Advertisement

సినీ జోష్ రివ్యూ: ది వారియర్

Thu 14th Jul 2022 02:05 PM
the warrior,the warrior movie review,the warrior review,the warrior telugu review,ram the warrior review,the warrior tamil review  సినీ జోష్ రివ్యూ: ది వారియర్
Cinejosh Review: The Warrior సినీ జోష్ రివ్యూ: ది వారియర్
Advertisement

సినీ జోష్ రివ్యూ: ది వారియర్

నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడా, నదియా తదితరులు  

ఎడిటింగ్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్

మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ 

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

నిర్మాతలు: చిట్టూరి శ్రీనివాస్ 

దర్శకత్వంల లింగుసామి

రిలీజ్ డేట్: 14-07-2022

సామాన్య ప్రేక్షకులు ఓహో అంటున్న సినిమాలు ఓటిటికే పరిమితమైపోతున్నాయి. పక్కా కమర్షియల్ సినిమాలు పక్కదారి పడుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో కాన్ టెంపరరీ స్టార్ హీరోల సినిమాలేవీ కానరావడం లేదు. టాలీవుడ్ కి ఓ సాలిడ్ హిట్ కావాల్సిన సందిగ్ద సమయమిది. ఇస్మార్ట్ శంకర్ తో 'రెడ్' ఫామ్ లోకి వచ్చిన రామ్ తమిళ మాస్ డైరెక్టర్ లింగుసామి తో జతకడుతూ, ఇదే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూ.. ఎంతో కాన్ఫిడెంట్ గా చేసిన సినిమా ది వారియర్. రామ్-లింగుసామి ల ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కి యువతని ఆకర్షించే బేబమ్మ కృతి శెట్టి యాడయ్యింది. ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి చేరాడు. ప్రతిధ్వనించే శబ్దాన్నివ్వడానికి దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడు. రిలీజ్ చేసిన ప్రతి పాటా హిట్టే. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ సూపరే. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన ఎటువంటి ఓపెనింగ్స్ వస్తాయో అనే మీమాంశల మధ్య కూడా వెనకడుగు వెయ్యకుండా వచ్చిన వారియర్ కి ప్రేక్షకులు నుండి మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకున్న వారియర్ ఆన్ స్క్రీన్ పై ఏం చేసాడో? ఏం చూపించాడో? చూద్దాం రివ్యూలో..

కథ:

తన తల్లి రాజ్యలక్ష్మి(నదియా) తో కలిసి కర్నూల్ నగరంలో అడుగుపెట్టిన హౌస్ సర్జన్ సత్య(రామ్ పోతినేని) అక్కడ జరిగే కొన్ని పరిస్థితులని గమనిస్తాడు. ఆ ప్రాంతంలో గురు(ఆది పినిశెట్టి) చేస్తున్న దుర్మార్గాల గురించి తెలుసుకుంటాడు. అయినా వాటిపై స్పందించలేక, తిరగబడలేక తిరుగు ముఖం పట్టిన సత్య ఎలా తిరిగి వచ్చాడు? ఏ స్థాయిలో ఎదురు తిరిగాడు? ఎంతటి వారియర్ గా మారాడు? అనేదే క్లుప్తంగా ఈ వారియర్ కథ.

నటీనటులు:

రామ్: ఓ మంచి పోలీస్ కేరెక్టర్ చెయ్యడం కోసం చాలా కాలం నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పిన రామ్ నిజంగానే తాను ఆశించిన స్థాయిలో దొరికిన కేరెక్టర్ కి 100 పర్సెంట్ జెస్టిఫై చేసాడు. ఫస్ట్ హాఫ్ లో డాక్టర్ గా కనిపించిన సీన్స్ లో ఎంత సెటిల్డ్ పెరఫార్మెన్స్ ఇచ్చాడో.. పోలీస్ ఆఫీసర్ గా టర్న్ అయ్యే సీన్స్ లో అంతకుమించి చెలరేగిపోయాడు. అదే ఊపుని, ఉత్సాహాన్ని, వాడిని.. వేడిని సినిమా ఆద్యంతం చూపించాడు. ఫైట్స్ లో తన అల్టిమేట్ ఎనేర్జిని చూపించిన రామ్ సాంగ్స్ లో అన్ బిలీవిబుల్ గ్రెస్ చూపించాడు. రామ్ డాన్స్ మూమెంట్స్ కి తెలుగు ఆడియన్స్ కాదు, తమిళ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యిపోతున్నారనే మాట మార్నింగ్ షో టాక్. 

అది పినిశెట్టి: అలాగే ఈ సినిమాకి మెయిన్ సేవింగ్ గ్రేస్ అయిన ఆది పినిశెట్టి గురు కేరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చేసింది నెగెటివ్ రోలే అయినా అంతటా అతని పెరఫార్మెన్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటే.. దానికి కారణం అతని అభినయమే. తాను కనిపించిన ప్రతి సీన్ లోను తనదైన శైలిని చూపించి స్క్రీన్ పై ఫైర్ పుట్టించాడు.

కృతి శెట్టి: కృతి శెట్టి క్యూట్ పెరఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఆ లవ్ ట్రాక్ ఇంకెంచెం బెటర్ గా ఉంటే బావుండేది అనేది ఆడియన్స్ ఫీలింగ్. డైరెక్టర్ ఇచ్చిన స్క్రీన్ స్పేస్ లో తనకొచ్చిన యాక్టింగ్ స్కోప్ తో బాగానే మేనేజ్ చేసిన బేబమ్మ డాన్స్ లో మాత్రం రామ్ తో పోటీ పడలేకపోయింది. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు .

సాంకేతిక వర్గం:

టెక్నీషియన్స్ విషయాన్ని వస్తే.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ ఎక్సట్రార్డినరీ అని చెప్పాలి. అటు సాంగ్స్ కానీ, ఇటు ఫైట్స్ కానీ ఆపై టాకీ పార్ట్ కానీ అన్నిటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తూ కలర్ ఫుల్ విజువల్స్ అందించాడు సుజిత్. నవీన్ నూలి ఎడిటింగ్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగానే సాగింది అనుకోవాలి. ఆడియో పరంగా వారియర్ కి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ బీజీఎమ్ విషయంలో మాత్రం ఆ మ్యాజిక్ చెయ్యలేకపోయాడు. ఎన్నో సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వీక్ అయ్యిపోయిందని కామన్ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారంటే దేవి తనని తానే రీ చెక్ చేసుకునే టైం వచ్చిందనే చెప్పాలి. గత కొంతకాలంగా కొందరు దర్శకులతో మాత్రమే దేవి సరిగా పని చేస్తున్నాడనే విమర్శలకు త్వరలోనే తను సమాధానం ఇవ్వాలి. డైలాగ్స్ దర్శకుడు కోరుకున్నట్టుగానే ఉండగా.. ఆర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఇతర సాంకేతిక విభాగాలు ఆ కథకు తగ్గట్టుగా కావాల్సినవి అమర్చాయి. 

ఇక దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం 2002 లో ఆయన చేసిన రన్ తమిళనాటే కాదు, తెలుగునాట కూడా పరుగులు పెట్టింది. ఆపై పందెం కోడి కూత  కూడా గట్టిగానే వినిపించింది. ఆవారా హవా తెలుగులోనూ వీచింది. వేట్టై తఢాకా తెలుగులోనూ చూసాం. మాస్ పల్స్ బాగా తెలిసిన లింగుసామి పై చాలామంది తెలుగు హీరోలు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. అవి ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా తెలుగు సినిమా చేయాలనుకుంటున్న లింగుసామి కి తమిళ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్న రామ్ కి జత కలిసింది. వారియర్ తో జోడి కుదిరింది. తెలుగు రాష్ట్రాలకి తన డైరెక్ట్ సినిమా ఇవ్వాలనుకున్న లింగుసామి, తమిళ్ ఆడియన్స్ కి తన ఎనేర్జి చూపించాలన్న రామ్ కి వారియర్ వారధిగా మారింది. అయితే ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ ని లింగుసామి తన డైరెక్టోరియల్ స్కిల్స్ తో ఎంగేజ్ చెయ్యగలిగితే, సెకండ్ హాఫ్ భారం రామ్ - ఆది మోసారని చెప్పాలి. రన్, పందెం కోడి, ఆవారా సినిమాల తాలూకూ ఇంపాక్ట్ ఈ సినిమాలో మిస్సయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ ట్రాక్ విషయంలో. కానీ ఈ వారియర్ బాక్సాఫీస్ వార్ లో ఫర్లేదు అనిపించుకునే స్థాయిలో నిలబడగలిగాడు అంటే అది సత్య-గురు పాత్రల వల్లే.!

విశ్లేషణ:

విచిత్రంగా వారియర్ ఫేస్ చెయ్యాల్సిన పరిస్థితి వానలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వలన ఓపెనింగ్స్ విషయంలో మనకి ఆ తేడా కనిపిస్తున్నా, ఇలాంటి పరిస్థితుల్లోనూ చాలా ఏరియాస్ లో హౌస్ ఫుల్ థియేటర్స్ చూపించిన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ రామ్ కి ఉంది అని ప్రూవ్ చేసిన సినిమా వారియర్. ప్యూర్ మాస్ ఎలిమెంట్స్ తో థియేటర్స్ లోకొచ్చిన వారియర్ ని ఇటువంటి క్లిష్టపరిస్తితుల్లోనూ ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారనే దానిపై ఫైనల్ రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. విశ్లేషణలో ఈ సినిమాలోని మైనస్ లు చెప్పాలంటే.. డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాస్త తగ్గారనో, తప్పటడుగులు తొక్కారనో చెప్పాలి తప్ప సినిమాలో మాత్రం ఆది అదరహో, రామ్ రాంపింగ్.

పంచ్ లైన్: ది వారియర్ - మాస్ పల్స్ క్యారియర్ 

రేటింగ్: 2.75/5

Cinejosh Review: The Warrior:

The Warrior Movie Telugu review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement