Advertisement

‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సక్సెస్‌మీట్‌

Wed 04th Feb 2015 05:27 AM
ladies and gentlemen,madhura sridhar,swathi dixit,manjunath,raghu kunche  ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సక్సెస్‌మీట్‌
‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సక్సెస్‌మీట్‌
Advertisement

చైతన్యకృష్ణ, మహత్‌, అడవిశేష్‌, కమల్‌ కామరాజ్‌, స్వాతి దీక్షిత్‌, నిఖితా నారాయణ్‌ ప్రధాన పాత్రల్లో పి.బి.మంజునాథ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా, షిరిడీ సాయి కంబైన్స్‌ పతాకంపై ఎం.వి.కె.రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ని నిర్వహించింది. ఈ సక్సెస్‌మీట్‌లో నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, లగడపాటి శ్రీధర్‌, దర్శకుడు పి.బి.మంజునాథ్‌, హీరోలు కమల్‌కామరాజ్‌, చైతన్యకృష్ణ, హీరోయిన్‌ స్వాతి దీక్షిత్‌, సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామెన్‌ జగన్‌ చావలి, ఎడిటర్‌ నవీన్‌ నూలి, కోప్రొడ్యూసర్స్‌ రాజ్‌ కందుకూరి, లోహిత్‌, కథా రచయిత సంజీవ్‌రెడ్డి, మాటల రచయిత నివాస్‌, బెక్కం వేణుగోపాల్‌, నటుడు హర్ష తదితరులు పాల్గొన్నారు. 

మధుర శ్రీధర్‌రెడ్డి: ఓటమి అలసిపోయింది, గెలుపు తప్పదు అని ఆమధ్య ఫేస్‌బుక్‌లో పెట్టాను. స్నేహగీతం తర్వాత నాకు మంచి హిట్‌ రాలేదు. ఈ సినిమాతో అది దక్కింది. గమ్యం తర్వాత నెగెటివ్‌ క్లైమాక్స్‌ అయినప్పటికీ సినిమాకి మంచి విజయాన్ని అందించారు. రాబోయే ఐదు సంవత్సరాలకు సరిపోయే ఆక్సిజన్‌ని నాకు అందించారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌గారు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినా, మహేష్‌ భట్‌గారు అప్రిషియేషన్‌ వచ్చినా అదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నాను అనుకున్నారంతా. కానీ, జెన్యూన్‌గా ఈ సినిమా బాగుంది అని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలైతే ఆ క్రేజ్‌తో ఏం చేసినా నడుస్తుంది. కానీ, ఈ సినిమాకి అలా కాదు. ఒక మంచి కథతో ఎక్స్‌పెరిమెంట్‌ చేసే అవకాశం దొరికింది. ఈ సినిమా విషయంలో లగడపాటి శ్రీధర్‌గారు మొదటి రోజు నుంచీ నాకు మంచి సపోర్ట్‌నిస్తూ వచ్చారు. ఈ సినిమా బాగా రావడం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా మంజునాథ్‌ ఎంతో సిన్సియర్‌గా ఈ సినిమాని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాడు. ఇంత మంచి సినిమాని చేసిన యూనిట్‌ మెంబర్స్‌కీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

లగడపాటి శ్రీధర్‌: శ్రీధర్‌ తనకు నచ్చిన సినిమాలు చేస్తాడు. సేమ్‌ టైమ్‌ వండర్‌ఫుల్‌ మూవీస్‌ తీస్తాడు. మొక్కలా స్టార్ట్‌ అయి పెద్ద చెట్టులా ఎదగాలన్న ప్రయత్నంలోనే ఎప్పుడూ వుంటాడు. తన కృషితో ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాడు. ప్రతి ఆర్టిస్ట్‌ ఎంతో కష్టపడి చేశారు. ఫ్యూచర్‌లో వీళ్ళంతా మంచి స్టార్స్‌ అవుతారన్న నమ్మకం నాకు వుంది.

నీలకంఠ: యూనిట్‌ అంతా కలిసి ఒక ఫెంటాస్టిక్‌ మూవీ తీశారు. మంజు ఫస్ట్‌ మూవీతోనే మంచి రేటింగ్‌ తెచ్చుకున్నారు. షూటింగ్‌ టైమ్‌లో అతని వర్క్‌ చూశాను. ఎంతో సిన్సియారిటీ వున్న డైరెక్టర్‌ అతను. చాలా కూల్‌గా వర్క్‌ చేస్తారు. అతనికి గ్రేట్‌ ఫ్యూచర్‌ వుంటుంది. ఇలాంటి సినిమా చెయ్యడం అనేది నిర్మాతకి ఒక ఛాలెంజ్‌. దాన్ని అటెమ్ట్‌ చెయ్యడం సాహసంతో కూడిన పని. మంచి సినిమా చెయ్యడానికి నిర్మాత ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వాలనేది శ్రీధర్‌ని చూస్తే తెలుస్తుంది. టీమ్‌ వర్క్‌ అంటే ఏమిటో ఈసినిమా చెప్పింది. డెఫినెట్‌గా ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అవుతుంది.

మంజునాథ్‌: ఈ సినిమా స్టార్ట్‌ అయిన రోజు నుంచీ పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెటినట్టు డెఫినెట్‌గా మనం హిట్‌ కొట్టాలని శ్రీధర్‌గారు చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ తెలుగులో లేవు. ఈ సినిమాతో నేను డైరెక్టర్‌గా మారడానికి సంజీవ్‌రెడ్డి, రాజ్‌ కందుకూరిల సపోర్ట్‌ మరచిపోలేనిది. మా యూనిట్‌కి ఇంత మంచి హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

రఘు కుంచె: డైరెక్టర్‌ అనేవాడు సక్సెస్‌ కోసం ఎదురుచూస్తాడు. కానీ, మంజునాథ్‌ తన మొదటి సినిమాతోనే సక్సెస్‌ని చూశాడు. ఈ చిత్రంలో నటించిన నటీనటులుగానీ, టెక్నీషియన్స్‌గానీ ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఈ సక్సెస్‌ అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది.

రాజ్‌ కందుకూరి: ఈ సినిమా కోసం ఆరునెలల క్రితం నేను, శ్రీధర్‌రెడ్డిగారు కలిశాం. అప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఫైనాన్షియల్‌గా తక్కువ వచ్చినా ఫర్వాలేదు, మంచి రివ్యూస్‌ రావాలి. సినిమాకి మంచి పేరు రావాలి అన్నారు.  ఇప్పుడు శ్రీధర్‌ ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చెయ్యడం లేదు. నెక్స్‌ట్‌ మూవీని ఇంకెంత బాగా తియ్యాలి అనేదే అతని మైండ్‌లో వుంది. శ్రీధర్‌గారు తప్పకుండా ఇంకా ఎన్నో సక్సెస్‌లు చూస్తారు.

చైతన్యకృష్ణ: ఇలాంటి సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్ట్‌లో నేనూ ఒక పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను.

కమల్‌ కామరాజ్‌: ఈ సినిమా అద్భుతమైన సక్సెస్‌ సాధించి అందరి నుంచీ మంచి అప్రిషియేషన్‌ వస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ సినిమాకి కథ అందించిన సంజీవ్‌ చాలా హ్యాపీగా వున్నాడు. తను డైరెక్ట్‌ చెయ్యబోయే ఓం మంగళం మంగళం చిత్రానికి ఎలాంటి టెన్షన్‌ లేకుండా వర్క్‌ చేసుకుంటాను అని చెప్తున్నాడు. ఈ సినిమాకి ఆర్టిస్టులుగానీ, టెక్నీషియన్స్‌గానీ చాలా ప్లస్‌ అయ్యారు. ఈ సినిమా సక్సెస్‌లో ప్రతి ఒక్కరి ఎఫర్ట్‌ వుంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన శ్రీధర్‌రెడ్డిగారికి, డైరెక్ట్‌ చేసిన మంజునాథ్‌గారికి, పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement