Advertisement

సినీజోష్ రివ్యూ : కుబేర

Fri 20th Jun 2025 03:47 PM
kuberaa  సినీజోష్ రివ్యూ : కుబేర
CInejosh Review: Kuberaa సినీజోష్ రివ్యూ : కుబేర
సినీజోష్ రివ్యూ : కుబేర Rating: 3.25 / 5
Advertisement
Ads by CJ

కుబేర మూవీ రివ్యూ

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ 

నటీనటులు: ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్భ్, దలిప్ తాహిల్, సునైనా, హరీష్ పేరడి, షాయాజి షిండే, భాగ్యరాజ్ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు 

రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ 20/06/25

క్లీన్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి సినిమా వచ్చి నాలుగేళ్ళయ్యింది. లవ్ స్టోరీ తర్వాత ఆయన నుంచి నాలుగేళ్ళ గ్యాప్ తో నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, సీనియర్ స్టార్ హీరో నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ మూవీగా కుబేర చిత్రాన్ని రెడీ చేసి జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. లీడర్ దగ్గర నుంచి ఆనంద్, హ్యాపీ డేస్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన కుబేర చిత్రం ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించింది. హీరో ధనుష్ ని బెగ్గర్ లుక్ లో చూపించగానే అందరూ షాకయ్యారు, ఆ తర్వాత వదిలిన పోస్టర్స్, టీజర్, కుబేర ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలు క్రియేట్ చేసాయి. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కూడా నటించడంతో కుబేర పై ప్రత్యేక ఆసక్తి చూపించారు ప్రేక్షకులు. మరి ప్రేక్షకుల అంచనాలను 3.13 నిమిషాల రన్ టైమ్ తో కుబేర ఎంతవరకు రీచ్ అయ్యిందో అనేది సమీక్షలో తెలుసుకుందాం.. 

కుబేర స్టోరీ రివ్యూ:

కుబేర కథ గొప్ప కథ అని చెప్పలేము, అలాగని తీసిపారేసే కథ కూడా కాదు. రొటీన్ స్టోరీ నే దర్శకుడు డిఫరెంట్ గా చూపించారు. లక్ష కోట్లు విలువ చేసే సహజ వనరులను ప్రజలకు, ప్రభుత్వానికి అందకుండా కొట్టెయ్యాలని ప్లాన్ చేసే విలన్, అతనికి సహాయం చేసేందుకు వచ్చిన నిజాయితీ గల మాజీ సీబీఐ ఆఫీసర్, వీరి నడుమ అక్షరం ముక్క రాని ఓ బిచ్చగాడు, ఆ బిచ్చగాడు ఆ లక్ష కోట్లని, విలన్ ని సీబీఐ ఆఫీసర్ ని ఎలా డీల్ చేసాడు అనేదే కుబేర కథ. 

కుబేర ఎఫర్ట్స్:

ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుబేర చిత్రంలో బిచ్చగాడిగా దేవా పాత్రలో ధనుష్ నటించడం కాదు జీవించేశారు. కుక్కల పక్కన పడుకోవడం, చెత్తలో పడి దొర్లడం, మనం నిత్యం చూసే బిచ్చగాళ్ళు ఎలా ఉంటారో అచ్చం అలానే ధనుష్ కనిపించి మెప్పించారు. లుక్ విషయంలోనే కాదు తినే విధానం, మాట్లాడే మాట, నడిచే తీరు అన్ని విధాలుగా ధనుష్ కెరీర్ బెస్ట్ ఇచ్చేసారు. ఫైనల్ గా ఈ పాత్రలో ధనుష్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేరు. 

నాగార్జున మాజీ సీబీఐ అధికారిగా కథని మలుపు తిప్పే పాత్రలో నిజాయతీపరుడిగా నటించారు. నాగార్జున నటనకు వంక పెట్టేందుకు ఏమి ఉండదు, అంత సీనియర్ హీరో ఇలాంటి పాత్రలో కనిపించడం ప్రశంసించ దగ్గ విషయం. 

రష్మిక మందన్న సాదా సీదా గా సింపుల్ గానే అనిపించినా కథకి ఉపయోగపడే పాత్రలో కనిపించింది. ఎలాంటి గ్లామర్ షో లేదు అయినా ఆడియన్స్ కి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుంది. విలన్‌గా చేసిన జిమ్ సర్బ్ అటు బిజినెస్‌మ్యాన్‌గా ఇటు క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ఒక అవతారంలో చాలా బాగా నటించారు. మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతికంగా.. సినిమా విడుదలకు ముందు సాంగ్స్ అంత మెప్పించకపోయినా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా పోయిరా పోయిరా మావా, తల్లి మీద వచ్చిన సాంగ్ విజువల్ గా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన BGM కూడా బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. సినిమా నిడివి దాదాపు 3 గంటల 13 నిమిషాలు ఉంది. అక్కడక్కడా ట్రిమ్ చేస్తే బావుండేది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

కుబేర స్క్రీన్ ప్లే రివ్యూ: 

లవ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిత్రాలకు క్లాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఆయన చిత్రాలు నీట్ గా, క్లాస్ గా ఆకట్టుకుంటాయి. అలాంటి దర్శకుడు కుబేర లాంటి కథ అంటే బిచ్చగాడు స్టోరీ తో సినిమా చేస్తున్నాడు అంటే.. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కథ ఏమిటి అనేది అర్ధం కాకపోయినా.. కుబేర ఫస్ట్ లుక్ లో ధనుష్ ని బిచ్చగాడిగా చూసాక శేఖర్ కమ్ముల ఏంటి.. ఇలాంటి కథ ఎంచుకున్నాడు అనే అనుమానం అందరిలో కలిగింద. కుబేర ట్రైలర్ చూసాక కూడా ఓ అంచనాకు రాని ప్రేక్షకుడు.. థియేటర్స్ కి వెళ్లి కుబేర చిత్రాన్ని వీక్షించాక వావ్ అంటూ ఫీలవుతున్నారు. శేఖర్ కమ్ముల నుంచి డిఫరెంట్ మూవీ అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. రొటీన్ కథనే తనదైన మార్క్ తో తెరకెక్కిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని శేఖర్ కమ్ముల నిరూపించారు. లక్షల కోట్లకు అధిపతి కావాలనుకునే వ్యక్తి జనాలకు దక్కాల్సిన సహజవనరుల కోసం ప్రభుత్వాన్నే మోసం చేసి, దానికోసం జైలులో ఉన్న నిజాయితీ సీబీఐ ఆఫీసర్ ని తనవైపుకు తిప్పుకుని, ఆ డబ్బు కొట్టెయ్యడానికి బిచ్చగాళ్లను వాడుకోవడమనే కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది.  బిచ్చగాడు టూ బిలియనీర్ అంటూ సింపుల్ స్టోరీనే మూడు గంటల పాటు బిగి సడలకుండా నరేట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. కుబేర లో కనిపించిన పాత్రలన్నీ అత్యంత సహజంగా కనిపించడం సినిమాకి పెద్ద ప్లస్. హీరో-విలన్-హీరోయిన్-పాటలు అంటూ రూల్స్ పెట్టుకోకుండా, అభిమానుల కోసం హైప్ పెంచేందుకు హీరోల ఎలివేషన్ వెయ్యకుండా కుబేర ని చాలా సహజసిద్ధంగా శేఖర్ కమ్ముల డిజైన్ చేసిన తీరు అద్భుతమని చెప్పాలి. కొన్ని కొన్ని అంటే సెకండ్ హాఫ్ లో లాగ్ సన్నివేశాలు, కొన్ని సీన్లలో లాజిక్కులు మిస్సవడం.. అక్కడక్కడా సన్నివేశాలు కన్వీనియెంట్ గా సాగడం.. లాంటి మైనస్ లు ఉన్నా ఓవరాల్ గా కుబేర ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.  

కుబేర ఎనాలసిస్:

దర్శకుడు శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అతను అందించిన సర్ప్రైజ్ కుబేర. డల్ గా ఉన్న బాక్సాఫీసుని తట్టి లేపింది కుబేర. సమ్మర్ హాలీ డేస్ కరిగిపోయినా.. నిస్సత్తువుగా పడివున్న బాక్సాఫీసు కి కుబేర కటాక్షంలా మారింది ఈ చిత్రం, కుబేరకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ రెండువారాల పాటు కొనసాగితే నిర్మాతలకు లాభాలు వస్తాయి, ప్రేక్షకులు ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూశామన్న తృప్తిని కుబేర మిగులుస్తుంది. కుబేర లాంటి చిత్రాన్ని ఒక్కసారి అయినా థియేటర్ కి వెళ్లి వీక్షించాల్సిందే. 

 

CInejosh Review: Kuberaa:

Kuberaa Movie Telugu Review

Tags:   KUBERAA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ