Advertisement

ఈ 'మోసగాడు’ కూడా రెడీ అవుతున్నాడు!!

Fri 03rd Apr 2015 07:45 AM
mosagallaku mosagadu,shooting complete,sudheer babu,krishna,nandini  ఈ 'మోసగాడు’ కూడా రెడీ అవుతున్నాడు!!
ఈ 'మోసగాడు’ కూడా రెడీ అవుతున్నాడు!!
Advertisement

సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు నలభైనాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ‘మోసగాళ్లకు మోసగాడు’ టైటిల్‌తో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు.  ‘స్వామిరారా’ చిత్రానికి  సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. 

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘కృష్ణ కథానాయకుడిగా కౌబాయ్ కథాంశంతో తెరకెక్కిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదమైన తొలి చిత్రంగా గుర్తింపును పొందింది. అదే టైటిల్‌తో మా సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉంది.  కానీ ఆ సినిమా కథకు పూర్తి విరుద్ధంగా మా చిత్రం సాగుతుంది. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో కథ, కథనాలతో పాటు సుధీర్‌బాబు పాత్ర చిత్రణ కొత్తపంథాలో సాగుతాయి’ అని  అన్నారు. అసోసియేట్ ప్రొడ్యూసర్ సతీష్ వెగేశ్న మాట్లాడుతూ ‘సూపర్‌స్టార్ కృష్ణగారి నట ప్రస్థానం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంవత్సరంలోనే ఆయన నటించిన సినిమా టైటిల్‌తోనే సుధీర్‌బాబు చిత్రం రావడం, ఆ చిత్రం మా సంస్థలో రూపొందడం ఆనందంగా వుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేసి ఈ నెలాఖరులో లేదా మే మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. 

అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, పాటలు: శ్రీమణి, కె.కె. ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్ వర్మ పెన్మత్స,  ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: సాల్మాన్‌రాజు, వెంకట్, దేవరాజ్, కెమెరా: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్:  సతీష్ వెగేశ్న,  సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, దర్శకత్వం: బోస్ నెల్లూరి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement