Advertisementt

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లవ్‌సాంగ్‌ విడుదల

Sun 15th Feb 2015 05:04 AM
sudheer babu,nanditha,lagadapati sridhar,chaitanya krishna,r.chandru  ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లవ్‌సాంగ్‌ విడుదల
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లవ్‌సాంగ్‌ విడుదల
Advertisement
Ads by CJ

సుధీర్‌బాబు, నందిత, చైతన్యకృష్ణ, అభిజీత్‌ ప్రధాన పాత్రల్లో ఎల్‌.వి.రామానాయుడు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.చంద్రు దర్శకత్వంలో లగడపాటి శిరీష`శ్రీధర్‌ నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ మెలోడియస్‌ ప్రేమ గీతాన్ని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లోని సుజన షాపింగ్‌ మాల్‌లో ప్రేక్షకుల మధ్య రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు, నందిత, చైతన్యకృష్ణ, అభిజీత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

సుధీర్‌బాబు: నేను, నందిత కలిసి నటించిన ప్రేమకథా చిత్రమ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ మా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ప్రేమకథా చిత్రమ్‌లో అందర్నీ భయపెట్టిన నందిత ఈ సినిమాలో అందర్నీ నవ్విస్తుంది. మన రెండు రాష్ట్రాల్ని కృష్ణమ్మ ఎలా అయితే కలుపుతుందో ఈ సినిమాలో మా ఇద్దరినీ అలా కలుపుతుంది. ప్రేమకథా చిత్రమ్‌లో నందిత దగ్గరికి వెళ్తే చచ్చిపోతాననిపిస్తుంది. ఈ సినిమాలో దూరమైతే చచ్చిపోతాననిపిస్తుంది. మార్చి 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూసి ఎంజాయ్‌ చెయ్యండి.

నందిత: అందర్నీ అలరించే మంచి చిత్రమిది. ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్‌ చేసేలా వుంటుంది సినిమా. ఆడియో ఆల్రెడీ చాలా పెద్ద హిట్‌ అయింది. సినిమా అంతకంటే పెద్ద హిట్‌ అవుతుంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలో ఈ పాట విడుదల చేయడం చాలా హ్యాపీగా వుంది. 

చైతన్యకృష్ణ: అందరికీ నచ్చే మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. చంద్రు చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. పాటలు వినడానికి బాగుంటాయి. సినిమాలో విజువల్‌గా ఇంకా చాలా బాగుంటాయి. 

అభిజీత్‌: ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమా అందరికీ చాలా మంచి పేరు తెస్తుంది. పాటల్లాగే సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం మాకు వుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ