Advertisementt

'S/o సత్యమూర్తి’ సెన్సార్‌ పూర్తి

Tue 31st Mar 2015 04:28 AM
son of satyamurthy censor,son of satyamurthy on 9th april,allu arjun,trivikram,samantha  'S/o సత్యమూర్తి’ సెన్సార్‌ పూర్తి
'S/o సత్యమూర్తి’ సెన్సార్‌ పూర్తి
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న 'S/oసన్నాఫ్‌ సత్యమూర్తి’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9 విడుదల చెయ్యడానికి నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌లో మా బేనర్‌లోనిర్మించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మా చిత్రానికి ఎటువంటి కట్స్‌ లేకుండా సెన్సార్‌ వారు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చినందుకు ఆనందంగా వుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించారు. అల్లు అర్జున్‌ పెర్‌ఫార్మెన్స్‌ మరియు లక్‌ ఈ సినిమాకు హైలైట్‌ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్‌, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. సినిమా కూడా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

అల్లు అర్జున్‌, సమంత, నిత్యామీనన్‌, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్‌, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం, రావ్‌ రమేష్‌, ఎం.ఎస్‌.నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి.ప్రసాద్‌, నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్‌. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ