Advertisement

‘ఈతరం వందేమాతరం’ టీజర్‌ లాంచ్‌

Sun 15th Mar 2015 03:59 PM
eetharam vandemataram,eetharam vandemataram teaser launch  ‘ఈతరం వందేమాతరం’ టీజర్‌ లాంచ్‌
‘ఈతరం వందేమాతరం’ టీజర్‌ లాంచ్‌
Advertisement

వశీమ్‌ రేదర్‌, కీర్తి, సజయ్‌ ప్రధాన పాత్రల్లో అర్జున్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆదిలక్ష్మీ క్రియేషన్స్‌ పతాకాలపై అర్జున్‌కుమార్‌ దర్శకత్వంలో రాజేష్‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ఈతరం వందేమాతరం’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, విజయ్‌వర్మ, శ్రీరంగం సతీష్‌, హీరో నందు, ‘ప్రేమా ఓ ప్రేమ’ దర్శకనిర్మాతలు టి.రాము, కామేశ్వరరావు, హీరోయిన్‌ కీర్తి, విలన్‌ సజయ్‌, ఆర్‌.శివకుమార్‌రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్‌, కెమెరామెన్‌ దిలీప్‌, సంగీత దర్శకుడు అనీష్‌ దర్బార్‌, గేయరచయితలు సీతారామ్‌చౌదరి, సత్యసాగర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

తుమ్మలపల్లి రామసత్యనారాయణ: చెప్పడానికి, వినడానికి కూడా బాగుండని టైటిల్స్‌తో సినిమాలు వస్తున్న ఈరోజుల్లో గొప్ప మనసుతో ‘ఈతరం వందేమాతరం’ అనే మంచి టైటిల్‌ని పెట్టిన దర్శకనిర్మాతలను అభినందిస్తున్నాను. ఈతరం అంటే యూత్‌కి సంబంధించిన కథ అయి వుంటుందనుకుంటున్నాను. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని అర్థమవుతోంది. టీజర్‌ చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

హీరో నందు: ఈ ఫంక్షన్‌కి నేను రావడానికి ఓ కారణం వుంది. మా ఏరియాలోనే వుండే మల్లిక్‌ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌ చేశాడు. ఏదో ఒకటి సాధించాలన్న తపన వున్న మల్లిక్‌ చేసిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌కి తప్పకుండా రావాలని అతను చెప్పడంతో వచ్చాను. ఈ సినిమా అతనికి తప్పకుండా మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుంది. ఒక మంచి టైటిల్‌తో చేసిన ఈ సినిమా పెద్ద హిట్‌ అయి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.

శ్రీరంగం సతీష్‌: టీజర్‌ చాలా బాగుంది. టేకింగ్‌ చూస్తుంటే ఒక కొత్త డైరెక్టర్‌ తీసిన సినిమాలా అనిపించడం లేదు. యూనిట్‌ మొత్తం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. వారికి ఈ సినిమా పెద్ద హిట్‌ అయి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. 

విజయ్‌వర్మ: టీజర్‌ చూస్తుంటే ఈ సినిమా కోసం యూనిట్‌ ఎంత కష్టపడిరదో అర్థమవుతుంది. నేను తొలిరోజుల్లో సినిమా తీసినపుడు ఎలాంటి కష్టాలు పడ్డామో గుర్తొస్తోంది. ఈరోజుల్లో సినిమా ఎంత బాగా తీసినా దాన్ని సరిగ్గా ప్రమోట్‌ చేసుకుంటేనే ప్రేక్షకులకు రీచ్‌ అవుతుంది. ఈ దర్శకనిర్మాతలు చేసిన ఈ మంచి సినిమాకి ప్రమోషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమా పెద్ద హిట్‌ అయ్యేలా చేసుకోవాలని కోరుతున్నాను.

సాయి వెంకట్‌: ఇలాంటి టైటిల్‌ పెట్టాలంటే దమ్ము వుండాలి. మంచి కంటెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా వున్న ఈ సినిమాకి ఈ టైటిల్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ యాప్ట్‌ అని భావిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాని తీసిన దర్శకనిర్మాతలకు, నటించిన నటీనటులకు ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. 

అర్జున్‌ కుమార్‌: ఆర్టిస్ట్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అందరిలాగే నేను కూడా ఫోటోలతో స్టూడియోల చుట్టూ తిరిగాను. కనీసం లోపలికి వెళ్ళే అవకాశం కూడా రాలేదు. నాకన్నా ముందు ఎంతో మంది ఇలా అవకాశాల కోసం తిరిగి విసిగిపోయి వుంటారని తెలుసుకున్నాను. అప్పుడే డైరెక్షన్‌ చెయ్యాలన్న ఆలోచన వచ్చి 10 షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమా చెయ్యడంలో నా ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ ఎంతో వుంది. నా కాన్సెప్ట్‌ మీద వున్న నమ్మకంతో రెమ్యునరేషన్‌ కూడా తీసుకోకుండా పనిచేశారు. ఈ సినిమా చేయడానికి సహకరించిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సబ్జెక్ట్‌ మీద వున్న నమ్మకంతో ఈ సినిమా చేశాం. తప్పకుండా పెద్ద హిట్‌  మా అందరికీ పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

వశీమ్‌ రేదర్‌, కీర్తి, సజయ్‌, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, గీతాసింగ్‌, రమాప్రభ, గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌, జబర్దస్త్‌ టీమ్‌, సుమన్‌ శెట్టి, పొట్టి రాంబాబు, అనంత్‌, జూ॥ రేలంగి, సంపత్‌రాజ్‌, బండ జ్యోతి, వినోద్‌, చిట్టిబాబు, అప్పు, రమేష్‌ కుమార్‌, మను చక్రవర్తి, చిన్నా, మాలిక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనీస్‌ దర్బారి, సినిమాటోగ్రఫీ: దిలీప్‌ పెంటకోట, పాటలు: మార్తాటి తిరుమలరావు, లింగం రవిశంకర్‌, ఆర్ట్‌: గణేష్‌, ఎడిటింగ్‌: వేణు పెద్దు, రచనా సహకారం: రామ్‌ప్రసాద్‌రావు, హనుమంతరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వి.ప్రవీణ్‌కుమార్‌, నిర్మాత: రాజేష్‌ కృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్‌ కుమార్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement