon 06th Apr 2015 12:49 AM
telugu movie lava kusha,varun sandesh,nani,ram narayan,jayasri sivan,richa panay  ‘లవకుశ’ హిట్‌ కావాలని వారంతా కోరుకుంటున్నారు
‘లవకుశ’ హిట్‌ కావాలని వారంతా కోరుకుంటున్నారు
Advertisement

వరుణ్‌ సందేశ్‌ హీరోగా జిఆర్‌89 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జయ్‌శ్రీ శివన్‌ దర్శకత్వంలో సంగారెడ్డిపేట ప్రకాష్‌, వి.సత్యమోహన్‌రెడ్డి, ఎ.పండుబాబు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘లవకుశ’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని రాక్‌ హైట్స్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో నాని ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ‘లవకుశ’ హీరో వరుణ్‌ సందేశ్‌కి అందించారు. రామ్‌నారాయణ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇ3 మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా..

నాని: ట్రైలర్స్‌, విజువల్స్‌ బాగా నచ్చాయి. సాధారణంగా ప్రతి ఆడియో ఫంక్షన్‌లో ఇది మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫంక్షన్‌ అంటూ వుంటారు. కానీ, ఇప్పుడు నిజంగా ఇది మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫంక్షన్‌లా చూస్తున్నాను. రామ్‌నారాయణ్‌ చేసిన పాటలన్నీ బాగున్నాయి. ఈరోజు ఈ ఫంక్షన్‌కి రావడానికి కారణం వరుణ్‌. సమ్‌ పీపుల్‌ గెట్‌ సక్సెస్‌, సమ్‌ పీపుల్‌ డిజర్వ్‌ సక్సెస్‌. ఐ థింక్‌ వరుణ్‌ డిజర్వ్స్‌ సక్సెస్‌. ఆ డిజర్వింగ్‌ సక్సెస్‌ లవకుశ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరి అంచనాలను మించి పెద్ద సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాను. 

నాగశౌర్య: కొత్త బంగారు లోకం ఎంత పెద్ద హిట్‌ అయిందో దాన్ని మించి ఈ సినిమా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రొడ్యూసర్స్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.

ప్రభాస్‌ శ్రీను: ఈ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ వుంది. ఆ పాట మనం చేస్తున్నామని డైరెక్టర్‌గారు చెప్పగానే అలా అంటారు కానీ చేస్తారా అనుకున్నాను. అయితే ఆ పాట నాతో పాడిరచడమే కాకుండా ఇందులో నాకు మంచి క్యారెక్టర్‌ కూడా ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

కాసర్ల శ్యామ్‌: ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీనుగారు పాడిన కొక్కొక్కోటి పాట, వరుణ్‌ సందేశ్‌గారికి సుబ్బు సుబ్బు సుబ్బలక్ష్మీ పాట రాశాను. మహాత్మలో నీలపూరి గాజుల ఓ నీలవేణి నాకు ఎంత పెద్ద హిట్‌ ఇచ్చిందో, ఇందులో రాసిన సుబ్బు సుబ్బలక్ష్మీ పాట అంత హిట్‌ అవుతుంది. మంచి ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. 

రిచాపనయ్‌: రామ్‌నారాయణ్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చారు. వరుణ్‌ ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ చేశారు. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా సినిమా వచ్చింది.

వరుణ్‌ సందేశ్‌: ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాలో డూయల్‌ రోల్‌ చేశాను. ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. నాకు మంచి సక్సెస్‌ రావాలని నా ఫ్రెండ్స్‌, వెల్‌ విషర్స్‌ అందరూ ఎదురుచూస్తున్నారు. సక్సెస్‌ అనేది చాలా ఎర్లీగా వచ్చేసింది. నాకు అది డైజెస్ట్‌ కాలేదు. మనం హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టి చేస్తే ఎప్పటికైనా సక్సెస్‌ అవుతామనే పాలసీని నమ్ముతాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నా లాస్ట్‌ మూవీ పడ్డానండీ ప్రేమలో మరి చూసిన వాళ్ళంతా బాగుందన్నారు. అయితే అది బ్యాడ్‌ రిలీజ్‌ అయింది. ఈ సినిమాని మాత్రం మంచి టైమ్‌, మంచి డేట్‌ చూసుకొని సోలోగా రిలీజ్‌ చేద్దామని ప్లాన్‌ చేశాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాతల కోఆపరేషన్‌ చాలా వుంది. మాకు ఏం కావాలంటే అది ప్రొవైడ్‌ చేసి ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమా నిర్మించారు. 

జయ్‌శ్రీ శివన్‌: హీరోగారు నాకు ఒక క్లోజ్‌ ఫ్రెండ్‌కి ఎంత ఫ్రీడమ్‌ ఇస్తారో అంత ఫ్రీడమ్‌ ఇచ్చారు. రైటర్‌ శేఖర్‌ విఖ్యాత్‌, కెమెరామెన్‌ బాలరెడ్డిగారు, ఎడిటర్‌ ఉద్దవ్‌గారు అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. నా వర్కింగ్‌ డేస్‌ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా మా నిర్మాతలు మంచి సినిమా తియ్యమని నన్ను ఎంకరేజ్‌ చేశారు. 

రామ్‌నారాయణ్‌: ఇది నాలుగో సినిమా. ముందుగా మా నిర్మాతలకు థాంక్స్‌ చెప్పాలి. డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక పెద్ద సినిమాలా చేశారు. ఈ సినిమా డైరెక్టర్‌ శివన్‌ మా బ్రదర్‌లాంటివారు. ఈరోజు ఉదయం నుంచి ఈ ఫంక్షన్‌ కోసం ఎంతో టెన్షన్‌ పడుతున్నారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే సీన్‌ చూస్తే మరో వినాయక్‌లా అనిపించారు. వరుణ్‌ సందేశ్‌ గురించి చెప్పాలంటే కొత్తబంగారులోకం సినిమాని నేను లైన్‌లో నిలబడి టిక్కెట్‌ కొనుక్కొని చూశాను. ఈరోజు వరుణ్‌ సినిమాకి మ్యూజిక్‌ చేశానంటే లక్కీగా ఫీల్‌ అవుతున్నాను. ఈ ఆడియో ఇంత బాగా వచ్చిందంటే నాకు సహకరించిన నా టెక్నీషియన్స్‌, లిరిసిస్ట్స్‌ కారణం.

ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, చంటి అడ్డాల, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, కె.వి.ఎల్‌.ఎన్‌.రాజు, లగడపాటి శ్రీధర్‌, హీరో రాజా, సురేష్‌ కొండేటి, చంద్రమహేష్‌లతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement