Advertisement

‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ ట్రైలర్‌ లాంచ్‌

Mon 02nd Mar 2015 07:00 AM
telugu movie best friends forever,harinath policharla,surabhi surya kumar,  ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ ట్రైలర్‌ లాంచ్‌
‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ ట్రైలర్‌ లాంచ్‌
Advertisement

చంద్రహాస్‌, హోప్‌, చాప్టర్‌ 6 వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన హరినాథ్‌ పొలిచర్ల లేటెస్ట్‌గా పి.హెచ్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై తన స్వీయ దర్శకత్వంలో ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ పేరుతో ఓ యూత్‌ఫుల్‌ అండ్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్‌ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు, రచయిత శివశక్తి దత్తా, చాప్టర్‌ 6 దర్శకుడు సూర్యకిరణ్‌, దర్శకనిర్మాత హరినాథ్‌ పొలిచర్ల, హీరోయిన్లు సురభి, ఏంజలీనా, నటులు విశ్వరామ్‌, రెహాన్‌, సినిమాటోగ్రాఫర్‌ సి.హెచ్‌.గోపీనాథ్‌, సంగీత దర్శకుడు రాయల్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

హరినాథ్‌ పొలిచర్ల: నేను ఎప్పుడు ఏ ఫంక్షన్‌ జరిపినా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే మా రామానాయుడుగారు మనమధ్య లేకపోవడం చాలా లోటుగా వుంది. ఎన్నో మంచి చిత్రాలు నిర్మించి నిర్మాతకు సరైన నిర్వచనంగా నిలిచిన రామానాయుడుగారు హీరోగా ఓ సినిమా నిర్మించే అదృష్టం నాకు కలిగింది. ఆయన మనకు దూరమయ్యారని బాధపడడం కంటే ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ అభివృద్ధిలోకి రావాలన్నది నా కోరిక. నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమా ద్వారా మనం ఏం చెప్పిన ప్రేక్షకులు నమ్ముతారు. కాబట్టి దాన్ని ఒక రెస్పాన్సిబులిటీగా ఫీల్‌ అయి నా ప్రతి సినిమా వుండాలని కోరుకుంటాను. ఇంతకుముందు మా బేనర్‌లో చేసిన సినిమాలు కూడా డిఫరెంట్‌గా వుంటూ అందర్నీ ఆలోచింపజేశాయి. ఇప్పుడు మా బేనర్‌లో చేస్తున్న ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ కూడా అలాంటి సినిమాయే. మనం ఎవరినైనా వదులుకుంటాం. కానీ, స్నేహాన్ని మాత్రం వదులుకోం. స్నేహానికి సంబంధించి గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇలాంటి సబ్జెక్ట్‌ని ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌లో చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మెట్రో బ్యాక్‌డ్రాప్‌ అయితే ప్రజెంట్‌ ట్రెండ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్‌ కాపీ వస్తుంది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం.

రాయల్‌రాజ్‌: ఫ్రెండ్‌షిప్‌ అనేది లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్‌ అని చెప్పే కథాంశంతో చేసిన సినిమా ఇది. ఇందులో మంచి మ్యూజిక్‌ చేయడానికి చాలా స్కోప్‌ వుంది. దానికి తగ్గట్టుగానే పాటలు కూడా బాగా వచ్చాయి. హరినాథ్‌గారితో ఈ సినిమాకి పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

సురభి: ఈ ప్రాజెక్ట్‌లో నేనూ ఒక భాగం అయినందుకు చాలా హ్యాపీగా వుంది. హరినాథ్‌గారు చాలా నైస్‌ పర్సన్‌. ఆయనతో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో కోఆపరేట్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా బిగ్‌ హిట్‌ అవుతుంది.

రెహాన్‌: తెలుగులో ఇది నా నాలుగో సినిమా. హరినాథ్‌గారి సినిమాలో చేయడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా జరుగుతున్నన్ని రోజులూ ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇందలో నేను ఒక మంచి క్యారెక్టర్‌ చేశాను. ఇది తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుంది.

సూర్యకిరణ్‌: హరినాథ్‌గారు చేసే సినిమాలన్నీ డిఫరెంట్‌గా వుంటాయి. ఆయనతో చాప్టర్‌ 6 సినిమా చేసాను. రామానాయుడుగారితో ఆయన చేసిన ‘హోప్‌’ చిత్రానికి నేషనల్‌ అవార్డు వచ్చింది. అది చాలా గొప్ప విషయం. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌ అనే ఈ సినిమా హరినాథ్‌గారికి బెస్ట్‌ ఫిల్మ్‌ ఫరెవర్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

హరినాథ్‌ పొలిచర్ల, విశ్వరామ్‌, రెహాన్‌, ఏంజలీనా, సురభి సూర్యకుమార్‌, జెమిని సురేష్‌, ఉమ, శృతి, దీప, ప్రసన్న, కీర్తిక, శాంతి, అర్చన, మౌలిక, వీణ, ఇంద్ర సబ్రినా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాయల్‌ రాజ్‌, సినిమాటోగ్రఫీ: సి.హెచ్‌.గోపీనాథ్‌, ఎడిటింగ్‌: మధు, కాస్ట్యూమ్స్‌: గుబ్బల నరసింహారావు, మేకప్‌: చింత ఈశ్వర్‌, ఆర్ట్‌: డి.వై.సత్యనారాయణ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఎం.రాజా, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: జి.వెంకటేశ్వరరావు, పి.టి.రాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: హరినాథ్‌ పొలిచర్ల. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement