Advertisement

‘లవకుశ’ టీజర్‌ లాంచ్‌

Sun 22nd Feb 2015 05:16 AM
varun sandesh,lava kusha movie teaer,n.shankar,chandra mahesh,music director ramnarayan,jaysrisivan,richa panay  ‘లవకుశ’ టీజర్‌ లాంచ్‌
‘లవకుశ’ టీజర్‌ లాంచ్‌
Advertisement

వరుణ్‌ సందేశ్‌ ద్విపాత్రాభినయంతో జిఆర్‌89 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జయ్‌ శ్రీశివన్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తూ వి.సత్యమోహన్‌రెడ్డి, ఎస్‌.ప్రకాష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవకుశ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ లాంచ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్‌.శంకర్‌ టీజర్‌ను లాంచ్‌ చేయగా, మరో ముఖ్యఅతిథి చంద్రమహేష్‌ లోగోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు జయరవీంద్ర, హీరో వరుణ్‌ సందేశ్‌, నటుడు కాశీవిశ్వనాథ్‌, దర్శకుడు జయ్‌ శ్రీశివన్‌, నిర్మాతలు వి.సత్యమోహన్‌రెడ్డి, ఎస్‌.ప్రకాష్‌, సంగీత దర్శకుడు రామ్‌నారాయణ, కధ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటర్‌ ఉద్దవ్‌ ఎస్‌.బి., ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పండుబాబు ఎ. పాల్గొన్నారు.

జయ్‌ శ్రీశివన్‌: ఒక మంచి కథతో ఈ సినిమా చెయ్యాలనుకున్నప్పుడు నిర్మాతలు సత్యమోహన్‌రెడ్డిగారు, ప్రకాష్‌గారు నేను కొత్తవాడినైనప్పటికీ ఎంతో కోఆపరేట్‌ చేసి బడ్జెట్‌ గురించి ఆలోచించవద్దు మంచి సినిమా చెయ్యాలి అని ఎంకరేజ్‌ చేశారు. ముఖ్యంగా వరుణ్‌ ఒక మంచి సినిమా చేసేందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రాకుండా నాకు అన్నివిధాలా సహకరించారు. నేను చంద్రమహేష్‌గారు, ఎన్‌.శంకర్‌గారి దగ్గర నేను ఓనమాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత జయరవీంద్రగారి దగ్గర దిల్లున్నోడు చిత్రానికి పనిచేశాను. వీరంతా నన్ను వారి బిడ్డలా చూసుకొని అన్నీ నేర్పించారు. నిర్మాతలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాను. హండ్రెడ్‌ పర్సెంట్‌ వారికి ఈ సినిమా మంచి హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను.

శేఖర్‌ విఖ్యాత్‌: నేను ఈ కథను ముందుగా వరుణ్‌ ఫాదర్‌కి వినిపించాను. ఆయనకు నచ్చింది. అలాగే వరుణ్‌కి కూడా బాగా నచ్చింది. ఇందులో లవ్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా వుంది. శివ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా సినిమా తీశాడు. రామ్‌నారాయణ మ్యూజిక్‌ ఈ సినిమాకి బాగా ప్లస్‌ అవుతుంది. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది. 

కాశీవిశ్వనాథ్‌: డైరెక్టర్‌ ఈ కాన్సెప్ట్‌ చెప్పగానే స్టోరీ ఎవరిది అని అడిగాను. శేఖర్‌ది అని చెప్పారు. అయితే స్టోరీ వినక్కర్లేదు. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని చెప్పాను. మంచి స్టఫ్‌ వున్న సబ్జెక్ట్‌ ఇది. లవకుశ అనే టైటిల్‌ పెట్టే సాహసం చేశారంటే టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా బాగుంటుందని నా నమ్మకం. 

జయరవీంద్ర: శివ నా దగ్గర దిల్లున్నోడు సినిమాకి వర్క్‌ చేశాడు. చాలా సిన్సియర్‌ వర్కర్‌. సినిమా బాగా తీసి వుంటాడని అనుకుంటున్నాను. టీజర్‌ చాలా బాగుంది. సినిమా కూడా పెద్ద హిట్‌ అయి నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను.

ఎన్‌.శంకర్‌: కష్టపడే మనస్తత్వం వున్న వ్యక్తి శివ. నాకు తెలిసి ఈ సినిమా చాలా మంచి టీమ్‌ సెట్‌ అయింది. ఈ లవకుశలో లవ్‌ వుంది, కుశ్‌ వుంది. అంటే హ్యాపీనెస్‌ కూడా వుంది. సినిమా మీద ఎంతో లవ్‌తో వచ్చిన నిర్మాతలకు ఈ సినిమా మంచి హిట్‌ అయి ముందు ముందు ఇంకా మంచి సినిమాలు ఎంతో ఖుషీతో చెయ్యాలని కోరుకుంటున్నాను.

చంద్రమహేష్‌: శివ కెరీర్‌ నా సినిమాతోనే స్టార్ట్‌ అయింది. ఏదైనా ఒక పని స్టార్ట్‌ చేశాడంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోడు. అంత పట్టుదల వున్న మనిషి. సినిమా బాగా తీశాడని అందరూ చెప్తున్నారు. గ్రేట్‌9 బేనర్‌తో సినిమా స్టార్ట్‌ చేసిన ఈ నిర్మాతలు భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు తీసి గ్రేట్‌ ప్రొడ్యూసర్స్‌ అవ్వాలి. 

వరుణ్‌సందేశ్‌: ఈ సినిమా చెయ్యడానికి శేఖర్‌ భయ్యా కారణం. కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఒక డబుల్‌ రోల్‌ సినిమా అనగానే తప్పకుండా చెయ్యాలనిపించింది. డబుల్‌రోల్‌ సినిమాలు మనం ఎన్నో చూస్తుంటాం. కానీ, చెయ్యడం చాలా కష్టం. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎవరైనా ఎపుడైనా చిత్రంలో నేను చేసిన కామెడీ బాగా వర్కవుట్‌ అయింది. ఈ చిత్రం విషయానికి వస్తే డైరెక్టర్‌ శివకి సూపర్‌ క్లారిటీ వుంది. తను తియ్యాలనుకున్నది హండ్రెడ్‌ పర్సెంట్‌ తీసి చూపించాడు. టీజర్‌ చూసి అందరూ బాగుంది, చాలా క్వాలిటీ వుంది అంటున్నారంటే దానికి ముఖ్య కారణం మా నిర్మాతలు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా, దేనికీ నో అనకుండా అన్నీ ప్రొవైడ్‌ చేసి ఒక మంచి సినిమా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమాకి రామ్‌నారాయణ్‌ మంచి మ్యూజిక్‌ చేశాడు. కొత్తబంగారులోకం చిత్రంలో ‘నిజంగా నేనేనా..’ పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో ఈ సినిమా అలాంటి ఒక మంచి మెలోడీ సాంగ్‌ ఇచ్చాడు. డెఫినెట్‌గా నాకు ఆ పాట మళ్ళీ అంత పెద్ద హిట్‌ అవుతుంది. ఈ సినిమాతో మిక్కీలా రామ్‌నారాయణ్‌ కూడా పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడు. 

వరుణ్‌ సందేశ్‌, రిచా పనయ్‌, రుచి త్రిపాఠి, డా॥ బ్రహ్మానందం, బాబూమోహన్‌, రంగనాథ్‌, కాశీవిశ్వనాథ్‌, ప్రభాస్‌ శ్రీను, ప్రభాకర్‌, చంటి, కమల్‌, సుమన్‌శెట్టి, జెమిని సురేష్‌, విస్సు, ధనుష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, సంగీతం: రామ్‌నారాయణ్‌, పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, కాసర్ల శ్యామ్‌, రెహమాన్‌, వాసుదేవమూర్తి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి. ఎడిటింగ్‌: ఉద్దవ్‌ ఎస్‌.బి., డాన్స్‌: భాను, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: సి.హెచ్‌.ఉపేందర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పండుబాబు ఎ., నిర్మాతలు: వి.సత్యమోహన్‌రెడ్డి, ఎస్‌.ప్రకాష్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయ్‌శ్రీశివన్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement