Advertisement

‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ సక్సెస్‌మీట్‌

Wed 11th Feb 2015 03:55 AM
malli malli idi rani roju,sarvanand,nitya menon,gopisunder,kranti madhav,k.a.vallabha  ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ సక్సెస్‌మీట్‌
‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ సక్సెస్‌మీట్‌
Advertisement

శర్వానంద్‌, నిత్యామీనన్‌ జంటగా కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ పతాకంపై కె.క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’. ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ని నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఎ.రమేష్‌ప్రసాద్‌, హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ నిత్యామీనన్‌, నటి పావనిరెడ్డి, సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌, సంగీత దర్శకుడు గోపిసుందర్‌, సింగర్‌ కిరణ్మయి సుందర్‌, దర్శకుడు కె.క్రాంతి మాధవ్‌, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాత కె.ఎ.వల్లభ తదితరులు పాల్గొన్నారు.

రమేష్‌ప్రసాద్‌: ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌తో నాకు మంచి అనుబంధం వుంది. ఈ కథ నేను ముందే విన్నాను. ఒక మంచి టీమ్‌ మంచి చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అయినందుకు టీమ్‌ని అభినందిస్తున్నాను.

గోపిసుందర్‌: టీమ్‌లోని ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా వున్నారు. ముఖ్యంగా క్రాంతిమాధవ్‌ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇది ఒక వండర్‌ఫుల్‌ మూమెంట్‌.

సాయిమాధవ్‌ బుర్రా: మంచి సినిమా వస్తే, ప్రేక్షకులకు నచ్చేలా తీస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు. ఈ చిత్ర కథ వల్ల, ఇందులోని క్యారెక్టర్స్‌ వల్ల మంచి డైలాగ్స్‌ రాసే అవకాశం కలిగింది. సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌.

నిత్యామీనన్‌: ఈ సినిమా మా అందరికీ ఎంతో సంతృప్తినిచ్చింది. ఇలాంటి మంచి సినిమాని సక్సెస్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు.

శర్వానంద్‌: ఈ సినిమా నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. క్రాంతిమాధవ్‌గారు చాలా అద్భుతంగా ఈచిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌.

క్రాంతిమాధవ్‌: రమేష్‌ప్రసాద్‌గారి సపోర్ట్‌ లేకపోతే నేను డైరెక్టర్‌ని అయ్యేవాడినే కాదు. ఈ సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా హ్యాపీగా వున్నాను. అందరికీ కృతజ్ఞతలు.

కె.ఎ.వల్లభ: మా బేనర్‌లో ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం మాకు ఎంతో గర్వంగా వుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్‌ చేస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement