Advertisementt

ఎన్టీఆర్‌, సుక్కుల సినిమా పేరు ఖరారు..!!

Sun 05th Apr 2015 11:39 AM
sukumar,ntr,title,nananku prematho  ఎన్టీఆర్‌, సుక్కుల సినిమా పేరు ఖరారు..!!
ఎన్టీఆర్‌, సుక్కుల సినిమా పేరు ఖరారు..!!
Advertisement
Ads by CJ

ఇటీవలే విడుదలైన 'టెంపర్‌' చిత్రంతో తిరిగి సక్సెస్‌బాట పట్టారు ఎన్టీఆర్‌. ఈ విజయోత్సవాన్ని ఆస్వాదిస్తున్న ఆయన ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రతీకార నేపథ్యంలో తండ్రి కొడుకుల కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే పేనును ఖరారు చేసినట్లు తెలిసింది. కథకు సరిపోయే టైటిల్‌ కోసం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్న సినిమా యూనిట్‌ ఈ పేరునే ఖరారు చేసినట్లు తెలిసింది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 17నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణ కొత్త పంథాలో సాగుతుందని, ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా '1' సినిమా ప్లాఫ్‌తో రేసులో వెనుకబడ్డ సుకుమార్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని కష్టపడుతున్నారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ