Advertisement

సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌

Fri 02nd Jan 2015 09:20 AM
hero bellamkonda srinivas,alludu seenu hero bellamkonda srinivas,hero bellamkonda srinivas birthday on 3rd january,bellamkonda srinivas next movie with boyapati srinu,bellamkonda srinivas next movie with bheemaneni srinivas  సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌
Advertisement

ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘అల్లుడు శీను’ సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే 40 కోట్ల క్లబ్‌లో చేరిన బెల్లంకొండ శ్రీనివాస్‌ తన రెండో చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. మొదటి చిత్రంతోనే మంచి పెర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ పుట్టినరోజు జనవరి 3. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

ఈ బర్త్‌డే స్పెషల్‌ ఏంటి?

కొత్త నిర్ణయాలని పర్టికులర్‌గా ఏం లేవు. మంచి సినిమాలు చేయాలి. ఇంకా బాగా కష్టపడాలి. హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకోవాలి. మానాన్నగారికి మంచి పేరు తీసుకురావాలి. 

‘అల్లుడు శీను’ వంటి కమర్షియల్‌ సక్సెస్‌ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలని డిసైడ్‌ చేసుకున్నారు?

కమర్షియల్‌ సినిమాలంటే బాగా ఆసక్తి ఉంది. ఎందుకంటే డ్యాన్స్‌లు, ఫైట్స్‌ బాగా చేస్తున్నాడు అని పేరు వచ్చినప్పుడు నా నెక్స్‌ట్‌ మూవీ కూడా అలాగే ఉండాలి. సినిమా కంటెంట్‌ ఎంత కొత్తగా ఉన్నప్పటికీ అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకుంటాను. 

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వినాయక్‌ వంటి స్టార్‌ డైరెక్టర్‌తో తొలి సినిమా చేశారు. ఇప్పుడు చేస్తున్న రెండో సినిమా బోయపాటి వంటి మరో స్టార్‌ డైరెక్టర్‌తో చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది.?

నిజం చెప్పాలంటే గాడ్‌ గ్రేస్‌ అనాలి. ఎందుకంటే మొదటి సినిమా వినాయక్‌ వంటి స్టార్‌ డైరెక్టర్‌తో చేసిన తర్వాత ఆ సినిమా చూసి నచ్చిన బోయపాటి వంటి మరో స్టార్‌ డైరెక్టర్‌ మమ్మల్ని అప్రోచ్‌ అయ్యారు. అల్లుడు శీను సినిమా చూసిన బోయపాటిగారు బాగా చేశావమ్మా.. అని నన్ను అప్రిషియేట్‌ చేయడమే కాకుండా నీకు సరిపడా యూత్‌, లవ్‌, సబ్జెక్ట్‌ పాయింట్‌ నా దగ్గర ఉంది అని అనడం అలా సినిమా ప్లాన్‌ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. 

సినిమా రంగం వైపు రావడానికి ఇన్స్‌పైర్‌ చేసిన అంశాలేమిటి?

చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగాను. నా చుట్టూ ఉన్నవన్నీ సినిమాతో ముడిపడి ఉండటంతో నేనెదైనా చేస్తే సినిమాల్లోనే చేయాలని అనుకున్నాను. అయితే అప్పట్లో ఇదే చేయాలనైతే డిసైడ్‌ కాలేదు. టెన్త్‌ క్లాస్‌ పూర్తి అయిన తర్వాత నాన్నగారు సినిమాల్లోకి రావచ్చు కదా అన్నారు. సరే, నాన్నగారు అన్నారు కదా అని తొందరపడకూడదని డిసైడ్‌ అయి డ్యాన్స్‌, జిమ్నాస్టిక్స్‌ వంటి వాటిలో ట్రైనింగ్‌ తీసుకున్నాను. కష్టపడి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆరేళ్లపాటు కష్టపడ్డాను. తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. 

బోయపాటిగారితో ఎలాంటి సినిమా చేస్తున్నారు?

మంచి పాయింట్‌ దొరికింది. ఆ పాయింట్‌ మీద బోయపాటి శ్రీనుగారు కథ రెడీ చేస్తున్నారు. అంత కంటే ఎక్కువగా ఇప్పుడే ఆ సినిమా గురించి చర్చ వద్దు..

సినిమాని ఒప్పుకునేటప్పుడు కథ, దర్శకుడు ఈ రెండిరటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారు?

రెండిరటికి ప్రాధాన్యం ఇస్తాను. ఎంత మంచి కథ తీసుకున్నా దాన్ని కరెక్ట్‌గా ప్రెజెంట్‌  చేసే దర్శకుడు అవసరం. అలాగే ఎంత మంచి దర్శకుడు ఉన్నా మంచి కథ లేకుంటే సినిమా చూడడానికి బాగుండదు. కాబట్టి కథ, దర్శకుడు రెండిరటికి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. 

కథల ఎంపిక విషయంలో నాన్నగారు డిసిషన్‌ తీసుకుంటారా? లేక మీరే డిసిషన్‌ తీసుకుంటారా?

నాన్నగారు సినిమాల విషయంలో చాలా ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ కాబట్టి ఆయన ఆనుభవాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన కథ వింటారు. ఆయనకి నచ్చితే నా దగ్గరకి పంపిస్తారు. నాకు కథ నచ్చితే నాన్నగారి దగ్గరకి పంపిస్తాను. 

హోమ్‌ బ్యానర్‌లోనే సినిమాలు చేస్తారా? లేక బయటి ప్రొడక్షన్స్‌లో కూడా సినిమాలు  చేస్తారా?

తప్పకుండా చేస్తానండి. ఎందుకు చేయను. ప్రస్తుతం బోయపాటిగారితో చేస్తున్న సినిమా హోవమ్‌ బ్యానర్‌లో అయితే తర్వాతి రెండు సినిమాల సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. ఆ రెండు సినిమాలు బయటి బ్యానర్‌లో చేయబోతున్నాను. 

తొలి చిత్రం ‘అల్లుడు శీను’తో 40 కోట్ల క్లబ్‌లో చేరారు. అంత పెద్ద సక్సెస్‌ తర్వాత చేస్తున్న సెకండ్‌ మూవీపై ఆ ప్రెషర్‌ పడిరదని అనుకుంటున్నారా?

కచ్చితంగా ప్రెషర్‌గానే ఉంది. ఎందుకంటే తొలి చిత్రం చిన్న లెవల్‌లో కాకుండా పెద్ద లెవల్‌లో ఎంట్రీ ఇచ్చాను. అదే విధంగా సినిమా కూడా హ్యుజ్‌ హిట్టయింది. 40కోట్లు కలెక్ట్‌ చేయడంతో నెక్స్‌ట్‌ సినిమా ఎలా ఉంటుందోనని అంచనాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే నా నెక్స్‌ట్‌ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మంచి కథ రెడీ అయిన తర్వాతే సినిమాని స్టార్ట్‌ చేస్తాను. 

పెద్ద దర్శకులతోనే సినిమాలు చేస్తారా? లేక కొత్త డైరెక్టర్స్‌కి కూడా అవకాశం ఇస్తారా?

పెద్ద దర్శకులతోనే సినిమాలు చేయాలనుకోవడం లేదు. అయితే తొలి చిత్రం వినాయక్‌గారితో చేశాను. అలాగే ఇప్పుడు బోయపాటిగారితో చేయబోతున్నాను. అంతే తప్ప కొత్త దర్శకులతో చేయకూడదనేం కాదు. చాలా మంది కొత్త దర్శకుల స్టోరీస్‌ చెప్పారు. ఈ ఆరు నెలలుగా కేవలం కథలు వినడమే పనిగా పెట్టుకుని ఉన్నాను. కథ నచ్చితే కొత్త దర్శకులతో కూడా చేస్తాను. 

పర్సనల్‌గా మీకు ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది?

నాకు యాక్షన్‌ ఫిలిమ్స్‌ అంటే చాలా ఇష్టం. అదే సందర్భంలో కొత్త కంటెంట్‌ ఉండే విధంగా చేయాలని ఉంది. 

బోయపాటి సినిమాకి సంబంధించి ఎలాంటి వర్కవుట్స్‌ చేస్తున్నారు?

నా మొదటి సినిమాతో పోల్చితే ఈ సినిమాలో బాడీ పెంచాను. డ్యాన్స్‌, జిమ్నాస్టిక్స్‌ ఇంకా బాగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ప్రతిరోజు రిహర్సల్స్‌ చేస్తున్నాను. ఐ నెవర్‌ వాంట్‌ గివప్‌. ప్రతి సినిమాకి డ్యాన్స్‌, ఫైట్స్‌, హెయిర్‌స్టయిల్‌ ఇలా చాలా వాటిలో ఏదో ఒకటి డిఫెరెంట్‌గానే చేయాలని అనుకుంటున్నాను. 

మీ మొదటి చిత్రం అల్లుడు శీనులో డ్యాన్స్‌, ఫైట్స్‌ ఇలా అన్నింట్లో మిమల్ని మీరు ప్రూవ్‌ చేసుకున్నారు..మరి ఇప్పుడు ఆ సినిమా చూసి ఇంకా బెటర్‌గా చేసుంటే బాగుండేదని అనిపించిందా?

కచ్చితంగా అనిపించింది..మొన్న టీవీలో వచ్చినప్పుడు కూడా సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు అన్నింటిలో ఇంకా బెటర్‌మెంట్‌ చేసి ఉండవచ్చు కదా అనిపించింది. ప్రతి యాక్టర్‌కి ఆ ఫీలింగ్‌ ఉంటుంది. పది సినిమాలు  చేసిన తర్వాత కూడా పదకొండో సినిమా చేసేటప్పుడు పదవ సినిమా చూస్తే ఇంకా బాగా చేసి ఉండవచ్చు. 

మళ్లీ వినాయక్‌గారి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది?

ఇప్పుడే ఎలా చెప్పగలను. ఆల్లుడు శీను ద్వారా మంచి లాంఛింగ్‌ ఇచ్చిన డైరెక్టర్‌ ఆయన. ఆయన ఎప్పుడంటే అప్పుడు నేను సిద్ధమే.

హీరోగా గోల్‌ ఏంటి?

నాన్నగారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయనకి మంచి పేరు తేవాలి. ఇక హీరోగా గోల్‌ అంటే ఒక మంచి హీరోగా అందరికీ గుర్తుండి పోవాలి. మంచి మూవీస్‌ చేయాలి. ది బెస్ట్‌ హీరో అనిపించుకోవాలి. అందుకు తగిన విధంగా నేను కష్టపడతాను. మిగతాదంతా గాడ్స్‌ గ్రేస్‌.

సినిమా, సినిమాకి గ్యాప్‌ తీసుకుంటున్నట్లున్నారు?

కెరీర్‌ బిగెనింగ్‌లో ఉన్నాను. కాబట్టి సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు. మూడు నాలుగు సినిమాలకు కొంచెం టైమ్‌ పట్టవచ్చునేమో కానీ.. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అలాగే భీమనేని శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. తమిళంలో మంచి సక్సెస్‌ సాధించిన సుందరపాండి చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. ఫ్రెండ్‌ షిప్‌కి సంబంధించిన కథ. ఆ పాయింట్‌ను తీసుకుని మన నెటివిటీ, సెన్సిబిలిటీస్‌కి  తగిన విధంగా మార్పులు చేసి చేయాలనేదే ఆలోచన. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలను తెలియజేస్తాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement