Advertisementt

మార్చి 13న ‘జగన్నాటకం’

Mon 09th Mar 2015 08:25 AM
telugu movie jagannatakam,khanisha chandran,jagannatakam on 13th march  మార్చి 13న ‘జగన్నాటకం’
మార్చి 13న ‘జగన్నాటకం’
Advertisement
Ads by CJ

ప్రదీప్‌, ఖనిశ చంద్రన్‌, శ్రీధర్‌, అభినవ్‌ ప్రధాన పాత్రల్లో చిత్రసౌధం పతాకంపై ప్రదీప్‌ నందన్‌ దర్శకత్వంలో ఐ.ఆదిశేషరెడ్డి నిర్మించిన డిఫరెంట్‌ మూవీ ‘జగన్నాటకం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో, డైరెక్టర్‌ ప్రదీప్‌, హీరోయిన్‌ ఖనిశ, నటి ఉషశ్రీ, కొరియోగ్రాఫర్‌ సందీప్‌, సంధ్య స్టూడియోస్‌ సుబ్బారావు, నటులు కేదార్‌ శంకర్‌, అభినవ్‌, సంగీత దర్శకుడు అజయ్‌ అరసాడ తదితరులు పాల్గొన్నారు. 

ప్రదీప్‌: ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. చాలా కొత్తగా వుంటుంది. ఈ కథ రెండు లేయర్స్‌లో రన్‌ అవుతూ వుంటుంది. ఆ రెండు లేయర్స్‌ని కనెక్ట్‌ చేయడమనేది యునీక్‌గా వుంటుంది. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నామన్న శాటిస్‌ఫ్యాక్షన్‌ మాకు వుంది. ఈ సినిమా మార్చి 13న రిలీజ్‌ అవుతోంది. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

సంధ్య సుబ్బారావు: మా సంధ్య డిజిటల్‌ స్టూడియోలో ఇప్పటికి 56 సినిమాలు చేశాం. మేం స్టార్ట్‌ చేసిన కీ ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ప్రదీప్‌ చాలా క్వాలిఫైడ్‌ పర్సన్‌. మంచి క్వాలిటీ వున్న సినిమా తియ్యడం కోసం ఎంతో కృషి చేశాడు. మంచి ఔట్‌పుట్‌ ఇచ్చాడు. డెఫినెట్‌గా ఇది మంచి సినిమా అవుతుంది. 

ఖనిశ చంద్రన్‌: ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలోని పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాని చూసి అందరూ మమ్మల్ని బ్లెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

ఉషశ్రీ: ఈ చిత్రంలో నేను సిస్టర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఇది ఒక పెయిన్‌ఫుల్‌ థ్రిల్లర్‌. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా ఈ సినిమాలో నాకు ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు. సినిమాలో నేను చాలా కీ రోల్‌ ప్లే చేశాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ