Advertisement

సినీజోష్ రివ్యూ: శాకుంతలం

Fri 14th Apr 2023 01:17 PM
shaakuntalam review  సినీజోష్ రివ్యూ: శాకుంతలం
Cinejosh Review: Shaakuntalam సినీజోష్ రివ్యూ: శాకుంతలం
Advertisement

సినీజోష్ రివ్యూ: శాకుంతలం 

బ్యానర్: గుణా టీంవర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు, అదితి బలం, గౌతమి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, మధూ, అల్లు అర్హ, తదితరులు 

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర 

మ్యూజిక్: మణి శర్మ 

సినిమాటోగ్రఫీ: శేఖర్ V జోసెఫ్ 

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి 

ప్రొడ్యూసర్: నీలిమ గుణ

డైరెక్టర్: గుణశేఖర్ 

రిలీజ్ డేట్: 14-04-2023 

పాన్ ఇండియా స్టేటస్ మెయింటింగ్ చెయ్యడం అంత ఈజీ కాదు. ఒక్కసారి పాన్ ఇండియా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నామంటే.. దానిని కంటిన్యూ చెయ్యడానికి నానా కష్టాలు పడాలి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో చాలా భాషా ప్రేక్షకులకి దగ్గరైన సౌత్ హీరోయిన్ సమంత.. ఆ సీరీస్ తో నార్త్ ఆడియన్స్ ని మాత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత యశోదతో విమెన్ సెంట్రిక్ మూవీతో మరింతగా పాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరైంది. మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని గుణశేఖర్ కాంబోలో శకుంతలగా.. శాకుంతలం లో నటించింది. టాలెంటెడ్ దర్శకుడు గుణ శేఖర్ 2015 రుద్రమదేవి తర్వాత లాంగ్ గ్యాప్ తో సమంతని పెట్టి శాకుంతలం లాంటి దృశ్యకావ్యాన్ని తెరకెక్కించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ని దుశ్యంతుడి పాత్రకి ఎంపిక చెయ్యడం, బుల్లి భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అర్హని వెండితెరకి పరిచయం చెయ్యడం, సమంత రీల్ లైఫ్, రియల్ లైఫ్ కష్టాల ప్రమోషన్స్ తో.. ముఖ్యంగా ఈప్రాజెక్టు లోకి అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఎంటర్ అవడం, సినిమా మీద కాన్ఫిడెంట్ తో నాలుగు రోజుల ముందు నుండే ప్రీమియర్స్ షోస్ ప్రదర్శించడం వంటి పలు ఆసక్తికర అంశాలతో నేడు శాకుంతలం పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి శాకుంతలం రిజల్ట్ ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.

శాకుంతలం స్టోరీ రివ్యూ:

విశ్వామిత్ర -మేనకల సంతానమే శకుంతల. విశ్వమిత్రుడు ఓ నరుడు, అయన వలన మేనకకి (మధులబాల) కలిగిన సంతానానికి దేవలోకంలోకి ప్రవేశం ఉండక బిడ్డని భూలోకంలోనే అనాధగా వదిలిపోతుంది. ఆ బిడ్డని కణ్వ మహర్షి(సచిన్ ఖేడ్కర్) దత్త పుత్రికని చేసుకుని శకుంతలగా(సమంత) నామకరణం చేస్తారు. కణ్వాశ్రమలో అపురూపంగా పెరుగుతున్న శకుంతలని చూసి దుశ్యంత మహారాజు(దేవ్ మోహన్) మైమరచిపోయి.. ఆమెని గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత రాచ మర్యాదలతో తనని తన రాజ్యానికి తీసుకువెళతానని శకుంతలకి మాటిస్తాడు. శకుంతల నెల తప్పుతుంది. దుశ్యంతుడి రాక కోసం ఎదురు చూస్తున్న శకుంతలని దుర్వాస మహర్షి (మోహన్ బాబు) శపిస్తారు. శకుంతల కోసం దుశ్యంత మహారాజు రాకపోయేసరికి.. కణ్వ మహర్షి దత్త పుత్రిక శకుంతలకి అప్పగింతలు చేసి ఆమెని దుశ్యంతమహారాజు దగ్గర దింపిరమ్మని శిష్యులని పంపిస్తారు. దుశ్యంత రాజు నిండు సభలో శకుంతల ఎవరో తనకి తెలియదు అని చెబుతాడు. అసలు శకుంతలని అంతగా ప్రేమించిన దుశ్యంత మహారాజు ఎలా మరిచిపోయాడు? దుర్వాసుడి శాపం వలన శకుంతల ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది? శకుంతల ఎవరో తెలియదన్న దుశ్యంతుడు చివరికి ఆమెని కలుసుకున్నాడా? అనేది సింపుల్ గా శాకుంతలం స్టోరీ.

శాకుంతలం ఎఫర్ట్స్:

గ్లామర్ డాల్ గా, పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో తన ప్రత్యేకతని చూపించిన సమంత శకుంతల పాత్రకి అస్సలు సెట్ కాలేదు. ఆ అమాయకత్వం, బెదురు చూపులు ఇవేమి సమంతకి సూట్ అవ్వలేదు. శకుంతలగా ముని ఆశ్రమంలో పెరిగిన ఆమె రూపం, కాస్ట్యూమ్స్, ఫ్లవర్స్ ఇవేమి సమంతని అందంగా చూపించలేకపోయాయి. ఇప్పటివరకు ఒకరకమైన సమంతని తెరమీద చూడడానికి అలవాటు పడిన ప్రేక్షకుడు సమంతని శకుంతలగా చూడ్డం భారమనిపిస్తుంది. దుశ్యంతుని రాజ్యంలోకి ప్రవేశించాక శకుంతల కాస్ట్యూమ్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకున్నాయి. దుశ్యంత మహారాజుగా దేవ్ మోహన్ పర్వాలేదనిపించారు. ఆయన పాత్ర తీరుతెన్నులు అద్భుతం అని చెప్పలేం కానీ.. ఓకె అనిపిస్తాయి. కానీ ఆ పాత్రకి ఏ రానానో, ఏ కళ్యాణ్ రామ్ నో పెట్టి ఉంటే ఆ పాత్ర మరింతగా హైలెట్ అయ్యేది. దుర్వాస మహర్షిగా మోహన్ బాబు కనిపించేది కొద్ది క్షణాలే అయినా.. ఆయన పాత్ర కీలకం, ఆ పాత్రలో ఆయన సీనియారిటీ కనిపిస్తుంది. కణ్వ మహర్షిగా సచిన్ ఖేడ్కర్, శకుంతల స్నేహితురాలిగా అనన్య నాగళ్ళ, గౌతమి ఇలా వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేసారు. ఇక క్లైమాక్స్ లో అల్లు అర్జున్ కుమార్తె  అర్హ స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె చెప్పే డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులని చూపుతిప్పుకోనివ్వవు, అర్హ మొదటిసారి ఎలాంటి బెరుకు లేకుండా భరతుడు పాత్రలో నటించేసింది. ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ నటుడు ఓ పాటకి పరిమితమయ్యారు.

సాంకేతికంగా.. చెప్పుకోవడానికి శాకుంతలంలో పెద్దగా ఏమి లేవు. మణిశర్మ మ్యూజిక్, ఆయన అందించిన నేపధ్య సంగీతం అన్నీ చప్పగా అనిపిస్తాయి. పాటలు అస్సలు ఆకట్టుకోలేవు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా చీప్ గా అనిపిస్తాయి. చాలా వీక్ గా ఉన్నాయి. శేఖర్ V జోసెఫ్ కెమెరా పనితనం బావుంది. ఆయన దుశ్యంతుడి రాజ్యాన్ని, ఆశ్రమాలని అందంగా చూపించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా చెప్పునే స్థాయిలో లేవు.

స్క్రీన్ ప్లే రివ్యూ:

అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల-దుశ్యంతుల ప్రేమ కావ్యం అందరికి సుపరిచితమే. అద్భుత దృశ్య కావ్యంగా పేరొందిన శుకుంతల-దుశ్యంతుల ప్రేమకథకు గుణశేఖర్ 3D హంగులు అద్దారు. అందమైన ప్రేమ కావ్యాన్ని అంతే అందంగా తెరపై చూపించే గట్స్ ఉండాలి. కానీ గుణ శేఖర్ వాటిలో పూర్తిగా విఫలమయ్యారు. దృశ్య కావ్యంగా శాకుంతలం 3D ఎఫెక్ట్స్ తో తీసుకొస్తున్నామంటూ అద్దిన ఆ 3D హంగులు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. శాకుంతలం కథనంలోకి వెళితే అనాధగా కణ్వ మహర్షి ఆశ్రమంలోకి చేరిన శకుంతల పుట్టిందే దుశ్యంతుడి కోసమన్నట్టుగా కనిపించడం, విరహవేదనతో రగిలిపోతున్న ఆమె దుశ్యంతుడుని చూడగానే ప్రేమించేసి గంధర్వ వివాహము చేసుకోవడం, ఆమెని తనతో తీసుకువెళతానని మాటిచ్చి దుశ్యంతుడు మాయమవడం, పెంచిన తండ్రి కణ్వమహర్షి శకుంతల చేసిన తప్పుని ఇట్టే క్షమించెయ్యడం.. దుశ్యంతుడి రాకకోసం శకుంతల ఎదురు చూసే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా నెమ్మదిగా, బోరింగ్ గా అనిపిస్తుంది. శకుంతల-దుశ్యంతుడి మధ్యలో కెమిస్ట్రీ అస్సలు మెప్పించలేదు. సమంతని అలా అమాయకత్వంతో చూస్తుంటే ప్రేక్షకుడు తట్టుకోలేడు. శకుంతలగా సమంత ఏ ఫ్రెమ్ లోను మెప్పించలేకపోయింది. కథలోకి దుర్వాస మహర్షి ఎంటరయినప్పుడు శకుంతలని శపించడంతో కథ ఆసక్తికర మలుపు తీసుకుంటుంది. కానీ ఆ ఫ్లో ని మెయింటింగ్ చేయలేకపోయారు. శకుంతల దుశ్యంతుడి కోసం చేసే ప్రయాణం, నిండు సభలో శకుంతలకి అవమానం, ఆ తర్వాత ఆమె పడరాని పాట్లు పడి బిడ్డని ప్రసవించడం.. అక్కడనుండి దుశ్యంతుడి శకుంతల కోసం ఎదురు చూపులు, శకుంతలని కలుసుకునే ఏ సన్నివేశాన్ని ప్రేక్షకుడు ఎంజాయ్ చెయ్యలేదు. మధ్య మధ్యలో రాక్షసులతో దుశ్యంతుడి యుద్ధం, స్వర్గంలో మేనక నాట్యం, ఇంద్రుడి ఆలోచన ఇవన్నీ ఎందుకు వస్తుంటాయో.. వెళుతుంటాయో ప్రేక్షకుడికి జీర్ణం కావు. యుద్ధ సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో అల్లు అర్హ భరతుడిగా తండ్రి దుశ్యంతుడితో జరిగే సంభాషణలు, అర్హ నటనని ప్రేక్షకుడు బాగా ఎంజాయ్ చేస్తాడు. 

శాకుంతలం ఎనాలసిస్:

కథను కథలాగా చెప్పేస్తే ఇక సినిమా ఎందుకు. నవల రాసేస్తే సరిపోతుంది. ఈరోజుల్లో కథలో ట్విస్ట్ లు, మలుపులు, ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీ, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలను మిళితం చేస్తేనే ఆడియన్స్ కథకి కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇవేమి శాకుంతలంలో కనిపించవు. ఆసక్తికర ప్రేమకథ లేదు, అద్భుతంగా అనిపించే విజువల్ ఎఫెక్ట్స్ లేవు, 3D ఎఫెక్ట్స్ నాసిరకంగా అనిపిస్తాయి. కీలకం అయిన యుద్ధ సన్నివేశాలు చప్పగా అనిపిస్తాయి. అద్భుత దృశ్యం కావ్యం అని చెప్పుకోవడమే కానీ శాకుంతలంలో అద్భుతంగా అనిపించే ఒక్క సీన్ కూడా కనిపించదు. మనసుకు హత్తుకునే శకుంతల-దుశ్యంతుల ప్రేమకథ వినడానికి బావున్నా.. శాకుంతలంగా చూడడానికి బోర్ కొట్టేసింది. థియేటర్స్ లోనే కాదు.. ఓటిటిలోను శాకుంతలం చూడడం కష్టమే.

పంచ్ లైన్: శాకుంతలం చూస్తే.. తలకుశాంతి లేదు

రేటింగ్: 2/5

Cinejosh Review: Shaakuntalam :

 Shaakuntalam Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement