Advertisement

సినీజోష్ రివ్యూ: వాల్తేర్ వీరయ్య

Fri 13th Jan 2023 12:07 PM
waltair veerayya movie,waltair veerayya review  సినీజోష్ రివ్యూ: వాల్తేర్ వీరయ్య
Cinejosh Review: Waltair Veerayya సినీజోష్ రివ్యూ: వాల్తేర్ వీరయ్య
Advertisement

సినీజోష్ రివ్యూ: వాల్తేర్ వీరయ్య 

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కాథరిన్ తెరెసా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహ, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి తదితరులు 

మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ: ఆర్థర్ A విల్సన్ 

ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే

ప్రొడ్యూసర్స్: నవీన్ యెర్నేని, Y.రవి శంకర్ 

డైరెక్షన్: బాబీ 

రిలీజ్ డేట్: 13-01-2023 

ఇండస్ట్రీకి పెద్దని కాదంటూనే తనకి తోచిన సహాయం అందిస్తూ.. అందరికి తలలో నాలుకలా మారి ఆ పెద్దరికాన్ని మెయింటింగ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి తనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఒకవైపు యంగ్ హీరోలకి షాకిస్తూనే మరోవైపు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ ఫాన్స్ ని రెచ్చగొడుతూ పూర్వపు గ్యాంగ్ లీడర్ రోజులని గుర్తుకు తెస్తూ మరో హీరో రవితేజ తో జత కట్టి మరీ వాల్తేర్ వీరయ్యతో సంక్రాంతి ఫెస్టివల్ కి సందడి షురూ చేసారు. గ్లామర్ గర్ల్ శృతి హాసన్ తో మెగాస్టార్ వేసిన మాస్ స్టెప్స్ కి, రవితేజ వాల్తేర్ వీరయ్య టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. దర్శకుడు బాబీ మెగా అభిమానిని అంటూ నిర్మాణ విలువలతో ప్రత్యేకతని చాటుతున్న మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మెగాస్టార్ ని కొత్తగా ప్రెజెంట్ చేస్తానంటూ క్యూరియాసిటీని పెంచేశారు. ఊర్వశి స్పెషల్ సాంగ్, చిరంజీవి వింటేజ్ లుక్, ట్రైలర్, రవితేజ కేరెక్టర్, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ ఆ క్యూరియాసిటీని కంటిన్యూ చేస్తూ నేడు వాల్తేర్ వీరయ్యగా చిరంజీవి థియేటర్స్ లో జాతర మొదలు పెట్టేసారు. ఇప్పటివరకు ఉన్న అంచనాలను వాల్తేర్ వీరయ్య ఏ మేరకు రీచ్ అయ్యిందో సమీక్షలో చూసేద్దాం.

వాల్తేర్ వీరయ్య స్టోరీ రివ్యూ: జాలరిపేటలో సముద్రం గురించి అన్ని తెలిసిన జనాల మనిషి వాల్తేరు వీరయ్య(చిరంజీవి). పోర్ట్ లో వీరయ్య పేరు మీద ఐస్ ఫ్యాక్టరీ నడుస్తుంటుంది. అక్కడ నావి అధికారులకి వీరయ్య సహాయం కూడా చేస్తూ ఉంటాడు. ఆ ఏరియాలో వీరయ్యకి  తెలియకుండా కొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటారు. డ్రగ్ మాఫియా కారణంగా పోలీస్ అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఆ సస్పెన్షన్ నుండి బయపడేసే వ్యక్తి వీరయ్య అని తెలుసుకున్న సీతాపతి అతనితో ఓ డీల్ కుదుర్చుకుంటాడు. ఆ డీల్ లో భాగంగా వీరయ్య మలేషియా వెళతాడు. డ్రగ్స్ బిజినెస్ చేసేవారిని పట్టుకోవడానికి ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) రంగంలోకి దిగుతాడు. అసలు వీరయ్య-సీతాపతి మధ్యన కుదిరిన ఒప్పందం ఏమిటి, వీరయ్య మలేషియా ఎందుకు వెళ్ళాడు, అసలు ఏసీపీ విక్రమ్ సాగర్ కి వీరయ్య కి ఉన్న సంబంధం ఏమిటి అనేది టూకీగా వాల్తేర్ వీరయ్య కథ. 

వాల్తేర్ వీరయ్య కథనం: దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య క్యారెక్టర్ లో బాస్ ఎంట్రీ.. ఆ వెంటనే బాస్ పార్టీ సాంగ్ తో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్ళిపోయాడు. మెగాస్టార్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరోయిన్ శృతిహాసన్ ఎంట్రీ.. ఆమెతో వీరయ్య లవ్ ట్రాక్ ఇవన్నీ ఆడియన్స్ ని ఎంజాయ్ చేసేలా చేసాయి. ఫస్టాఫ్ లో వీరయ్య క్యారెక్టర్ తో కామెడీని కంటిన్యూ చేస్తూనే.. కథలో సీరియస్ నెస్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా మెయిన్ క్యారెక్టర్స్, విలన్ ఇంట్రడక్షన్స్ తో పాటు అదిరిపోయే ట్విస్టు, యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ డిజైన్ చేశారు. చిరంజీవి మార్క్ కామెడీ తో ఫస్ట్ హాఫ్ ఆహ్లాదంగా గడిచిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్ కోసం దాచేసారు. వీరయ్య ఫ్లాష్ బ్యాక్.. వీరయ్యని సవాల్ చేస్తూ ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్ లో రవితేజ ఇంట్రడక్షన్ బాగుంది. వీరయ్యకి, రవితేజకి మధ్య జరిగే సన్నివేశాలు నవ్విస్తూనే.. ఆ సన్నివేశాలు ఆకట్టుకునేలా బాబీ డిజైన్ చేసాడు.. కానీ ఎమోషనల్ గా బలంగా చూపించలేకపోయాడు. రిస్క్ చెయ్యకుండా మెగా అభిమానిగా అభిమానులకి నచ్చేలా చిరంజీవిని ఎలివేట్ చెయ్యడం తప్ప.. కథ, కథనాల విషయంలో బాబీ రాంగ్ స్టెప్ వేసాడు. పాత కథనే తిప్పి తిప్పి కొత్తగా చూపించడానికి ట్రై చేసాడు. చిరు-రవితేజ ల ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ కి కథ, కథనం వీకైపోయాయి. బలమైన విలన్స్ ని కరెక్ట్ గా వాడుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ని బాలెన్సుడ్ గా లాక్కొచ్చి.. సెకండ్ హాఫ్ మధ్యలోనే కాడె పడేసాడనిపించేలా ఉంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో మాత్రం వీరయ్య మాస్ విశ్వరూపం డీసెంట్ గా చూపించి సాటిస్ఫాక్షన్ కలిగించాడు.

వాల్తేర్ వీరయ్య ఎఫర్ట్స్: సముద్రంలో సొరనైనా, యుద్ధంలో స్నేహితుడిలాంటి శత్రువునైనా మట్టికరిపించే సత్తా వీరయ్యది. చాలా కాలం తర్వాత.. అంతా చిరు కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడం కాదు.. క్లాప్స్‌తో థియేటర్లని హోరెత్తిస్తారు. ఫస్టాఫ్ కొన్ని సీన్లలో, రవితేజ ఎంట్రీ తర్వాత అతనితో కవ్వించే సన్నివేశాలలో వింటేజ్‌‌కి కేరాఫ్ అడ్రస్‌లా వీరయ్య నిలిచాడు. వీరయ్య పాత్రకి ఎంత డెడికెటేట్‌గా మెగాస్టార్ వర్క్ చేశాడో ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. వీర మాస్ అవతారంతో నిజంగానే ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా లుక్ విషయంలో 90స్ బ్యాచ్.. ఇది మా చిరు అని, ఇప్పటి బ్యాచ్ ఇండస్ట్రీకి ఇంకో కొత్త హీరో వచ్చాడని అనుకుంటారంటే.. ఏ రేంజ్‌లో చిరు విధ్వంసం ఉందో ఊహించుకోవచ్చు. చిరుకి అంతే స్థాయిలో పోటీ ఇచ్చాడు మాస్ రాజా. ముఖ్యంగా పలికే యాస విషయంలో ఇద్దరూ రఫ్పాడించారు. గత కొన్ని చిత్రాలుగా రవితేజ లుక్‌తో పోలిస్తే.. ఈ సినిమాలో మాస్ రాజా మళ్లీ బ్యాక్ అని అనిపించాడు. ఇద్దరి స్ర్కీన్‌ప్రెజన్స్‌కి ప్రేక్షకుల, ఫ్యాన్స్ మంత్రముగ్ధులవడం ఖాయం. 

శృతి హాసన్: కేరెక్టర్ లోనే కాదు పాటల్లోనూ గ్లామర్ ట్రీట్ అందించింది. సాంగ్స్ లో లుక్స్ విషయంలోనూ, యాక్షన్ సీన్ లోను అబ్బురపరిచింది. కేరెక్టర్ వైజ్ స్కోప్ ఉండడంతో శృతి వీరయ్య పక్కన అందంగా మెరిసింది. మరో హీరోయిన్ కేథరిన్ కొన్ని సన్నివేశాలతో సరిపెట్టుకుంది. వాల్తేర్ వీరయ్యలో చిరంజీవి కేరెక్టర్ నిఎలివేట్ చేసే ప్రాసెస్ లో విలన్స్ కేరెక్టర్స్ కి ప్రాధాన్యత లేకుండా చేసారు.దానితో ప్రకాష్ రాజ్, బాబీ సింహ పాత్రలు తేలిపోయాయి. వెన్నెల కిషోర్, సత్య రాజ్ అక్కడక్కడా నవ్వించారు. రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ తదితరులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎనర్జిటిక్ గా ఉన్నాయి.. కానీ, మెగాస్టార్ కి ఇంకా బెటర్ సాంగ్స్ పడాల్సింది అనిపిస్తుంది. బీట్, డాన్స్ అన్నీ సూపర్బ్ అనేలా ఉన్నాయి కానీ చిరు సాంగ్స్ లో సోల్ మిస్ అయ్యింది. కాకపోతే దేవిశ్రీ ఈసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తపడ్డాడు. ఆర్ధర్ సినిమాటోగ్రఫీ బాగుంది.. సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ లోని రిచ్ నెస్ ని ప్రెజెంట్ చేసాడు. సెకండ్ హాఫ్ లో నిరంజన్ కత్తెరకి పని చెప్పాల్సి ఉన్నా ఎందుకో మొహమాటానికిపోయాడనిపిస్తుంది. ఆర్ట్ వర్క్, ఫైట్ మాస్టర్స్ ఎఫర్ట్స్, డాన్స్ మాస్టర్ శేఖర్ కొరియోగ్రఫీ గొప్పగా మట్లాడుకునేలా ఉన్నాయి. దర్శకుడు బాబీ చెప్పిన విధంగానే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా, బాస్ ఈజ్ బ్యాక్ అనేలా వీరయ్యని తెరపై ప్రెజెంట్ చేసాడు. మైత్రి వారి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. 

వాల్తేరు వీరయ్య ఎనాలసిస్: ఇటీవల ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చెప్పినట్లే.. ఇది రొటీన్ స్టోరీ. దీనికి మాస్ మసాలాలను జోడించే ప్రయత్నంలో బాబీ చాలా వరకు సక్సెస్ అయ్యాడు అనే దానికంటే.. అభిమానం చాటుకున్నాడని చెప్పుకోవాలి. అయితే.. అభిమాన హీరో స్థాయిని ఊహించాడే కానీ.. ఆడియన్స్ స్టామినాని మాత్రం అంచనావేయలేకపోయాడు. మెగాస్టార్‌‌, మాస్‌రాజాలని తెరపై చెలరేగిపోయేలా చేసి.. తన వీరవిధేయత ప్రదర్శించాడు కానీ.. భారీ పోటీ ఉంటుందని ఊహించలేకపోయాడు. మరో విషయం ఏమిటంటే.. ఒక రోజు ముందుగా వచ్చిన వీరసింహ ఫ్లాట్ కూడా ఇదే. కాకపోతే అక్కడ సిస్టర్.. ఇక్కడ బ్రదర్. అక్కడ బాలయ్య.. ఇక్కడ చిరంజీవి అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. గోపీచంద్ మలినేని గూటి నుంచి వచ్చిన దర్శకుడే కావడం వల్ల ఇలా జరిగిందో.. లేదంటే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తామని చెప్పదలుచుకున్నారో తెలియదు కానీ.. ఇద్దరూ వీర అభిమానులం అని నిరూపించుకున్నారు.

పంచ్ లైన్: వాల్తేర్ వీరయ్య-ఫాన్స్ కి నచ్చేస్తావయ్యా 

రేటింగ్: 2.75/5

Cinejosh Review: Waltair Veerayya :

Waltair Veerayya Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement