త్వరలోనే త్రిష పెళ్లి..??

చెన్నై సుందరి త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంతకాలంగా ఈ అమ్మడు తమిళ నిర్మాత వరుణ్‌మణియన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. వీరి వివాహానికి ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో ఇక త్వరలోనే త్రిష ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. అయితే ఇప్పటికే త్రిష నిశ్చితార్థం జరిగినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. త్వరలోనే నిశ్చితార్థం చేసి మార్చిలో వివాహం చేయాలని నిర్ణయించినట్లు వారు చెప్పారు.  ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో నటిస్తోంది. ఇంకా కొన్ని తమిళ, కన్నడ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

trisha hot
trisha marriage
trisha in affair
trisha upcoming films
trisha in bar
trisha in lion
trisha engagement