Advertisement

సినీజోష్ రివ్యూ: బింబిసార

Fri 05th Aug 2022 02:50 PM
bimbisara review,bimbisara movie,bimbisara movie review,bimbisara telugu review,kalyan ram bimbisara review bimbisara review  సినీజోష్ రివ్యూ: బింబిసార
Cinejosh Review: Bimbisara సినీజోష్ రివ్యూ: బింబిసార
Advertisement

సినీజోష్ రివ్యూ: బింబిసార 

బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్ 

నటీనటులు: కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కాథరిన్, వరిన హుస్సేన్, వెన్నెల కిశోరె, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు

మ్యూజిక్: చిరంతన్  భట్, వరికుప్పల యాదగిరి 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: చోట K నాయుడు 

ఎడిటింగ్: తమ్మిరాజు 

నిర్మాత: హరికృష్ణ 

డైరెక్టర్: మల్లిడి వసిష్ఠ 

రిలీజ్ డేట్ 05-08-2022 

పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత్రల పోషణ తనకు మాత్రమే సాధ్యమని స్వర్గీయ ఎన్ఠీఆర్ అప్పట్లోనే దేశమంతటికీ తెలిసేలా చాటిచెప్పారు.

ఆపై ఆ తరహా పాత్రల ఆహార్యం, ఆంగికం, వాచకం నందమూరి వంశానికే సొంతమంటూ బాలకృష్ణ నిరూపించారు.

ఇప్పుడదే బాధ్యతను భుజాన వేసుకుంటూ.. మోసుకుంటూ నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార గాథను తెరపైకి తెచ్చారు.

నాకు నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను అంటూ 2005 లోనే అతనొక్కడే చిత్రంతో సురేందర్ రెడ్డి వంటి హైలీ టాలెంటెడ్ డైరెక్టరునీ, 2015 లో పటాస్ చిత్రంతో అనిల్ రావిపూడి వంటి నేటి తరం జంధ్యాలనీ టాలీవుడ్ కి అందించిన నందమూరి కళ్యాణ్ రామ్ మరో కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ బింబిసార అనే భారీ ప్రాజెక్టుని తలపెట్టారంటే అందులో ఖచ్చితంగా విషయం ఉండే ఉంటుందని మొదటినుంచీ నమ్మకం ఏర్పడిపోయింది.. బలపడిపోయింది. 

మరి థియేటర్లకు జనం రావట్లేదనే ప్రస్తుత ప్రతికూల పరిస్థితులనే ఛాలెంజ్ చేస్తూ.. దమ్మున్న సినిమా చూపిస్తా నమ్మండంటూ నేడు ప్రేక్షకుల ముందు బింబిసారను దింపిన కళ్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నారో.. ఎంతవరకూ తన జడ్జిమెంటుని నిలుపుకున్నారో రివ్యూలో చూద్దాం. 

కథ:

కొన్ని వందల సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసార (కల్యాణ్ రామ్) అనే రాజు ఉండేవాడు. అతను చాలా దుర్మార్గుడు. తనని వ్యతిరేఖించే, ఎదురు వచ్చే వారిని కనికరం లేకుండా చంపేస్తాడు. ధనదాహంతో బింబిసార తన సంపద మొత్తాన్ని రహస్య గదిలో దాచిపెడతాడు. బింబిసార తన తమ్ముడు దేవదత్తు ని చంపబోయి మాయ అద్దం కారణంగా ఆధునిక యుగంలోకి(వర్తమానంలోకి) వచ్చిపడతాడు. మాయ అద్దం తో వర్తమానంలోకి ట్రావెల్ చేసిన బింబిసారుడుకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మళ్ళీ బింబిసారుడు తన సామ్రాజ్యంలో అడుగుపెట్టడా.. అనేది క్లుప్తంగా బింబిసార కథ. 

నటీనటులు:

బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ లుక్స్ విషయంలో మంచి మార్కులు కొట్టేసారు. రాజు కి ఉండాల్సిన శరీరాకృతి కోసం కళ్యాణ్ రామ్ కష్టం తెరపై కనిపిస్తుంది. ఫేస్ ఎక్సప్రెషన్స్ విషయంలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా కనిపించారు. కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్‌ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చక్కగా చూపించారు. అటు మోడరన్ లుక్ లోను కళ్యాణ్ రామ్ బెస్ట్ ఇచ్చారు. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. హీరోయిన్స్ లో కేథరిన్ థెరిసా పాత్ర నిడివి తక్కువైనా ఉన్నంతలో మెప్పించింది. మరో హీరోయిన్ సంయుక్త మీనన్ ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా ఉంది. ఆమె పాత్ర మలిచిన తీరు అంతగా ప్రేక్షకుడు కి రుచించదు. ఇక విలన్ కేరెక్టర్ వరిన హుస్సేన్ కన్నా ఇంకాస్త పేరున్న నటుడైతే.. అటు కళ్యాణ్ రామ్ పాత్ర, ఇటు విలన్ పాత్ర రెండూ ఇంకాస్త హైలెట్ అయ్యేవి.. మిగతా నటులు తమ పరిధిమేర మెప్పించారు.

సాంకేతికంగా..

సాంకేతికంగా బింబిసార చాలా రిచ్ గా ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. చిరంతన్  భట్, వరికుప్పల మ్యూజిక్ తో పాటలు పర్వాలేదనిపించినా.. ఈశ్వరుడే సాంగ్ ప్రత్యేకంగా నిలిచింది. కీరవాణి బీజీఎమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. కెమెరా మ్యాన్ చోట కె నాయుడి సీనియారిటీ.. ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రొడక్షన్ పరంగా చాలా రిచ్ గా ఉంది. 

విశ్లేషణ:

బాహుబలి లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చూసాక, రాజు అంటే ప్రభాస్ అని ఊహించుకుంటున్న ఆడియన్స్ తో శెభాష్ అనిపించుకోవాలంటే ఎంత గట్స్ ఉండాలి. ఎంత సాహసం చెయ్యాలి. అందులోను కొత్త దర్శకుడు, ఇటు వరస ఓటములతో ఉన్న హీరో కలయికలో రాజుల నేపథ్యంలో మూవీ అంటే ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి ఉంటుందో అనేది ఊహించడం కాదు.. కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అలాంటి నెగెటివిటి నుండి కొత్త దర్శకుడు వసిష్ఠ తో కలిసి కళ్యాణ్ రామ్ బింబిసార కి భారీ ఓపెనింగ్స్ తీసుకురావడం అంటే.. ఆ సినిమా ని ఎంతగా ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళారో అర్ధమవుతుంది. రాజమౌళి అంత కాకపోయినా..వశిష్ట తన టాలెంట్ ని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. టైం ట్రావెల్ ఫ్రం బ్యాడ్ టు గుడ్ అంటూ బింబిసార ట్యాగ్ లైన్ ఉంటుంది. ఒక పొగరుబట్టిన దుర్మార్గపు రాజు.. వర్తమానంలోకి వచ్చి తనలోని దుర్మార్గాన్ని చంపేసి మనిషిగా మారడం అనేది దర్శకుడు కామెడీ జోడించి చూపించాడు. ఫ్లాష్ బ్యాగ్ స్టోరీని డైరెక్ట్ గా మొదలు పెట్టడం లాంటి కొత్తదనం ఇక్కడ ప్లస్ అయ్యింది. ఆరంభ సన్నివేశాలతో ఆసక్తిని రేకెత్తించి ఇంటర్వెల్ ముందు అద్భుతమైన ఫైట్ ని జోడించి, క్లైమాక్స్ లోను క్లాసీ ఫైట్ తో ఎండ్ చెయ్యడం ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి.. రాక్షస రాజుగా తన పెరఫార్మెన్స్ తో మెస్మరైజ్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌ బింబిసార సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.

పంచ్ లైన్ : మరో ఫ్రాంచైజీ మొదలైంది.! 

రేటింగ్: 2.75/5

 

 

 

 

Cinejosh Review: Bimbisara:

Bimbisara Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement