Advertisement

క్లైమాక్స్ లో ఫ్రెండ్లీ మూవీస్ మూవీ..!

Tue 10th Feb 2015 07:30 AM
addala chanti,friendly movies,naveen vijay krishna,nagababu  క్లైమాక్స్ లో ఫ్రెండ్లీ మూవీస్ మూవీ..!
క్లైమాక్స్ లో ఫ్రెండ్లీ మూవీస్ మూవీ..!
Advertisement

ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో  నవీన్ విజయ కృష్ణ హీరోగా అడ్డాల చంటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ ప్రసాద్. ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ శివార్లలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ "అడ్డాల చంటి చిత్ర ప్రారంభం నుంచి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. ఇంకో రెండు ఎపిసోడ్స్ లో షూటింగ్ ముగించుకొని మార్చ్ లో రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్ కూడా అన్ని సినిమాలోలా కాకుండా చాలా సాదాసీదాగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు తో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా అంతా నాగబాబు, రాహుల్ దేవ్ పాత్రల మీదే నడుస్తుంది"అని అన్నారు. 

ప్రొడ్యూసర్ అడ్డాల చంటి మాట్లాడుతూ "ఈ నెలలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే నెల 10 వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల చివరి వారంలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అధ్బుతమైన స్వరాల్ని సమకూర్చారు. హీరోగా నటించిన నవీన్ టెక్నీషియన్ గా సక్సెస్ అయ్యాడు. హీరోగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

ముఖ్య పాత్రలో నటించిన నాగబాబు మాట్లాడుతూ "మంచి ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాది పాజిటివ్, నెగటివ్ కలగలిపిన కమర్షియల్ క్యారెక్టర్" అని అన్నారు.

విలన్ పాత్రలో నటించిన రాహుల్ దేవ్ మాట్లాడుతూ "ఇంతకముందు నేను నటించిన సినిమాలోలా కాకుండా నా పాత్ర కొంచెం భిన్నంగా ఉంటుంది. నవీన్ చాలా సిన్సియర్ గా ఈ సినిమా కోసం వర్క్ చేసాడు" అని చెప్పారు.

హీరోయిన్ కీర్తి మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అడ్డాల చంటి గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడి చేసారు" అని అన్నారు.

మరొక నటి చాందిని మాట్లాడుతూ "ఈ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

ఈ చిత్రానికి డైలాగ్ రైటర్: సురేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్: అచ్చు, కెమెరా మెన్ : సురేష్, ఎడిటర్: బాబు, ఫైట్స్: నందు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement