Advertisement

‘పిశాచి’ పెద్ద హిట్‌ అవుతుందంటున్న బాల

Sat 21st Feb 2015 05:37 AM
telugu movie pisachi,director bala,director miskin,c.kalyan,pisachi on 27th feb  ‘పిశాచి’ పెద్ద హిట్‌ అవుతుందంటున్న బాల
‘పిశాచి’ పెద్ద హిట్‌ అవుతుందంటున్న బాల
Advertisement

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఇటీవల తెలుగు ప్రేక్షకులకు అందించిన ‘చంద్రకళ’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బేనర్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు బాల సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన ‘పిశాసు’ చిత్రాన్ని ‘పిశాచి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 27న 300కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. 

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు బాల మాట్లాడుతూ ‘‘నా దర్శకత్వంలో వచ్చిన శివపుత్రుడు, నేను దేవుడ్ని, వాడు వీడు చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. మిస్కిన్‌ దర్శకత్వంలో నేను నిర్మించిన ‘పిశాసు’ చిత్రం తమిళంలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే అద్భుతమైన కథతో మిస్కిన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. కొత్త తరహాగా వుండే హార్రర్‌ మూవీ ఇది. ‘పిశాచి’గా వస్తున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో ‘చంద్రకళ’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రముఖ దర్శకుడు బాల సమర్పణలో తమిళంలో రూపొందిన ‘పిశాసు’ చిత్రం ‘పిశాచి’ పేరుతో తెలుగులో మేం రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఎనౌన్స్‌ చేసిన తర్వాత బిజినెస్‌పరంగా చాలా మంచి క్రేజ్‌ వచ్చింది. ఈమధ్యకాలంలో చాలా ఫాస్ట్‌గా బిజినెస్‌ చేసిన సినిమా ఇదే. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఫ్యామిలీతో సహా అందరూ ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 27న ఈ చిత్రాన్ని 300కి పైగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. డెఫినెట్‌గా తమిళ్‌ కంటే తెలుగులో ‘పిశాచి’ బిగ్గెస్ట్‌ అవుతుంది’’ అన్నారు. 

బాల సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై విడుదల కానున్న ‘పిశాచి’ చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, హరీష్‌ ఉత్తమన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి రాయ్‌, సంగీతం: ఎ.కె., మాటలు: శశాంక్‌, ఎడిటింగ్‌: గోపీనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కో`ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, నిర్మాతలు: సి.కళ్యాణ్‌, కోనేరు కల్పన, దర్శకత్వం: మిస్కిన్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement