Advertisement

సినీ జోష్ రివ్యూ: సర్కారు వారి పాట

Thu 12th May 2022 11:31 AM
sarkaru vaari paata movie,sarkaru vaari paata review,sarkaru vaari paata telugu review,sarkaru vaari paata movie review,mahesh sarkaru vaari paata review,svp review,svp telugu review  సినీ జోష్ రివ్యూ: సర్కారు వారి పాట
Cinejosh Review: Sarkaru Vaari Paata సినీ జోష్ రివ్యూ: సర్కారు వారి పాట
Advertisement

సినీ జోష్ రివ్యూ: సర్కారు వారి పాట

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్, అజయ్, నదియా, పోసాని, బ్రహ్మాజీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: ఆర్. మది

ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.వి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 

దర్శకత్వం: పరశురామ్ 

రిలీజ్ డేట్: 12-05-2023 

సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపించి ఇప్పటికి రెండున్నరేళ్లు పూర్తయ్యింది. కరోనా పాండమిక్ సిట్యువేషన్, ఇతర కారణాలతో ఆయన పరశురామ్ దర్శకత్వంలో చేసిన సర్కారు వారి పాట విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఫస్ట్ లుక్, టైటిల్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించిన సర్కారు వారి పాట కళావతి సాంగ్ తో ఆ అంచనాలు, ఆసక్తి మరింతగా పెంచేసింది. సర్కారు వారి పాట ట్రైలర్ టైం కి ఆ అంచనాలు పీక్స్ కి చేరాయి. ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై ఆ ఇంట్రెస్ట్, బజ్ మరింతగా పెరిగింది. మహేష్ బాబు మాస్ లుక్స్, అయన డైలాగ్ డెలివరీ, మహానటి కీర్తి సురేష్ తో రొమాంటిక్ సన్నివేశాలు అంటూ సినిమా కోసం ఆడియన్స్ ని వెయిట్ చేయించేలా చేసింది ట్రైలర్. ప్రమోషన్స్ లోనూ సర్కారు వారి టీం కాన్ఫిడెంట్ తో ఉండడం, మహేష్ బాబు ఫన్నీ గా సినిమాని ప్రమోట్ చెయ్యడం.. మహేష్ మాస్ ఎలివేషన్స్ చూసి ఎంతోకాలమైన ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి సర్కారు వారి పాట ని వీక్షించాలనే కోరిక మొదలయ్యేలా చేసారు. మరి నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సర్కారు వారి పాట ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అయ్యిందో సమీక్షలో చూసేద్దాం. 

కథ: 

ఆరంభమే కథను అమెరికాలో మొదలు పెట్టాడు దర్శకుడు. మహేష్( మహేష్ బాబు) అమెరికాలో ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. తన దగ్గర అప్పు తీసుకున్నవాళ్ళ నుండి వడ్డీతో తో సహా అప్పు వసూలు చెయ్యందే మహేష్ నిద్ర పోడు. డబ్బు విషయంలో అంత నిక్కచ్చిగా ఉండే మహేష్ ని కళావతి(కీర్తి సురేష్) బోల్తా కొట్టిస్తుంది. అమెరికాలో చదువుకుంటూ అక్కడ పబ్బులకి, క్లబ్బులకి తిరుగుతూ మనీ వేస్ట్ చేసే కళావతి.. తన ఒంపుసొంపులులతో, మాటలతో మహేష్ ని బుట్టలోవేసుకుని పదివేల డాలర్లు తీసుకుంటుంది. ఆ తర్వాత కళావతి తనని మోసం చేస్తుంది అని తెలుసుకున్న మహేష్ ఆ డబ్బు వసూలు కోసం ఇండియా ఫ్లైట్ ఎక్కి కళావతి తండ్రి రాజేంద్రనాధ్(సముద్రఖని) దగ్గరకు వస్తాడు. తనకి పదివేల డాలర్స్ కాదు ఇవ్వాల్సింది, పదివేల కోట్ల డాలర్స్ ఇవ్వాలి అంటూ రాజేంద్రనాధ్ కి ట్విస్ట్ ఇస్తాడు మహేష్. అసలు ఆ పదివేల కోట్ల డాలర్స్ కథేమిటి? మహేష్ తల్లితండ్రులు(నాగబాబు, పవిత్ర లోకేష్) ఎందుకు సూయిసైడ్ చేసుకుంటారు? మహేష్ గతం ఏమిటి? మోసం చేసిన కళావతిని మహేష్ క్షమించాడా? మధ్యలో నదియా కథ ఏమిటి? ఆమె జైల్లో ఎందుకు ఉంది? రాజేంద్రనాధ్ ని మహేష్ ఎలా ఢీ కొట్టాడు? అనేది తెలియాలంటే సర్కారు వారి పాటని సిల్వర్ స్క్రీన్ మీద వీక్షించాల్సిందే.

నటీనటులు:

మహేష్ బాబు నిజంగా పోకిరి రోజులు గుర్తు చేసారు. మహేష్ పాత్రలో, వడ్డీ వ్యాపారిగా అద్భుతంగా కాదు అందంగా, చాలా స్టైలిష్ గా అదరగొట్టేసారు. మహేష్ కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, మహేష్ డైలాగ్ డెలివరీ అన్ని సూపర్ అనేలా ఉన్నాయి.. మహేష్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అందంతో ఆకట్టుకున్నారు. మొత్తం మీద ఓ ముక్కలో చెప్పాలంటే మహేష్ వన్ మ్యాన్ షో నే. కళావతిగా కీర్తి సురేష్ లుక్స్ బాగున్నాయి. అందంలో మహేష్ తో పోటీపడింది. కీర్తి లుక్స్ విషయంలో మహేష్ ఫాన్స్ భయపడినట్లుగా ఏం లేదు. కళావతిగా కాస్త ఆకతాయి అమ్మయిగా కొత్తగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మహేష్ - వెన్నెల కిషోర్ తో ఫన్నీ సీన్స్ లో కామెడీ చేసింది, మహేష్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది, సెకండ్ హాఫ్ లో దర్శకుడు కీర్తి సురేష్ పాత్రని అంతగా వాడుకోలేదు. సముద్రఖని విలన్ గా బావున్నాడు, కానీ అయన కేరెక్టర్ ఇంకా పవర్ ఫుల్ గా చూపించాల్సింది. వెన్నెల కిషోర్ కామెడీ ఫస్ట్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయ్యింది, అజయ్, బ్రహ్మాజీ, నదియా, పోసాని తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

గీత గోవిందం లాంటి ఆహ్లాదకరమైన కంటెంట్ తో ఆకట్టుకున్న పరశురామ్ ప్రస్తుతం సమాజంలో చిన్న పని ఉన్నా, పెద్ద పని ఉన్నా బ్యాంకు నుండి అప్పు తీసుకుని దానికి EMI లు కట్టుకుంటూ మధ్యతరగతి ప్రజలు ఎంతగా నలిగిపోతున్నారో.. అదే బ్యాంకు రుణాలతో పెద్దపెద్దోళ్లు ఎంతగా లాభం పొంతున్నారో అనే పాయింట్ తో సర్కారు వారి పాట కథని అల్లుకున్నారు. ఆ కథకి కామెడీ జోడిస్తూ కథనాన్ని నడిపించారు. మహేష్ బాబు తల్లితండ్రులు సూయిసైడ్ చేసుకోవడంతో కథని మొదలు పెట్టి.. తర్వాత అమెరికాకి షిఫ్ట్ చేసారు. అక్కడ వడ్డీ వ్యాపారం చేసే వాడిగా హీరోని, అమెరికాలో చదుకోవడానికి వచ్చి వ్యసనాలకు బానిసగా మారిన హీరోయిన్ ని పరిచయం చేసారు. మహేష్ - కీర్తి సురేష్ మధ్యన కెమిస్ట్రీ, వెన్నెల కిషోర్ - కీర్తి సురేష్ - మహేష్ కలయికలో వచ్చే కామెడీ సీన్స్, యాక్షన్ సీన్, అలాగే కళావతి వంటి సాంగ్ తో చాలా ఆహ్లాదంగా, ఉల్లాసంగా.. ఓ ట్విస్ట్ ఇస్తూ ఫస్ట్ హాఫ్ ని ఇంటర్వెల్ బ్యాంగ్ ని ముగించారు. సెకండ్ హాఫ్ లో కళావతికి ఇచ్చిన అప్పు వసూలు కోసం మహేష్ ఇండియాకి రావడం, కళావతి తండ్రి మెయిన్ విలన్ సముద్రఖని తో మహేష్ తలపడే సీన్స్ అన్నిటిలో కామెడీని మిక్స్ చేసాడు దర్శకుడు. కాకపోతే అమెరికాలో చేసిన అప్పు కోసం ఇండియా కి హీరో వచ్చెయ్యడం లాజిక్ గా అనిపించదు. ఇలాంటి లాజిక్ కి దూరంగా ఉండే సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తూనే ఉంటాయి. కమర్షియల్ కథలకి ఇలాంటివి తప్పవు. అలాగే సముద్రఖని విలనిజాన్ని మరికాస్త ఎలివేట్ చేస్తే బావుండేది అనే ఫీలింగ్ కలగకమానదు. ఇక బ్యాంకు కి EMI లు కట్టడం వలన కలిగే నష్టాలూ గురించి హీరో చెప్పే డైలాగ్స్ బావున్నాయి. సెకండ్ హాఫ్ అంతా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. కొన్ని సన్నివేశాలు తేలిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో హైలైటయిన కళావతి - మహేష్ కెమిస్ట్రీ.. సెకండ్ హాఫ్ లో తేలిపోయిది, క్లైమాక్స్ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి, మహేష్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి సినిమానే. టోటల్ గా దర్శకుడు పరశురామ్ కథ కన్నా మహేష్ హీరోయిజం పైనే ఆధారపడినట్లుగా అనిపించే సర్కారు వారి పాట ఇది. 

సాంకేతికంగా:

థమన్ మ్యూజిక్ ఆల్బమ్ లోని కళావతి సాంగ్, మ.. మా.. మహేశా సాంగ్స్ వినడానికి వినసొంపుగా, చూడడానికి అందంగా కనిపించాయి. నేపధ్య సంగీతం లో దిట్ట అయిన థమన్.. సర్కారు వారి పాట విషయంలో ఆ నేపధ్య సంగీతం వీక్ గా అనిపించింది. ఇక సర్కారు వారి హైలెట్స్ లో మది కెమెరా గొప్పదనం కనిపిస్తుంది. అమెరికా లొకేషన్స్ ని, వైజాగ్ బీచ్ అన్నిటిని అందంగా కెమెరాలో బంధించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో కత్తెర వేయాల్సిన సీన్స్ చాలానే కనిపించాయి. సర్కారు వారి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. 

పంచ్ లైన్: సర్కారు వారి పాట.. మేటర్ లేని ఆట

రేటింగ్: 2.5/5 

Cinejosh Review: Sarkaru Vaari Paata :

Sarkaru Vaari Paata Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement