Advertisementt

మేనేజర్‌ కోసం త్రిష ఓకే చెప్పింది..!!

Sun 22nd Mar 2015 11:29 AM
trisha,upcoming films,marriage,loveaffair  మేనేజర్‌ కోసం త్రిష ఓకే చెప్పింది..!!
మేనేజర్‌ కోసం త్రిష ఓకే చెప్పింది..!!
Advertisement
Ads by CJ

త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. అవకాశాలు సన్నగిల్లడంతోనే ఆమె వివాహ వైపు మొగ్గుచూపారని ఇండస్ట్రీలో వాదనలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నందమూరి బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు మరో సినిమాలో నటించడానికి కూడా త్రిష ఓకే చెప్పారు. ఇంతకుముందు  గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రాన్ని నిర్మించిన మామిడిపల్లి గిరిధర్‌ ఈ చిత్రానికి నిర్మాత. గతంలో ఈయన త్రిష మేనేజర్‌గా కూడా పనిచేశారు. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెబుదామనుకున్న తరుణంలో తన పాత మేనేజర్‌ ఓ చిత్రంలో నటించమని  కోరడంతో కాదనలేక త్రిష ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి 'ఐ లవ్‌యూ బంగారం' సినిమా దర్శకుడు గోని డైరెక్షన్‌ వహిస్తున్నారు. హారర్‌, కామెడీ కథాంశంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ