Advertisement

సినీజోష్ రివ్యూ : ప్రిన్స్

Mon 24th Oct 2022 08:14 PM
prince movie telugu review  సినీజోష్ రివ్యూ : ప్రిన్స్
Cinejosh Telugu Review Prince సినీజోష్ రివ్యూ : ప్రిన్స్
Advertisement

 

సినీజోష్ రివ్యూ : ప్రిన్స్   

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - సురేష్ ప్రొడక్షన్స్ - శాంతి టాకీస్   

నటీనటులు : శివ కార్తికేయన్, మారియా ర్యాబోషపక, సత్యరాజ్,  ప్రేమ్ జీ తదితరులు

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస   

ఎడిటర్ : కె.ఎల్.ప్రవీణ్

సంగీతం : ఎస్.ఎస్.థమన్   

సమర్పణ : సోనాలి నారంగ్

నిర్మాతలు : సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుష్కర్ రామ్మోహన్ రావు  

రచన, దర్శకత్వం : కె.వి.అనుదీప్  

విడుదల తేదీ :  21-10-2022


స్టేజ్ షోస్ ఇచ్చే స్థాయి నుంచి స్టార్ హీరో అనిపించుకునే రేంజ్ వరకు అంచెలంచెలుగా ఎదిగిన శివ కార్తికేయన్ పట్ల తమిళ తంబీలు చూపించే అభిమానం తక్కువేమి కాదు. ఈ మధ్య కాలంలోనే డాక్టర్, డాన్ చిత్రాలతో తెలుగునాట కూడా శివ కార్తికేయన్ కి కాస్త మార్కెట్ ఏర్పడింది. అందుకేనేమో జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అనుదీప్ బై లింగ్వల్ సినిమా కోసం శివ కార్తికేయన్ ని కలిశారు. సురేష్ బాబు, సునీల్ నారంగ్ వంటి అగ్ర తెలుగు నిర్మాతలు సపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ గా ప్రాజెక్ట్ సెట్టయింది. ప్రిన్స్ అనే టైటిల్ ఫిక్సయింది. జాతిరత్నాలుకి మించిన మిరకిల్ మరోసారి చేసేద్దామని అనుదీప్ అనుకున్నాడు. అదే శివ కార్తికేయన్ కూడా నమ్మాడు. అలా రూపొందిన ప్రిన్స్ పట్ల మొదట్నుంచి బజ్ రైజ్ అవ్వకపోయినా ఓ రెండు పాటలతో థమన్ తనవంతు ప్రయత్నం చేసాడు. మన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయి అండగా నిలిచాడు. మరిక దీపావళి పోటీలోకి ధీటుగా దిగిపోయిన ప్రిన్స్ చిత్రం నేడు విడుదలైన నేపథ్యంలో శివ కార్తికేయన్ - అనుదీప్ లక్ రిపీట్ అయిందో, రివర్స్ అయిందో రివ్యూలో చెక్ చేద్దాం పదండి.!


స్టోరీ : ఆనంద్ (శివ కార్తికేయన్) దేవరకోట అనే ఒక ఊళ్లోని స్కూల్ లో సోషల్ టీచర్. అదే స్కూల్ కి బ్రిటన్ కి చెందిన జెస్సికా (మరియా) అనే అమ్మాయి ఇంగ్లీష్ టీచర్ గా వస్తుంది. ఇంకేముంది.. (ఇక్కడ్నుంచి జరిగే విషయం జనులందరికీ విదితమే). ఆనంద్ ఆమెని చూడగానే తనూ ఓ టీచర్ అనే మ్యాటర్ మర్చిపోతాడు. టీనేజ్ బాయ్ టైపులో ఆనంద లోకాల్లో విహరించేస్తాడు. అమాంతం ప్రేమలో పడిపోతాడు. మరిక ఏదో ఒక అవరోధం ఎదురవ్వాలి కదా (కథని కాస్తో కూస్తో కదపాలి కదండీ). ఆనంద్ తండ్రికి విదేశీయురాలైన అమ్మాయిని తన కొడుకు ప్రేమించడం నచ్చదు (ఇంతోటి పనికిమాలిన పాయింట్ ని పాత సినిమాల్లో చాలాసార్లు చూసేసి ఉన్నాం కనుక మనకీ నచ్చదు).  అయితే అనుదీప్ అపరిమితమైన తెలివున్నోడు కనుక ఒక్కసారిగా ఇక్కడ హీరో ఫాదర్ ప్రాబ్లెమ్ ని పక్కన పెట్టి - హీరోయిన్ ఫాదర్ ప్రాబ్లెమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు (ఈ ట్విస్ట్ కే ఎక్సయిట్ అయ్యే ఆడియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు శాటిలైట్ చానెల్స్ లో సీరియల్స్ చూసుకోవడం బెస్ట్). ఇంతకీ బ్రిటన్ కి చెందిన హీరోయిన్ గారి ఫాదర్ గారికి వచ్చి పడ్డ కష్టం ఏమిటీ అంటే అదో స్థల వివాదం. దాన్ని పరిష్కరించేసే బాధ్యత చేపడతారు హీరోగారు (ఇలాంటి ముతక కథ రాయడం అనుదీప్ తడపాటు. నమ్మడం శివ కార్తికేయన్ తత్తరపాటు. ఇంకేదో ఆశించి వెళ్లడం మాకు భంగపాటు. ఇదేమీ తెలియక సినిమాకి వెళ్లుంటే అది మీ గ్రహపాటు).


స్క్రీన్ ప్లే : 70 mm స్క్రీన్ పైన 70s కాలం నాటి కథ ప్లే అవుతూ వుంటే దాని గురించి ఒక చాప్టర్ రాయాలా.. దాన్నే స్క్రీన్ ప్లే అనాలా.? అదింకో అనుదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో అవ్వుద్దేమో.! నేరేషన్ కి పడిపోయే హీరోని .. నేటి సక్సెస్ చూసి పాకులాడే ప్రొడ్యూసర్ ని ఇద్దర్నీ ట్విన్స్ చేసి షాకిచ్చిన ప్రిన్స్ డెఫినిట్ గా కొంతకాలం అందరికీ గుర్తుండిపోతుంది. టు బి ఫ్రాంక్ ఈ స్క్రిప్ట్ లో, ఈ స్క్రీన్ ప్లే లో ఏదైనా మ్యాటర్ ఉందీ అంటే.. పాపం ఏదో తనకు వచ్చిన వాటిలో కాస్త మంచి కథనే ఎంచుకోగలిగే శివ కార్తికేయన్ ప్రిన్స్ ట్రాన్స్ లోకి ఎలా వెళ్ళాడు అనేదే..! వరుస విజయాల వల్ల మతి పోయిందో, మితిమీరాడో.. ఆ రెండూ కాక ప్రముఖ నిర్మాతల అండ వల్ల తెలుగు రంగాన పాగా వేసేయ్యొచ్చు అనుకున్నాడో.. ఏదైతేనేం శివ కార్తికేయన్ తప్పటడుగు పడింది - తగ్గ రిజల్ట్ వచ్చింది. నిజానికి ఇదే సరైన స్క్రీన్ ప్లే. రాసింది విధి. విడమరిచి వివరించేది విమర్శకుల హృది.!


ఎఫర్ట్స్ : ఈ సినిమాకి సంబంధించి ఏ గొడవా లేకుండా తమ ఎఫర్ట్ అనే గొడుగుల చాటున దాటుకుపోగలిగే ముగ్గురు వ్యక్తులున్నారు. మొదటి స్థానం శివ కార్తికేయన్ కే ఇద్దాం. ఇన్నేళ్ల తన కష్టం ఈ ఒక్క సినిమాతో మర్చిపోయేది కాదు. ఇన్నాళ్ల తన సక్సెస్ ఈ ఒక్క ఫలితంతో మసకబారేదీ లేదు. ఎదగడానికి ఆకాశమంత ఎత్తు కళ్ళకి కనిపిస్తుంటే.. ఎప్పుడు కాలుజారినా నిలబడేందుకు నేల కాళ్ళను భరిస్తుంది. అక్కడ్నుంచే వచ్చినవాడు కనుక, తాను నమ్మినదానికి ఇవ్వగలిగినంత ఇచ్చాడు కనుక రిగ్రెట్ అవ్వాల్సిందేం ఉండదు. రీ ఛార్జ్ అవ్వాలంతే. రెండో వ్యక్తిగా సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమ హంసని పట్టుకురావాలి లిస్ట్ లోకి. ఆయన ఓ వైపు భావుకత్వాన్ని - మరోవైపు భరించే తత్వాన్ని బ్యాలన్స్ చేయడం వల్లే ఈ రోజు ప్రిన్స్ ని కొందరైనా పూర్తిగా చూడగలుగుతున్నారు. ఇక మూడో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఇతనిపై కంప్లైంటు వుంటుంది.. కాంప్లిమెంటు వుంటుంది. రెండు మంచి పాటలు ఇచ్చినందుకు అతన్ని అభినందించాలి. ఆ రెండు తప్ప మరేదీ లేని సినిమాకి మనలాంటి వాళ్ళను లాగినందుకు ఆక్షేపించాలి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా తమ కర్తవ్యం నిర్వర్తించారు. కానీ ప్లస్ మార్కులు కొట్టిన ముగ్గురికీ.. మైనస్ మార్కులు మొత్తం మావేనన్న దర్శక నిర్మాతలకి మధ్యలో మిగిలిపోయారు.


ఎనాలసిస్ : ఫ్లూక్ సక్సెస్ తో - ప్రాంక్ వీడియోస్ తో, లేకి కామెడీతో - లేని టాలెంటుతో ఎక్కువ కాలం మనలేమని, ఏదీ మనదనలేమనీ, ఎంతటి విజయమైన భుజాలవరకు చేర్చుకుంటే బాహుబలిలా మొయ్యొచ్చని - తలకెక్కితే మాత్రం తప్పటడుగులు తప్పవని ఓ దిగ్ధర్శకుడు చెప్పిన మాటలు ఎందుకో గుర్తొస్తున్నాయి. సందర్భోచితమా.. సమయానుకూలమా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సరైన అభిప్రాయాలను సర్వదా ప్రస్తావించుకోవచ్చు. అయినా ప్రిన్స్ సినిమా ఎనాలసిస్ లో ఈ పిచ్చి ప్రస్తావన ఎందుకూ అంటారా... చదివేవాళ్ళకు కాదు, ఆ చిత్ర రాజాన్ని చూసి వచ్చిన వాళ్లకు ఉంటుంది ఫ్రస్ట్రేషన్. పైగా దాని గురించి రాసే వాళ్లకు వస్తుంది ఇంకా ఇరిటేషన్. రివ్యూవర్స్ కూడా అందరిలాంటి వాళ్ళే అండీ.. అనుదీప్ లు కాదు..! 

ఇంకా మీరు కంక్లూజన్ ఎక్సపెక్ట్ చేస్తుంటే చెప్పగలిగేది ఏముంటుంది..

ఈ ప్రిన్స్ కోసం థియేటర్స్ కి వెళ్లడం దండగ.

మరో రెండు రోజుల్లో దీపావళి పండగ.

మనీ సేవ్ చేస్కోండి మీకోసం అండగ.

టైమ్ వేస్ట్ ఎందుకు OTT ఉండగ .!


పంచ్ లైన్ : సెన్స్ లేని ప్రిన్స్

సినీజోష్ రేటింగ్ : 1.5/ 5

 

 

Cinejosh Telugu Review Prince:

Prince movie review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement