Advertisementt

బాబాయ్‌ మాట అబ్బాయి నోట!

Thu 05th Feb 2015 06:58 AM
ntr temper,temper dialogue,balakrishna,rowdy inspector  బాబాయ్‌ మాట అబ్బాయి నోట!
బాబాయ్‌ మాట అబ్బాయి నోట!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణకి, ఎన్టీఆర్‌కి మధ్య గత కొంతకాలంగా పలు కారణాల వల్ల దూరం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనితో నందమూరి ప్యాన్స్‌లో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే బాబాయ్‌తో మంచి అనుబంధం ఏర్పరచుకునేందుకు అబ్బాయ్‌ సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో ఫలించినవి చాలా తక్కువ.  అయితే ఇప్పుడు మరో బాణాన్ని సంధించనున్నాడు అబ్బాయి. అయితే అది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. అదేంటి అంటారా... ఇటీవల ‘పటాస్‌’ సినిమాలో ‘రౌడీ ఇన్స్‌స్పెక్టర్‌’ సినిమాలో ‘అరే ఓ సాంబ’ పాటను కల్యాణ్‌రామ్‌ రీమిక్స్‌ చేయించాడు. అలాంటి ప్రయత్నమే ఎన్టీఆర్‌ కూడా విడుదలకు సిద్దమవుతున్న ‘టెంపర్‌’ కోసం చేస్తున్నాడు. ‘రౌడీ ఇన్స్‌స్పెక్టర్‌’ సినిమాలో బాలయ్య చెప్పిన ఓ ఫవర్‌ఫుల్‌ డైలాగ్‌ని ఎన్టీఆర్‌ చెప్పబోతున్నాడట. కానీ ఆ డైలాగ్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది. బాలయ్య డైలాగ్‌ ఎన్టీఆర్‌ నోట ఎలా ఉండబోతుందనే విషయంపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య, ఎన్టీఆర్‌లకు మధ్య ఉన్న దూరం తగ్గుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. టెంపర్‌ సినిమా ఈ ఇద్దరినీ కలుపుతుందా? రెండుగా చీలిన నందమూరి అభిమానులను ఒకటిగా చేస్తుందా అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 13 వరకు ఆగాల్సిందే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ