Advertisement

సినీజోష్ రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ

Sat 18th Feb 2023 01:52 PM
vinaro bhagyamu vishnu katha review  సినీజోష్ రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ
Cinejosh Review: Vinaro Bhagyamu Vishnu Katha సినీజోష్ రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ
Advertisement

సినీజోష్ రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ

బ్యానర్: గీత ఆర్ట్స్ 2

నటినటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరీ పరదేశి, మురళీ శర్మ , శుభలేఖ సుధాకర్ తదితరులు

సంగీతం:చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: డానియల్ విశ్వాస్

ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేష్

నిర్మాత:బన్నీ వాసు

దర్శకత్వం:మురళీ కిశోర్ అబ్బూరు

రిలీజ్ డేట్: 18-02-2023

షార్ట్ ఫిలిమ్స్ తో ఫెమస్ అయ్యి రాజావారు రాణిగారు తో హీరో గా మారి వరస సినిమాలతో సందడి చేస్తూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బడా నిర్మాణ సంస్థతో కోలబ్రేట్ అయ్యి వినరో భాగ్యము విష్ణు కథ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా చేసాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో గీత ఆర్ట్స్ లాంటి బిగ్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం హీరోగా బన్నీ వాసు నిర్మాతగా వినరో భాగ్యము విష్ణు కథ తెరకెక్కింది. ప్రమోషన్స్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసి, సినిమాపై ఉన్న నమ్మకంతో స్పెషల్ ప్రీమియర్స్ తో హడావిడి చేసి మరీ నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ ఆడియన్స్ ని ఎంతగా ఇంప్రెస్ చేసిందో సమీక్షలో చూసేద్దాం.

వినరో భాగ్యము విష్ణు కథ స్టోరీ రివ్యూ:

విష్ణు(కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిదండ్రులు సూయిసైడ్ చేసుకోవడంతో తాత (శుభలేఖ సుధాకర్) పెంపకంలో పెరుగుతాడు. తిరుపతి యూనివర్సిటీలో లైబ్రేరియన్ గా పనిచేసే విష్ణు కి య్యూట్యూబర్ దర్శనతో ( కశ్మీరి పరదేశీ) పరిచయం ఏర్పడుతుంది. వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. నైబర్ ఫోన్ నంబర్ వల్ల దర్శనతో పాటుగా శర్మ(మురళి శర్మ) విష్ణుకి పరిచయమవుతాడు. అదే నైబర్ ఫోన్ నంబర్ వల్ల విష్ణు రాజన్ అని ఓ గ్యాంగ్ స్టర్ ని కలుస్తాడు. కొన్ని కారణాలతో రాజన్ తో విష్ణు తన కథ మొత్తం చెబుతాడు. దర్శన తన యూట్యూబ్‌ను పాపులర్ చేయడానికి ఏవేవో వీడియోస్ చేస్తుంది. అందులో భాగమే దర్శన శర్మని చంపేస్తుంది. లైవ్ మర్డర్‌ను ప్రాంక్‌గా ప్లాన్ చేస్తుంది. ఆ ప్రాంక్ లైవ్ మర్డర్ కారణంగా దర్శన జైలుకు వెళ్తుంది. అసలు దర్శన శర్మని ఎందుకు చంపింది, రాజన్ ఎవరు, విష్ణు నైబర్ నెంబర్ కాన్సెప్ట్ ని వాడి కేసుని ఎలా ఛేదించాడు, దర్శన జైలు పాలైతే విష్ణు ఏం చేసాడన్నది క్లుప్తంగా వినరో భాగ్యము విష్ణుకథ. 

వినరో భాగ్యము విష్ణు కథ ఎఫర్ట్స్: 

చూడగానే పక్కింటి అబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరం విష్ణు గా పలు రకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో ఫర్‌ఫెక్షన్ చూపించాడని చెప్పవచ్చు. లైబ్రేరియన్ గా, అతి మంచివాడిగా ఆకట్టుకున్నాడు. కిరణ్ గత సినిమాలతో పోలిస్తే యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్‌లో మెచ్యురిటీ కనిపిస్తుంది. లుక్స్ వైజ్ గా ఎప్పటిలాగే నార్మల్ గానే కనిపించాడు తప్ప కొత్తగా ట్రై చెయ్యలేదు. హీరోయిన్ కశ్మీరా పరదేశీ దర్శన పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది, స్క్రీన్ మీద అందంగా కనిపించింది. యూట్యూబర్ పాత్రతో మెప్పించడమే కాకుండా, ఇంటర్వెల్ సీన్‌లో మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గ్లామర్ గా ఆకట్టుకొన్నది. ఇక ఈ సినిమాలో మూడో వ్యక్తి గురించి మట్లాడాలంటే మురళి శర్మ గురించే చెప్పుకోవాలి. ఆయన ఇంతకుముందు సినిమాల పాత్రలకి భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది. ఆయన పాత్ర ప్రేక్షకుడికి బాగా రిజిస్టర్ అవుతుంది. సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, దేవి ప్రసాద్, ఆమనీ మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు. 

టెక్నికల్ టీమ్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి.. డానియల్ విశ్వాస్ ఉన్నంతలో విజువల్స్ ని బాగా చూపించాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్, ఫైట్ సీన్స్ లో ఎలివేట్ అయ్యింది, సాంగ్స్ పర్లేదనిపిస్తాయి. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ కత్తెరకి మరికాస్త పదునుపెట్టాల్సింది. జీఏ2 ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి.

డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బురు స్టోరీ బాగానే అనుకున్నా.. దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, నిడివి విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని వుండాల్సింది.

వినరో భాగ్యము విష్ణు కథ స్క్రీన్ ప్లే:

తెలియని కొత్త నెంబర్ కి ఫోన్ చేసి ఎవరో, ఏమిటో అనేది తెలియకుండా పరిచయం పెంచుకుని ఫ్రెండ్ షిప్ చేయడమనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించాడు. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని లవ్ స్టోరీ నడిపించాడు, మంచితనము చూపించాడు, క్రైమ్ ని యాడ్ చేసాడు, దేశభక్తిని మిళితం చేసాడు. ఫస్ట్ హాఫ్ ని లవ్ స్టోరీతో హ్యాండిల్ చేసి సెకండ్ హాఫ్ ని క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సస్పెన్స్ ని క్రియేట్ చెయ్యడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని ట్విస్ట్ లు నచ్చినా, కొన్ని సిల్లీగా తేల్చేసారు. హీరో-హీరోయిన్ ఓ శర్మ అంటూ కథని ముగ్గురితోనే నడిపించినట్లుగా వాళ్ళ మధ్యన సరదా సన్నివేశాలు, డాన్స్ మూమెంట్స్, డైలాగ్స్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సినిమా మొదలు పెట్టిన చాలాసేపటికి గాని కథలోని ప్రేక్షకులని తీసుకెళ్లలేదు, ఇంటర్వెల్ ముందే కథలోకి తీసుకెళ్లారు, అక్కడ ట్విస్ట్ మెప్పించినా.. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి. మర్డర్ కేసుని హీరోగారు మరీ సిల్లీగా ఛేదించడం ఆడియన్స్ కి అస్సలు రుచించదు. బోధనలు, సందేశాలతో కొంత సాగదీసిన ఫీలింగ్ తో కూర్చున్న ప్రేక్షకుడికి క్లైమాక్స్ ట్విస్ట్ బోర్ కొట్టేలా చేస్తుంది. నంబర్, వీడియో షేరింగ్ ఐడియా కథకు బలంగా ఉన్నప్పటికీ.. థ్రిల్లింగ్‌గా అనిపించదు.

వినరో భాగ్యము విష్ణు కథ ఎనాలసిస్:

సక్సెస్ కోసం పోరాటం చేస్తున్న కిరణ్ అబ్బవరం తో ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లాంటి బ్యానర్ కలిసి పని చెయ్యడం అంటే.. ఆ సినిమా హిట్ అని ఖచ్చితంగా ప్రేక్షకుడు అంచనా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత పేరున్న గీత ఆర్ట్స్ 2 ని కూడా ఈ మధ్యన వరస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ వినరో భాగ్యము విష్ణు కథ కి చేసిన ప్రమోషన్స్, స్పెషల్ ప్రీమియర్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసాయి. ఈ సినిమా ఏదో ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది అని ప్రేక్షకుడి మదిలో ఆలోచన రేకెత్తించినట్టుగానే..  దేశభక్తి, ప్రేమ, ఫ్యామిలీ, క్రైమ్, యాక్షన్, ఫన్ తదితర ఎలిమెంట్స్‌తో ఈ వినరో భాగ్యం విష్ణు కథని దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించాడు. అంచనాలు పెట్టుకుని వెళితే కొంత నిరాశ తప్పదు. అదే ఆడియన్స్ అంచనాలు లేకుండా వెళితే శాటిస్ ఫై  అవడం ఖాయం. 

పంచ్ లైన్ : మ్యాటర్ తక్కువ - మలుపులు ఎక్కువ.! 

రేటింగ్: 2.5/5

Cinejosh Review: Vinaro Bhagyamu Vishnu Katha :

Vinaro Bhagyamu Vishnu Katha Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement