Advertisement

సినీజోష్ రివ్యూ: బేబీ

Sun 23rd Jul 2023 01:32 PM
baby telugu review  సినీజోష్ రివ్యూ: బేబీ
Cinejosh Review: Baby సినీజోష్ రివ్యూ: బేబీ
Advertisement

సినీజోష్ రివ్యూ: బేబీ

బ్యానర్: మాస్ మూవీ మేకర్స్

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద, బబ్లు తదితరులు

మ్యూజిక్: విజయ్ బుల్గానిక్

సినిమాటోగ్రఫీ: M.N బాల్ రెడ్డి

ఎడిటింగ్: విప్లవ్ 

ప్రొడ్యూసర్: SKN

రాంచరణ్-దర్శకత్వం: సాయి రాజేష్

విడుదల: 14-07-2023

ఫస్ట్ పోస్టర్ నుంచే ప్రేక్షకులను ఆకర్షిస్తూ వచ్చింది బేబీ. 

పాటలు బాగా పాపులర్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేసాయి.

దాంతో ఈ బేబీ మరింత ప్రామిసింగ్ ప్రాజెక్టుగా అనిపించింది అందరికీ.

అందులోనూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం కలర్ ఫోటోకి కథ, స్క్రీన్ ప్లే అందించిన సాయి రాజేష్ స్వయంగా మెగా ఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారడంతో బేబీ పై ఇండస్ట్రీలోనూ ఇంట్రెస్ట్ కనిపించింది. ఇక అటు ప్రొడ్యూసరుగానే కాక ఇటు ప్రమోటర్ గానూ తనదైన ప్రత్యేకతను చూపిస్తూ SKN చేసిన హడావిడి, రిలీజ్ కి ముందే వేసేసిన ప్రీమియర్స్, సోషల్ మీడియా అంతటా వెల్లువెత్తిన కామెంట్స్ నేడు విడుదలైన బేబీ కి భారీ ఓపెనింగ్స్ ని కట్టబెట్టాయి. మరింతకీ ఈ బేబీ ఎలాంటి సినిమాగా థియేటర్స్ లోకి వచ్చిందో.. ఎటువంటి సందడి చేస్తోందో సమీక్షలో చూద్దాం.!

బేబీ స్టోరీ రివ్యూ:

వైష్ణవి అలియాస్ వైషు (వైష్ణవి చైతన్య) బస్తీ అమ్మాయి. చిన్నప్పటినుండే ఎదురింటిలో ఉన్న అబ్బాయి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ప్రేమిస్తుంది. స్కూల్ డేస్ లోను వైషూ-ఆనంద్ ఇద్దరూ ప్రేమలో ఉంటారు. టెన్త్ పాసై ఇంటర్ కి వెళ్ళిన వైష్ణవి ఆ తర్వాత ప్రవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరుతుంది. కానీ టెన్త్ ఫెయిల్ అయిన ఆనంద్ ఆటో డ్రైవర్ గా సెటిల్ అవుతాడు. వైష్ణవి ఇంజనీరింగ్ కాలేజ్ పరిచయాలు ఆమెలో మార్పుకు కారణం అవుతాయి. విరాజ్ (విరాజ్ అశ్విన్) అనే స్టూడెంట్ తో స్నేహం చేసిన వైష్ణవి అతడికి దగ్గరవుతుంది. పబ్బులో అతడితో రొమాన్స్ చేస్తుంది. మరి విరాజ్-వైష్ణవి ప్రేమించుకుంటే.. ఆనంద్ పరిస్థితి ఏమిటి.. ఆనంద్ ని వైషూ వదిలేసిందా. వైషూ-ఆనంద్ లవ్ స్టోరీ విరాజ్ కి తెలిసిందా.. అసలు ఈ ముక్కోణపు ప్రేమ కథ చివరికి ఎన్ని మలుపులు తిరిగింది, ఏ తీరానికి చేరింది అనేది సింపుల్ గా బేబీ కథ.

ఎఫర్ట్స్:

ఇప్పటివరకు సింపుల్ లుక్స్ లో కనిపించిన ఆనంద్ దేవరకొండ.. బేబీలో మాత్రం కొత్తగా కనిపించాడు. ఆనంద్ నటనలో సహజత్వం కనిపించింది. బస్తీలో ఆటో డ్రైవర్లు, పదో తరగతిలో ప్రేమలో పడిన యువకులు ఎలా ఉంటారో.. అచ్చం అలానే కనిపించాడు. ఎమోషనల్ సీన్లు బాగా చేశాడు. నటుడిగా ఆనంద్ దేవరకొండ బెస్ట్ సినిమా అని చెప్పుకునేలా ఉంది అతని పెరఫార్మెన్స్. యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో, హీరోలకి సిస్టర్ కేరెక్టర్స్ లో క్యూట్ గర్ల్ గా, ట్రెడిషనల్ అమ్మాయిలా పదిమందికి పరిచయమైన వైష్ణవి చైతన్య.. బేబీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ  చిత్రంలో బస్తీలో అమ్మాయి, గ్లామర్ గాళ్ గా లుక్స్ వైజ్ గా వేరియేషన్ చూపించడమే కాదు, చక్కటి హావభావాలు పలికించింది. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే అద్భుతంగా చేసింది. కథానాయికగా వైష్ణవి చైతన్యకు మంచి డెబ్యూ ఇది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో కనిపించిన విరాజ్ అశ్విన్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హైఫై ఫ్యామిలీకి చనిదినా యువకుడిగా విరాజ్ నటన బావుంది. హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ పాత్రలు పరిమితమే అయినా ఉన్నంతలో ఇద్దరూ బాగా చేశారు. నాగబాబు తండ్రి పాత్రలో ఎప్పటిలాగే హుందాగా కనిపించారు.

సాంకేతికంగా విజయ్ బుల్గానిక్ సాంగ్స్, నేపధ్య సంగీతం బేబీ కి ప్లస్ అయ్యాయి. M.N బాల్ రెడ్డి కెమెరా వర్క్ అందంగా ఉంది. కానీ బేబీని నిడివి ఇబ్బంది పెట్టేసింది. ఇంకొంచెం తగ్గిస్తే బావుండేది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. బేబీకి అసలైన ప్లస్ ఇంటర్వెల్ సీన్, మాటలు. సాయి రాజేష్ రచనలో కొన్ని డైలాగ్స్ థియేటర్లలో బాగా పేలాయి. క్యారెక్టర్లు, ఆ క్యారెక్టరైజేషన్స్ కంటే ముఖ్యంగా సొసైటీని రిప్రజెంట్ చేసేలా సాయి రాజేష్ సీన్లు రాశారు. తిడుతూ అమ్మాయిలను హార్ట్ చేయడం గురించి రాసిన సీన్ మహిళలకు నచ్చేస్తాయి. మూడు పాత్రలతో సినిమాను నడిపించడం మాటలు కాదు. దర్శకుడిగా ఆ విషయంలో సాయి రాజేష్ పట్టు చూపించాడు. SKN మరోసారి నిర్మాతగా తన అభిరుచినీ, సామర్ధ్యాన్ని రెండిటినీ చాటుకున్నాడు.

ఎనాలసిస్:

లెంగ్త్ ఎక్కువనిపించినా స్ట్రెంగ్త్ ఉన్న సినిమానే ఇది. మీటర్ లో లేకపోయినా మ్యాటర్ ఉన్న సబ్జెక్టే ఇది. ప్రత్యేకించి యువతరం ప్రేక్షకులే టార్గెట్ గా తెరకెక్కిన ఈ బేబీలో వాళ్ళని ఆకట్టుకునే అంశాలే కాకుండా, ఐడెంటిఫై అయ్యే థింగ్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకు సంగీతం అదనపు బలం చేకూర్చింది. సక్సెస్ పై సందేహమే అక్కర్లేని చక్కని బడ్జెట్ ప్రణాళికతో రూపొందిన బేబీ ఫస్ట్ వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అంచనాలకు మించి యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే మెమరబుల్ సినిమాగా నిలిచిపోతుంది.

సినీజోష్ రేటింగ్: 3/5

పంచ్ లైన్: హార్డ్ హిట్టింగ్ బేబీ

Cinejosh Review: Baby:

baby movie telugu review

Tags:   BABY TELUGU REVIEW
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement