‘భమ్ బోలేనాథ్’ జీరో బడ్జెట్ ప్రోమో సాంగ్ విడుదల!

Fri 13th Feb 2015 10:31 AM
rana,bham bolenath,zero budget,bham bolenath promotion  ‘భమ్ బోలేనాథ్’ జీరో బడ్జెట్ ప్రోమో సాంగ్ విడుదల!
‘భమ్ బోలేనాథ్’ జీరో బడ్జెట్ ప్రోమో సాంగ్ విడుదల!
Advertisement
Ads by CJ

రానా విడుదల చేసిన ‘భమ్ బోలేనాథ్’ జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో! 
నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భమ్ బోలేనాథ్’. పూజ కథానాయిక. ఆర్.సి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేష్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియోను రానా నేడు ట్విట్టర్‌లో విడుదల చేశాడు.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ మొదట్నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ను వినూత్నంగా చేస్తున్నాం. అందులో భాగంగానే జీరో బడ్జెట్‌తో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రూపొందించాం. నవదీప్, నవీన్‌చంద్రతో పాటు చిత్రంలోని ముఖ్యతారాగణంపై ఈ వీడియోను సరికొత్తగా తెరకెక్కించాం. ఈ వీడియోను రానా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి మాకు ఆల్‌దిబెస్ట్ చెప్పడం ఆనందంగా వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘కార్తీకేయ’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న మరో వినూత్న ప్రయత్నమిది.ండున్నర గంటలు ఆద్యంతం హాస్యప్రధానంగా అనూహ్య మలుపులతో సాగే చిత్రమిది. యువతతో పాటు కుటుంబప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ వుంటాయి. కొత్త పంథాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చక్కటి ఎంటర్‌టైనర్ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకముంది’ అన్నారు. ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, పంకజ్‌కేసరి, ప్రవీణ్, నవీన్, రఘు పెన్మెత్స, ధన్‌రాజ్, పృథ్వి, కాదంబరి కిరణ్, కాంచి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: భరణి కె ధరణ్, మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు, పాటలు: కృష్ణచైతన్య, బాలాజీ, సుబ్బరాయ శర్మ, ఆర్ట్: జె.కె.మూర్తి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాతలు: రఘ పెన్మెత్స, కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ, శ్రీకాంత్ దంతలూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ