Advertisementt

బాలయ్య వివాదం వద్దంటున్నాడు..!

Wed 24th Dec 2014 07:19 AM
balayya balakrishna lion  బాలయ్య వివాదం వద్దంటున్నాడు..!
బాలయ్య వివాదం వద్దంటున్నాడు..!
Advertisement
Ads by CJ

సినిమాలలో ఉగ్రరూపం చూపించే నందమూరి నటసింహం బాలకృష్ణ ది..రియల్ లైఫ్ లో మాత్రం సాద్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలనే మనస్తత్వం. కాగా అయన ప్రస్తుతం సత్యదేవా అనే నూతన దర్శకునితో రుద్రపాటి రమణారావు నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రెండు విభిన్న పాత్రలను చేయనున్న బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఎస్. ఎల్. వి. పతాకం పై రూపొందుతుంది. మణిశర్మ చాలాకాలం తర్వాత బాలయ్య చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'లయన్' అనే టైటిల్ పెట్టాలని యూనిట్ భావించింది. అయితే అల్ రెడీ ఓ నిర్మాత ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో సందిగ్ధత ఏర్పడింది. అయితే  బాలయ్య 'లయన్' టైటిల్ కోసం  వివాదాలు వద్దని దర్శక నిర్మాతలకు తెలిపాడట. దాంతో అంతకుముందు ఈ చిత్రానికి టైటిల్ గా పరిశీలనకు వచ్చిన 'వారియర్' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసే ఉద్దేశ్యం లో యూనిట్ వుందని సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. బాలయ్య హిట్ చిత్రాల్లో రైలు, రైల్వే స్టేషన్ లోనో లేక రైలులోనో పోరాట సన్నివేశాలు వుండటం కామన్ అనే సెంటిమెంట్ వుంది. అలాగే ఈ తాజా మూవీ లో కూడా రైలు ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పోరాట సన్నివేశాలు ఇటివల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటి లో రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించారని సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ