Advertisement

31 నుండి ‘పటాస్‌’ దిగ్విజయ యాత్ర!

Thu 29th Jan 2015 12:52 PM
patas movie,kalyan ram,anil ravipudi,sruthi sodhi,  31 నుండి ‘పటాస్‌’ దిగ్విజయ యాత్ర!
31 నుండి ‘పటాస్‌’ దిగ్విజయ యాత్ర!
Advertisement

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకుడిగా పరిచయం చేస్తూ నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించి నిర్మించిన ‘పటాస్‌’ జనవరి 23న విడుదలై వరల్డ్‌వైడ్‌గా అద్భుతమైన కలెక్షన్స్‌తో ప్రదర్శింపబడుతూ 2015 ఫస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా అఖండ ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పదేళ్ల తర్వాత ‘అతనొక్కడే’ని మించిన సంచలన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలపడానికి ఈనెల 31 నుండి నందమూరి కళ్యాణ్‌రామ్‌ తన యూనిట్‌తో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తున్నారు.

జనవరి 31 మార్నింగ్‌ షోకి నెల్లూరులో, మ్యాట్నీ టైమ్‌కి ఒంగోలులో సాయంత్రం 4.30కి చిలకలూరిపేటలో సాయంత్రం 6 గంటలకు గుంటూరులో, రాత్రి 9 గంటలకు తెనాలిలో ప్రేక్షకుల్ని ‘పటాస్‌’ థియేటర్స్‌లో కలుసుకుంటారు. 31 రాత్రి విజయవాడలో బస చేసి 1వ తేదీ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని.. అమ్మవారి ఆశీస్సులందుకొని మార్నింగ్‌ షో టైమ్‌కి గుడివాడ, మ్యాట్నీ టైమ్‌కి మచిలీపట్నం థియేటర్స్‌లో ప్రేక్షకుల్ని కలసుకుంటారు. 1వ తేదీ సాయంత్రం విజయవాడ సిద్ధార్థ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో జరిగే ‘పటాస్‌’ విజయోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో పాటు ‘పటాస్‌’ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ సెకండ్‌ వీక్‌లో మరిన్ని థియేటర్స్‌ని పెంచడం ఈ చిత్రం సాధించిన ఘనవిజయానికి నిదర్శనం.

సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, రaాన్సీ, కాశీవిశ్వనాథ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను, పవిత్ర లోకేష్‌, ప్రవీణ్‌, రఘు, ప్రాచి, షకలక శంకర్‌. తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయి కార్తీక్‌, పాటలు: భువనచంద్ర, శ్రీమణి, తైదల బాపు, సుబ్బరాయశర్మ, డాన్స్‌: రాజుసుందరం, జానీ మాస్టర్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.క్రిష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎస్‌.జె.ఫణికుమార్‌, చీఫ్‌`కోడైరెక్టర్‌: సత్యం, కో`డైరెక్టర్స్‌: ఎస్‌.క్రిష్ణ, మహేష్‌ ఆలంశెట్టి, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ`మాటలు`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: అనిల్‌ రావిపూడి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement