ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sangeet Natak Akademi Award for Gummadi Gopalakrishna

గుమ్మడి గోపాలకృష్ణకు సంగీత నాటక అకాడమీ అవార్డు

Sangeet Natak Akademi Award for Gummadi GopalakrishnaSangeet Natak Akademi Award for Gummadi Gopalakrishna

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈరోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో 2024 సంవత్సరానికి గాను'నాటకరంగం - నటన విభాగం'లో ఈ పురస్కారాన్ని గోపాల కృష్ణ స్వీకరించారు . 
తెలుగు నాటక రంగానికి, ప్రత్యేకించి పౌరాణిక పద్యనాటకాలకు గుమ్మడి గోపాకృష్ణ నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు మరియు శ్రీనాథుడి పాత్రలలో గోపాలకృష్ణ నటన అపూర్వం. వీరు మన పురాణాలు, చరిత్ర మరియు సాహిత్యంలోని పాత్రలకు జీవం పోసి ఈ తరం ప్రేక్షకులకు అందిస్తున్నారు. 
గోపాలకృష్ణ గారి విలక్షణమైన కంఠం, భావయుక్తమైన నటన, తెలుగు సాహిత్యంపై  పట్టు మరియు మన సంస్కృతిక సంప్రదాయాలపై నిశితమైన అవగాహన నాటక ప్రియుల హృదయాలలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
తెలుగు నాటకరంగ వైభవాన్ని భారతదేశం తో పాటు అమెరికా లాంటి విదేశీ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి గోపాలకృష్ణ చేసిన కృషి ప్రశంసనీయం.
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్‌గా, గోపాలకృష్ణ అనుభవం యువ కళాకారులను ప్రోత్సహించడంలోనూ, మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలోనూ ఆయన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు. 
గోపాలకృష్ణ గారు ఈ గౌరవం, గుర్తింపు మీకు మాత్రమే కాదు; మీలోని అభిరుచి, అంకితభావానికి , తెలుగు నాటకరంగం, మన సాంస్కృతిక వారసత్వానికి చెందుతుందని చెప్పవచ్చు. 
ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో మీరు మరింతగా నాటక రంగానికి, తెలుగు ప్రజలకు సేవ చేయగలరని భావిస్తున్నాము. తెలుగు నాటక రంగం తరుపున గోపాల కృష్ణ గారికి  అభినందనలు.

Sangeet Natak Akademi Award for Gummadi Gopalakrishna