Advertisement

సినీజోష్ రివ్యూ : శాకిని డాకిని

Fri 16th Sep 2022 07:57 PM
saakini daakini movie,saakini daakini review,saakini daakini telugu review  సినీజోష్ రివ్యూ : శాకిని డాకిని
Cinejosh Review: Saakini Daakini సినీజోష్ రివ్యూ : శాకిని డాకిని
Advertisement

సినీజోష్ రివ్యూ : శాకిని డాకిని  

బేనర్ : గురు ఫిలిమ్స్, క్రోస్ పిక్చర్స్ అండ్  సురేష్ ప్రొడక్షన్స్ 

నటీనటులు : రెజీనా కసాండ్రా, నివేదా థామస్, రఘుబాబు, పృథ్వి, సుధాకర్ రెడ్డి తదితరులు    

సంగీతం : నరేష్ కుమారన్ 

సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్ 

ఎడిటింగ్ : విప్లవ్ నైషధం 

నిర్మాత : సునీత తాటి  

దర్శకత్వం : సుధీర్ వర్మ  

విడుదల తేదీ : 16-09-2022

C /O కంచరపాలెం సినిమాతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు సునీత తాటి. దర్శకుడిగా తనదో విభిన్న శైలి అని ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ. వీరిద్దరికీ ఎంతో నచ్చి మెచ్చి ఎంచుకున్న కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ ని మన ముందుకి రీమేక్ రూపంలో తేవాలనుకున్నారు. క్యారెక్టర్స్ ని మార్చారు. రెజీనాని నివేదాని చేర్చారు. శాకిని - డాకిని అనే టైటిల్ పెట్టేసారు. OTT రిలీజ్ కోసం చుట్టేశారు. ఐతే అనుకోకుండా థియేటర్స్ తలుపు తట్టే అవకాశం దొరకడంతో నేడు ఆ చిత్ర రాజాన్ని ప్రేక్షకుల పైకి వదిలారు. బేసిక్ స్టోరీలోని సోల్ ని గాలికొదిలేసి.. ఆ స్క్రీన్ ప్లే లోని ఎసెన్స్ ని సెన్స్ లెస్ గా పక్కన పడేసి శాకినీ - డాకినీ టైటిల్ పెట్టడం దగ్గర్నుంచే తమ సొంత పైత్యం ప్రదర్శించిన ఈ దర్శక నిర్మాతలు తెరపై ప్రదర్శించిన ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా ఉందంటే....

బేసిక్ పాయింట్ : దామిని (రెజీనా) - షాలిని (నివేదా) ఇద్దరూ (వాళ్లెవరని అడగొద్దు) పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడెమీలో జాయిన్ అవుతారు. అక్కడ ఇద్దరికీ మధ్య ఈగో క్లాషెస్ వస్తుంటాయి (అవేంటని అనొద్దు). ఇద్దరికీ మధ్య ఎప్పుడూ వివాదమే.. విభేదమే (ఎందుకని ఆలోచించొద్దు). ఓ రోజు రాత్రి ఔటింగ్ కి వెళ్లిన ఈ వనితామణులు అక్కడొక అమ్మాయి కిడ్నాప్ అవడం చూస్తారు. వేరే కేసెస్ లో బిజీగా ఉన్న పోలీస్ డిపార్ట్ మెంట్ ఈ కిడ్నాప్ కేసు పట్టించుకోవట్లేదని వీర మహిళలిద్దరు ఒకటవుతారు. రంగంలోకి దిగుతారు. ఇక ఆపై ఏం జరుగుతుందో స్కూల్ డేస్ సుధీర్ వర్మ రాసెయ్యగలడు. స్కూటీ నడిపిన నాటి సునీత తాటి చెప్పెయ్యగలదు. దీనికి రీమేక్ రైట్స్ ఎందుకు అన్నది ఒక పాయింట్ అయితే.. అసలిది రీమేక్ చేయడం ఎందుకు అన్నది మరొక పాయింట్. అయ్యో.. సినిమాలోని అసలు పాయింట్ కంటే ఈ కొసరు పాయింట్స్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాయ్. ఇక ఆపేద్దాం.!

ప్లస్ పాయింట్ : మిడ్ నైట్ రన్నర్స్ ని ఫిమేల్ సెంట్రిక్ ఫిలింగా మార్చడం మెచ్చదగిన అంశమే. బట్ ఆ థాట్ కి తగ్గ రైటింగ్ ఎఫర్ట్ యాడ్ అయుంటే బాగుండేది. రెజీనా - నివేదా ఇద్దరూ పోటా పోటీగా పెర్ ఫార్మ్ చేసారు. కథనం కరెక్ట్ గా ఉండి ఉంటే ఆ ఇంపాక్ట్ ఆడియన్సుకి తెలుసుండేది. రఘుబాబు, పృద్వీ ఇంకా ఇతరులు ఎంత పాత్రోచితంగా నటిస్తున్నా కథలో కరెక్ట్ గా కలిసుండాల్సింది. ఇవేమి జరగకున్నా ఇది ఓకె సినిమానే. ఓటిటి సినిమానే.!

మైనస్ పాయింట్ : కథని ఆపాదించడంలో చూపిన చొరవని అనువదించడంలో విస్మరించాడు దర్శకుడు. మన నేటివిటీకి అనుగుణంగా ఆ కాన్సెప్ట్ ని మలిచే ప్రాసెస్ లో బేసిక్స్ ని విడిచేసి, లాజిక్స్ ని వదిలేసి పూర్తిగా సినిమాటిక్ లిబర్టీ ని తీసేసుకున్నాడు. అక్కడే బోల్ట్ తప్పింది. జోల్ట్ తగిలింది. తెరపై ఎవరికి ఏం జరుగుతున్నా, ఎంత అవుతున్నా ఆడియన్స్ నిర్లిప్తంగానే చూస్తున్నారు అంటే అది స్క్రీన్ ప్లే లోని నిస్తేజమే.. నిర్లక్ష్యమే. రిచర్డ్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్, నరేష్ మ్యూజిక్ అన్నీ ఈ ప్రాజెక్ట్ కి తగ్గట్టే ఉన్నాయి.

ఫైనల్ పాయింట్ : నిజానికి ఒక డేడికేటింగ్ డైరెక్టర్ నుంచి - ప్యాషనేటింగ్ ప్రొడ్యూసర్ నుంచి మనం ఇంతకంటే ఎక్కువే ఆశిస్తాం. ఆశించాం కాబట్టి భంగపడతాం. ఒక కథని ప్రెజెంట్ చేసే ప్రతి దర్శకుడికి తన టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలిసే ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ చేస్తున్న ప్రతి ప్రొడ్యూసర్ కి తన మార్కెట్ జోన్ ఏదో ఐడియా ఉంటుంది. అందుకనుగుణంగానే ప్రత్యేకించి ఓటిటి ప్లాట్ ఫామ్ కోసమని సిద్దమయిన ఈ చిత్రాన్ని అనుకోని అవకాశాలు తలుపులు తట్టడంతో, థియేటర్లకు దారులు తెరుచుకోవడంతో ప్రేక్షకుల ముందుకు పంపించారు. ఇక్కడ రెస్పాన్స్ ఇంతే ఉండొచ్చు రేపటిరోజున ఓటిటి వేదికపై ఇంకెంతో ఉండొచ్చు. ఏదేమైనా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని విమర్శించలేం. అలాగని ఆ నిర్లక్ష్య ధోరణిని ప్రశంసించలేం.

పంచ్ లైన్ : శాకిని డాకిని - OTT కాపాడుతుంది మీ టైమ్ ని.!

సినీజోష్ రేటింగ్ : 1.5 /5

Cinejosh Review: Saakini Daakini :

Saakini Daakini Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement