Advertisementt

మహేష్‌, కొరటాల మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది..!!

Mon 23rd Feb 2015 07:40 AM
  మహేష్‌, కొరటాల మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది..!!
మహేష్‌, కొరటాల మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది..!!
Advertisement
Ads by CJ

సుపర్‌స్టార్‌ మహేష్‌బాబు, 'మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యే డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. మార్చి 21న ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. వరుసగా '1', 'ఆగడు' వంటి అట్టర్‌ప్లాఫ్‌ల తర్వాత మహేష్‌బాబు బాగా ఆలోచించి కొరటాల శివ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఇక తన మొదటి సినిమాతోనే 'మిర్చి' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన కొరటాల మహేష్‌కు కూడా భారీ విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం 15 రోజుల షెడ్యూల్‌ కోసం త్వరలో ఫ్రాన్స్‌ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అనేక పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఇంకా టైటిల్‌ను మాత్రం నిర్ణయించలేదు. ఇక శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మనందం తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ